
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగంలో ఉన్న కువైట్ సంస్థ జజీరా ఎయిర్‌వేస్ భారత్‌లో అడుగు పెడుతోంది. లో కాస్ట్ ఎయిర్‌లైనర్‌గా పేరొందిన ఈ సంస్థ తొలుత హైదరాబాద్ నుంచి సర్వీసులు ప్రారంభిస్తోంది. నవంబరు 17 నుంచి విమానయాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. కొచ్చి, ముంబై, అహ్మదాబాద్ నగరాల్లోనూ దశలవారీగా విస్తరించనుంది.
హైదరాబాద్ నుంచి కువైట్‌కు నేరుగా ఫ్లయిట్స్ నడుపనుంది. ఎకానమీ క్లాస్‌లో 30 కేజీలు, బిజినెస్ క్లాస్‌లో 50 కేజీలు బ్యాగేజ్ ఉచితంగా అనుమతిస్తారు. హైదరాబాద్ నుంచి ఎకానమీ క్లాస్‌లో ఒకవైపునకు టికెట్ ధర కువైట్‌కు రూ.12,500, దుబాయి రూ.11,651, రియాద్ రూ.11,720 ఉంది.
Comments
Please login to add a commentAdd a comment