Vicky Kaushal-Katrina Kaif fly in economy class, video goes viral - Sakshi
Sakshi News home page

Katrina Kaif and Vicky Kaushal: ఎకానమీ క్లాస్‌లో బాలీవుడ్‌ జంట.. నెటిజన్ల ట్రోల్స్..!

Published Thu, Dec 22 2022 5:45 PM | Last Updated on Thu, Dec 22 2022 6:37 PM

Bollywood Couples Katrina Kaif And Vicky Kaushal Fly Economy Class video Goes Viral - Sakshi

ఎల్లప్పుడు సినిమాలతో బిజీగా ఉండే తారలు.. వెకేషన్‌కు టైం కేటాయిస్తూనే ఉంటారు. సెట్స్‌, షూటింగ్‌లంటూ బిజీబిజీగా గడుపుతూ అలిసిపోతుంటారు. అందుకే తీరిక దొరికినప్పుడల్లా విహారయాత్రకు వెళ్తూ గ్యాప్ దొరికినప్పుడల్లా రిఫ్రెష్‌ అవుతుంటారు. అయితే కొన్నిసార్లు అప్పటికప్పుడు బ్యాగు సర్దేసుకుని విదేశాల్లో వాలిపోతుంటారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ దంపతులు కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌ వెకేషన్‌కు వెళ్లారు.

దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇదంతా రొటీన్‌గా జరిగేదదైనా ఈ ట్రిప్‌లో కాస్త వెరైటీ కూడా ఉందండోయ్‌. అదేంటంటే ఈ బాలీవుడ్ ప్రేమ జంట ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం. అది చూసిన జనాలు అదేంటి? వీళ్లు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తున్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద సెలబ్రిటీలు అయి ఉండి ఎకానమీ క్లాస్‌లో వెళ్లడం గ్రేట్‌ అని కొందరంటుంటే.. మరీ చీప్‌గా కాకుండా బిజినెస్‌ క్లాస్‌ లేదంటే ఫస్ట్‌ క్లాస్‌లో అయినా వెళ్లాల్సిందని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. 

మరోవైపు ఈ వీడియోలో కత్రినా తన గుర్తు పట్టకుండా ఉండేందుకు బ్లాక్ క్యాప్‌తో పాటు.. మాస్క్‌ను ధరించి ఉంది. అంతే కాకుండా ఈ క్లిప్‌లో స్టార్ జంట  పక్కపక్కనే కూర్చుని వారి వారి మొబైల్స్‌లో నిమగ్నమైపోయారు. ఇక వీడియో మొదట్లో కత్రినా మాస్క్ తొలగించి ఫోన్‌లో బిజీగా ఉండగా.. ఓ అభిమాని సీక్రెట్‌గా రికార్డ్ చేశారు. అది గమనించిన కత్రినా వెంటనే మాస్క్ ధరించింది.  ఈ వీడియోను చూస్తే వీరిద్దరూ ఏదో సీక్రెట్ వెకేషన్ వెళ్తున్నట్లు అర్థమవుతోంది. 

తమని ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండాలనే ఇలా ఎకానమీ క్లాస్‌లో వెళ్ళేందుకు ప్లాన్ చేసుకున్నారని కొందరు ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం వాళ్ల అనుమతి లేకుండా ఇలా వీడియోలు తీసి.. వారి ప్రైవసికి భంగం కలిగిస్తున్నారని మండిపడుతున్నారు. ఏదేమైనా ఈ జంట హాలిడే ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేసేందుకు బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement