ఎకానమీ క్లాస్ లో ప్రయాణించిన రక్షణమంత్రి | manohar parrikar travels economy class to Goa | Sakshi
Sakshi News home page

ఎకానమీ క్లాస్ లో ప్రయాణించిన రక్షణమంత్రి

Published Wed, Nov 12 2014 8:42 PM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

ఎకానమీ క్లాస్ లో ప్రయాణించిన రక్షణమంత్రి

ఎకానమీ క్లాస్ లో ప్రయాణించిన రక్షణమంత్రి

న్యూఢిల్లీ: దేశ రక్షణ మంత్రి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు. అధికార ఆడంబరాలను పక్కకుపెట్టి విమానంలో ఆయన ఎకానమీ క్లాస్ లో ప్రయాణించారు. నాలుగు రోజుల పర్యటన కోసం విమానంలో గోవా వెళ్లిన ఆయన సాధారణ ప్రయాణికులు ప్రయాణించే ఎకానమీ క్లాస్ లో ఎక్కారు. 

నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆయన గోవా షిప్ యార్డును ఆయన సందర్శిస్తారు. నావికాదళ అధికారులతో భేటీ అవుతారు. 58 ఏళ్ల పారికర్ గతవారం వరకు గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటుకు ఆయన నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement