Katrina Kaif And Vicky Kaushal Latest Advertisement Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Katrina Kaif: పెళ్లి తర్వాత తొలిసారి అలా.. కత్రినా, విక్కీ ఫోటోలు వైరల్.. !

Sep 14 2022 1:55 PM | Updated on Sep 14 2022 4:01 PM

Bollywood Couples Katrina Kaif And Vicky Kaushal Photos Goes Viral In Internet - Sakshi

కత్రినా, విక‍్కీలను అలా చూసి ఫ్యాన్స్  ఫుల్ ఖుషీ అవుతున్నారు.

బాలీవుడ్ రొమాంటిక్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో వివాహబంధంతో ఒక్కటైన ఈ ప్రేమజంట త్వరలోనే తెరపై కనువిందు చేయనున్నారు. పెళ్లి తర్వాత స్క్రీన్‌పై కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓ వాణిజ్య ప్రకటనలో ఇద్దరు కలిసి నటించనుండగా ఆ ఫోటోలు కాస్త నెట్టింట్లో వైరలయ్యాయి.   

(చదవండి: అందుకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది)

అయితే ఇటీవల  కాఫీ విత్ కరణ్‌ షోలో పాల్గొన్న  కత్రినా కైఫ్, భర్త విక్కీ కౌశల్‌తో అనుబంధాన్ని వివరించింది. తామిద్దరం డేటింగ్‌ చేయలేదని ఆమె వెల్లడించింది. మీడియాలో తమపై వస్తున్న కథనాలు చూస్తే చాలా తమాషాగా అనిపిస్తుందని తెలిపింది. కాగా గతేడాది డిసెంబర్‌ 9న రాజస్తాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ పెళ్లి ఘనంగా జరిగింది. అప్పటి వరకు పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వని కత్రినా-విక్కీలు.. మరుసటి రోజే పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేశారు. వీరి వివాహానికి  సన్నిహితులు, బాలీవుడ్ నటులు హాజరయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement