Katrina Kaif And Vicky Kaushal Wedding Date: Katrina Kaif Register Marriage Date & Full Details - Sakshi
Sakshi News home page

Katrina and Vicky: నేడో, రేపో ఈ లవ్‌బర్డ్స్‌ రిజిస్టర్‌ మ్యారేజ్‌?

Published Thu, Dec 2 2021 3:35 PM | Last Updated on Fri, Dec 3 2021 3:45 PM

Katrina Kaif and Vicky Court Marriage today Either Today OrTomorrow?  - Sakshi

Katrina Kaif And Vicky Kaushal Wedding Date:  హీరోయిన్ల పెళ్లి కబురంటే ఆ సందడే వేరు. బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారనేది బజింగ్‌ టాక్‌. అయితే మీడియాకు దూరంగా ఈ వేడుకనుఎంతో రహస్యంగా ప్లాన్‌ చేస్తున్నారు ఈ లవ్‌బర్డ్స్‌. కానీ బీటౌన్‌ ముచ్చట్లకు మాత్రం తెరపడటం లేదు. అతిరథ మహా రథులట, ఎగ్జోటిక్‌ సెర్మనీ, టైగర్‌ సఫారీ అట, అంతేకాదండోయ్‌ ఈ హై-ప్రొఫైల్ వెడ్డింగ్‌కు హాజరయ్యే అతిథులకు బోలెడన్ని కండిషన్లట.

14వ శతాబ్దపు కోటలో సాంప్రదాయ పంజాబీ వివాహంతో  ఒక్కటికానున్న ఈ స్టార్ జంట ఈ రోజో  రేపో రిజిస్టర్డ్ మ్యారేజీ చేసుకోబోతున్నారట. ప్రత్యేక వివాహ చట్టం (1954 కులాంతర వివాహాల ప్రత్యేక వివాహ చట్టం) కింద  తమ పెళ్లిని నమోదు  చేసుకోనున్నారు.  ఈ వేడుక ముగిసిన అనతరం గ్రాండ్‌ వెడ్డింగ్‌ కోసం  రాజస్థాన్‌ ఎగిరి పోనున్నారు.  హాట్‌ టాపిక్‌గా నిలుస్తోన్న క్యాట్‌-విక్కీ వెడ్డింగ్‌ అంచనాలపై ఓ లుక్కేద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement