పెళ్లై మూడేళ్లు.. 40 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న స్టార్‌ హీరోయిన్‌ | Katrina Kaif Is Pregnant News Viral | Sakshi
Sakshi News home page

పెళ్లై మూడేళ్లు.. 40 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న స్టార్‌ హీరోయిన్‌

Mar 5 2024 10:31 AM | Updated on Mar 5 2024 11:14 AM

Katrina Kaif Is Pregnant News Viral - Sakshi

తాజాగా బాలీవుడ్ నటి అనుష్క శర్మ మగబిడ్డకు తల్లి కావడం ఆనందంగా ఉంది. దీపికా పదుకొణె తాను గర్భవతి అనే శుభవార్తను పంచుకుంది. ఇప్పుడు మరో టాప్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నట్లు పుకార్లు స్ప్రెడ్ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో కత్రినా కైఫ్ గర్భవతి అని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. విక్కీ కౌశల్  ఇంటికి త్వరలో ఒక చిన్న గెస్ట్ వస్తాడని నెటిజన్లు అంటున్నారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్‌ వేడుక గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన విషయం తెలిసిందే. అక్కడకు  కత్రినా కైఫ్- విక్కీ కౌశల్‌ జంటగా వెళ్లారు. ఆ సమయంలో ఆమె తన ఉదరాన్ని దుపట్టాతో పదేపదే దాచుకోవడం కెమెరాల కంట పడింది. ఆ విడీయో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతంది. దీంతో కత్రినా, విక్కీ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని అభిమానులు అంటున్నారు.

దీపికా పదుకొనే తర్వాత కత్రినా కైఫ్ కూడా స్వీట్ న్యూస్ ఇస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. విక్కీ , కత్రినా  2021 డిసెంబర్‌ నెలలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. అంటే వారి పెళ్లి జరిగి ఇప్పటికి మూడేళ్లు కావస్తోంది. ఇప్పుడు వారిద్దరూ తల్లితండ్రులు కాబోతున్నారని వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాలంటే వారిద్దరూ రియాక్ట్‌ కావాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement