Airways
-
జెట్ ఎయిర్వేస్ కథ కంచికి..
న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ దివాలా పరిష్కార ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీని లిక్విడేట్ చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, పరిష్కార ప్రణాళిక నిబంధనలను పాటించనందుకు గాను జలాన్ కల్రాక్ కన్సార్షియం (జేకేసీ) ఇన్వెస్ట్ చేసిన రూ. 200 కోట్ల మొత్తాన్ని జప్తు చేయాలని సూచించింది. ఇక రూ. 150 కోట్ల పర్ఫార్మెన్స్ గ్యారంటీని క్లెయిమ్ చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని కన్సార్షియానికి అనుమతినిచ్చింది. రాజ్యాంగంలోని 142 ఆరి్టకల్ కింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తాజా పరిణామాలతో పాతికేళ్ల పైగా సాగిన జెట్ ఎయిర్వేస్ ప్రస్థానం ముగిసినట్లేనని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్సీఎల్ఏటీకి అక్షింతలు.. జేకేసీ సమర్పించిన పనితీరు ఆధారిత బ్యాంక్ గ్యారంటీని (పీబీజీ) పాక్షిక చెల్లింపు కింద సర్దుబాటు చేసేందుకు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) అనుమతించడాన్ని సుప్రీం కోర్టు ఆక్షేపించింది. దివాలా కోడ్ (ఐబీసీ) సూత్రాలకు విరుద్ధంగా పేమెంట్ నిబంధనలను పూర్తిగా పాటించకుండానే ముందుకెళ్లేందుకు జేకేసీకి వెసులుబాటునిచ్చినట్లయిందని వ్యా ఖ్యానించింది.జెట్ ఎయిర్వేస్ పరిష్కార ప్రణాళిక ఆమోదం పొంది అయిదేళ్లు గడిచినా కూడా కనీస పురోగతి కూడా లేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దివాలా కేసుల విషయంలో ఈ తీర్పు ఓ ’కనువిప్పు’లాంటిదని, ఆర్థికాంశాలకు సంబంధించి ఇచ్చిన హామీలను సకాలంలో తీర్చాల్సిన అవసరాన్ని ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తాయని పేర్కొంది. 1992లో ప్రారంభం.. ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు సేల్స్ ఏజంటుగా వ్యవహరించిన నరేశ్ గోయల్ 1992లో జెట్ ఎయిర్వేస్ను ప్రారంభించారు. తొలుత ముంబై–అహ్మదాబాద్ మధ్య ఎయిర్ ట్యాక్సీ సర్వీసుగా కంపెనీ కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఒక దశలో జెట్ ఎయిర్వేస్కి 120 పైగా విమానాలు ఉండేవి. ఇదీ చదవండి: అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్ళ నిషేధం1,300 మంది పైలట్లు, 20,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉండేవారు. అయితే, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో 2019లో కంపెనీ తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేసింది. అప్పటికి జెట్ ఎయిర్వేస్ వివిధ బ్యాంకులకు రూ. 8,500 కోట్ల రుణాలతో పాటు పలువురు వెండార్లు, ప్యాసింజర్లకు ఇవ్వాల్సిన రీఫండ్లు, ఉద్యోగుల జీతాలకు సంబంధించి వేల కోట్ల రూపాయలు బాకీ పడింది. దీంతో 2019 జూన్‌లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) జెట్ ఎయిర్వేస్పై దివాలా పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో దివాలా పరిష్కార ప్రక్రియ కింద 2021లో కంపెనీని జేకేసీ దక్కించుకుంది. 2024 నుంచి కార్యకలాపాలు పునఃప్రారంభించనున్నట్లు కూడా జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. అయితే, నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని జేకేసీ సకాలంలో చెల్లించకపోవడంతో వివాదం చివరికి సుప్రీం కోర్టుకు చేరింది. గురువారం బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేరు ధర 5 శాతం లోయర్ సర్క్యూట్‌తో 34.04 వద్ద క్లోజయ్యింది. -
గతి శక్తి విశ్వవిద్యాలయం, ఎయిర్‌బస్ మధ్య ఒప్పందం.. ఎందుకంటే..
భారత విమానయాన పరిశ్రమను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని గతి శక్తి విశ్వవిద్యాలయం (జీఎస్వీ), ఎయిర్‌బస్ పరస్పరం భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. సెప్టెంబర్ 2023లో జరిగిన ఎంఓయూను అనుసరించి ఎయిర్‌బస్ ఎండీ రెమి మెయిలార్డ్, జీఎస్వీ వైస్ ఛాన్స్లర్ మనోజ్ చౌదరి మధ్య న్యూదిల్లీలోని రైల్ భవన్లో ఒప్పందం కుదిరింది. ఈ మేరకు భారత రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటన వెలువరించింది.మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం..భారత్‌లోని విమానయాన పరిశ్రమను విస్తరించేందుకు జీఎస్వీ, ఎయిర్‌బస్ మద్య ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా విమాన రంగంలో రాణించాలనుకునే వారికి ఎగ్జిక్యూటివ్ శిక్షణ, నైపుణ్యాలు అందిస్తారు. మొత్తం ప్రోగ్రామ్ వ్యవధిలో 40 మందికి పూర్తి స్కాలర్‌షిప్‌తో కూడిన శిక్షణ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..‘సబ్కా సాథ్ సబ్కా వికాస్.. అనే స్ఫూర్తితో కేంద్రం విమానయానం, హైవేలు, రైల్వేలు, రోడ్డు రవాణాను అభివృద్ధి చేస్తోంది. దానికి అందరి సహకారం అవసరం. అన్ని రవాణా రంగాలను ఏకీకృతం చేసేందుకు ఒక ప్రత్యేక సంస్థ ఉండాలని జీఎస్వీని ఏర్పాటు చేశాం. ఆయా రంగాల్లో తయారీ పరిశ్రమను ప్రోత్సహించేలా అందులో ఎగ్జిక్యూటివ్ శిక్షణ, నైపుణ్యాలు అందిస్తున్నాం. ఇప్పటికే ఇందులో రైల్వే శిక్షణ ఇచ్చాం. విమానయాన రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. అందులో విప్లవాత్మక మార్పులు రావాలి. కాబట్టి ప్రస్తుతం సివిల్ ఏవియేషన్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. తర్వాత షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగంలో శిక్షణ ఇస్తాం. ప్రస్తుతం జరిగే శిక్షణకు ఎయిర్‌బస్ సహకరిస్తుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం రద్దు.. రూ.100 కోట్లు ఆదా!ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ..‘పదేళ్ల కాలంలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 157కి రెట్టింపయింది. ఉడాన్ పథకం ద్వారా విమాన సర్వీసులు టైర్ II, టైర్ III నగరాలకు విస్తరించాయి. ఈ రంగం పురోగతికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గతి శక్తి విశ్వవిద్యాలయానికి పూర్తిగా సహకరిస్తుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్, రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో జయవర్మ సిన్హా తదితరులు పాల్గొన్నారు. -
రన్‌వేపైనే భోజనం.. ఇండిగోకు నోటీసులు
ముంబయి: ఇండిగో, ముంబయి విమానాశ్రయానికి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. విమానం ఆలస్యంతో ప్రయాణికులు రన్‌వైపై కూర్చుని భోజనం చేసిన వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. ఈ ఘటనకు ముంబయి విమానాశ్రయం, ఇండిగో రెండూ బాధ్యులుగా ఉన్నాయని నోటీసులో పేర్కొంది. విమానాశ్రయంలో అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించలేదని మండిపడింది. passengers of IndiGo Goa-Delhi who after 12 hours delayed flight got diverted to Mumbai having dinner just next to indigo plane pic.twitter.com/jGL3N82LNS — JΛYΣƧΉ (@baldwhiner) January 15, 2024 పొగమంచు కారణంగా ముంబయి విమానాశ్రయంలో ఇండిగో విమానం ఆలస్యం అయింది. దీంతో ప్రయాణిికులు రన్‌వేపైనే వేచి ఉన్నారు. అక్కడే భోజనం కూడా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానాశ్రయంలో విశ్రాంతి గదులు, రిఫ్రెష్మెంట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలను పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులను రన్‌వేపైనే ఉంచడంపై కేంద్రం మంత్రిత్వ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. విమానం ఆలస్యం కావడంపై ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో కెప్టెన్‌పై ఓ ప్రయాణికుడు చేయిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర విమానయాన శాఖా మంత్రి సింథియా స్పందించారు. ప్రయాణికులు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని కోరారు. మంత్రిత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, విమానాల ఆలస్యంపై ప్రత్యేక నిబంధనలను విడుదల చేశారు. ఆ తర్వాత ముంబయి విమానాశ్రయంలో ప్రయాణికులు రన్‌వేపైనే కూర్చుని భోజనం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: కృష్ణ జన్మభూమి కేసు: మసీదు సర్వేపై సుప్రీంకోర్టు స్టే -
మెదడుతో సహా శరీర అన్ని భాగాల్లో వైరస్ ఆనవాలు.. కారణం ఇదే!
How does coronavirus reach brain?: ప్రాణాంతక కరోనా వైరస్ మానవ శరీరాల్లో సుదీర్ఘకాలం మనుగడ సాగించడానికి గల కారణాలను యూఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు తాజాగా విడుదల చేశారు. సాధారణంగా కరోనా వాయుమార్గాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఐతే ఇది అనతికాలంలోనే శరవేగంగా ఊపిరితిత్తుల్లో మత్రమేకాకుండా మెదడుతో సహా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుందని, ఎక్కువకాలం కోవిడ్ మనుగడకు కారణమిదేనని వీరి అధ్యయనాలు వెల్లడించాయి. కరోనా వైరస్ బారినపడ్డవారు పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా వైరస్ ఒక అవయవం నుండి మరొక అవయవానికి ప్రయాణిస్తుంది. అందుకే సుదీర్ఘ కాలంపాటు బాధపడే కోవిడ్ బాధితుల్లో శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించి మాత్రమే కాకుండా ఇతర లక్షణాలు కూడా బయటపడుతున్నాయి. అందుకు గల కారణాలను అధ్యయనం చేయడం కోసం అమెరికాలో కరోనావైరస్ బారిన పడి మరణించిన 44 మంది రోగులపై శవపరీక్షల సమయంలో తీసిన కణజాలాలను విస్తృతంగా అధ్యయనం చేశారు. కోవిడ్ బారినపడి 230 రోజులు దాటిన తర్వాత కూడా వైరస్ తాలూకు ఆనవాలు మెదడుతో సహా శరీరంలో వివిధ భాగాల్లో కనుగొన్నట్టు పరిశోధకులు తెలిపారు. దీర్ఘకాలం కోవిడ్‌తో బాధపడేవారి అవయవ వ్యవస్థ ఎందుకు ప్రభావితం అవుతుందో కనుగొనేందుకు చేసిన పరిశోధనలు సత్ఫలితాల్నిచ్చాయని మిస్సోరీకి చెందిన క్లినికల్ ఎపిడెమియాలజీ సెంటర్ డైరెక్టర్ జియాద్ అల్-అలీ అన్నారు. కాబట్టి కరోనా వైరస్ ప్రయాణించగల అవయవాలు కేవల ఊపిరితిత్తులు మాత్రమేకాదు. ఇది మెదడుతో సహా మొత్తం శరీరం అంతటా సోకుతుంది. అధిక శాతం శ్వాసనాళాలు, ఊపిరితిత్తులలో ఉంటుంది. చదవండి: New Year 2022: న్యూ ఇయర్ రోజున ఇలా చేస్తే ఏడాదంతా మంచి జరుగుతుంది! -
భారత్‌లోకి జజీరా ఎయిర్వేస్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగంలో ఉన్న కువైట్ సంస్థ జజీరా ఎయిర్వేస్ భారత్‌లో అడుగు పెడుతోంది. లో కాస్ట్ ఎయిర్‌లైనర్‌గా పేరొందిన ఈ సంస్థ తొలుత హైదరాబాద్ నుంచి సర్వీసులు ప్రారంభిస్తోంది. నవంబరు 17 నుంచి విమానయాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. కొచ్చి, ముంబై, అహ్మదాబాద్ నగరాల్లోనూ దశలవారీగా విస్తరించనుంది. హైదరాబాద్ నుంచి కువైట్‌కు నేరుగా ఫ్లయిట్స్ నడుపనుంది. ఎకానమీ క్లాస్‌లో 30 కేజీలు, బిజినెస్ క్లాస్‌లో 50 కేజీలు బ్యాగేజ్ ఉచితంగా అనుమతిస్తారు. హైదరాబాద్ నుంచి ఎకానమీ క్లాస్‌లో ఒకవైపునకు టికెట్ ధర కువైట్‌కు రూ.12,500, దుబాయి రూ.11,651, రియాద్ రూ.11,720 ఉంది. -
ఆరేళ్లకే ఆరితేరాడు
-
ఆరేళ్లకే ఆరితేరాడు
దుబాయ్: ఎతిహాద్ ఎయిర్వేస్లో ఒక రోజు పైలట్‌గా పనిచేసిన ఆరేళ్ల ఆడమ్ అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమాన ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై చిన్నారి ఆడమ్ ఇచ్చిన ప్రజెంటేషన్, పద్ధతులకు సంబంధించిన వివరాలు చూసి నెటిజన్లు ముగ్ధులవుతున్నారు. విమానం నడిపే సమయంలో ఎమర్జన్సీ ఎదురైతే ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపైనా ఆడమ్కున్న పట్టు ఎతిహాద్ ఎయిర్వేస్ అధికారులనూ విస్తుగొలిపింది. ఆడమ్ ఇవన్నీ కేవలం యూట్యూట్ వీడియోలను చూసి నేర్చుకున్నవే కావడం మరింత ఆశ్యర్యం కలిగిస్తోంది. ఆడమ్ పనితీరు మెచ్చిన విమాన కెప్టెన్ యక్లీఫ్ ఆడమ్ కాక్‌పిట్‌లో కూర్చున్న దృశ్యాలను, ప్రొసీజర్‌పై ఇచ్చిన వివరణలతో కూడిన వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేయగా దీనికి నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. రెండు వారాల కింద ఫేస్బుక్లో పోస్ట్ అయిన ఈ వీడియోను 2.1 కోట్ల మంది వీక్షించగా, మూడు లక్షల సార్లు షేర్ అయింది. ఈ వీడియోను చూసిన ఓ నెటిజన్ ఈ బాలుడు ఎతిహాద్ ఎయిర్వేస్ కెప్టెన్ కావడానికి అన్ని విధాలా అర్హుడని, అతడికి ఓ అవకాశం ఇవ్వండంటూ ఫేస్బుక్లో కోరారు. ఇక విమానయానంపై ఆడమ్కున్న అభిరుచిని తెలుసుకున్న ఎతిహాద్ ఎయిర్వేస్ అతడిని తమ శిక్షణా కేంద్రానికి ఆహ్వానించి పైలట్ ట్రైనింగ్ ఇచ్చి ప్రత్యేక యూనిఫామ్‌ను ఇచ్చింది. ఎయిర్‌బస్ ఏ380పైనా తరగతులు నిర్వహించింది. ఏ380 ఎయిర్‌బస్ కెప్టెన్ కావాలన్నదే తన కలని చిన్నారి ఆడమ్ అంటున్నాడు. త్వరలోనే అతడి కల సాకారం కావాలని నెటిజన్లు కోరుతున్నారు. నెటిజన్లు ఆకట్టుకున్న ఆరేళ్ల చిన్నారి వీడియో -
జెట్ ఎయిర్ వేస్ విమానం అత్యవసర ల్యాండింగ్
బెంగళూరుః కర్నాటక రాజధాని బెంగళూరు విమానాశ్రయంనుంచీ ఉదయం బయల్దేరిన జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో పొగలు రావడంతో.. విషయాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు బెంగళూరు ఎయిర్ పోర్టులో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. మంగుళూరుకు చెందిన 9W 2839 జెట్ ఎయిర్ వేస్ విమానం ఉదయం బెంగళూరు ఎయిర్ పోర్టునుంచి టేకాఫ్ అయ్యింది. ఆకాశంలోకి ఎగిరిన కొద్దిసేపటికే ఎయిర్ క్రాఫ్ట్ క్యాబిన్ లో పొగలు రావడాన్ని సిబ్బంది గమనించి, అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాన్ని వెనక్కు రప్పించారు. 9W 2839 జెట్ ఎయిర్ వేస్ విమానం లో సాంకేతిక లోపాలు ఏర్పడటంతో బెంగళూరు ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నట్లు జెట్ ఎయిర్ వేస్ అధికారులు తెలిపారు. -
ముంబైకి చేరిన బ్రస్సెల్స్ దాడి బాధితురాలు
ముంబైః బ్రసెల్స్ ఎయిర్ పోర్టులో జరిగిన టెర్రర్ దాడిలో గాయపడ్డ జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగిని నిధి ఛాపేకర్ ముంబై చేరుకున్నారు. గాయాలనుంచి కొంతశాతం కోలుకోవడంతో ఆమె శుక్రవారం ఉదయం ముంబైకి తిరిగి వచ్చారు. చీలమండ విరిగి, 15 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందిన నిధి.. స్కిన్ గ్రాఫ్టింగ్ చికిత్స చేయించుకున్నారు. ఆమెతోపాటు జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది అమిత మోత్వానీ ఇంకా బ్రస్సెల్స్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. మార్చి నెలలో బ్రసెల్స్ విమానాశ్రయంలో జరిగిన ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి, అక్కడే ఆస్పత్రిలో చికిత్స పొందిన జెట్ ఎయిర్ వేస్ క్రూ మెంబర్ నిధి ఛాపేకర్ ముంబై చేరుకున్నారు. 42 ఏళ్ళ నిధి ఇంకా కొంతశాతం గాయాలనుంచీ కోలుకోవాల్సిన అవసరం ఉండటంతో పారిస్ నుంచి జెట్ ఎయిర్ వేస్ విమానంలో ముంబై చేరగానే, ఎయిర్ పోర్టునుంచే ఆమెను ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. ఆమె కొంత రక్తహీనతతో బాధపడుతున్నారని, ఇంకా కొన్ని రోజులు ఆమె విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఎక్కువగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉండటం మంచిదని డాక్టర్లు తెలిపారు. 1996 ఆగస్టు నుంచి జెట్ ఎయిర్ వేస్ లో పనిచేస్తున్న నిధి ఛాపేకర్... మార్చి 22న బ్రసెల్స్ ఎయిర్ పోర్టునుంచి జెట్ ఎయిర్ వేస్ ఫ్లైట్ లో న్యూయార్క్ వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో జరిగిన దాడితో ఆమె శరీరానికి 15 శాతం గాయాలు అవ్వడంతోపాటు, చీలమండ విరిగిపోయింది. అప్పట్నుంచీ బ్రసెల్స్ కు దగ్గరలోని గ్రాండె హాస్పిటల్ డి చెలేరియోలో 25 రోజులపాటు చికిత్స పొందిన ఆమె... గురువారం సాయంత్రం ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యి, అక్కడినుంచి పారిస్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం పారిస్ నుంచి ముంబైకి చేరారు. నిధి.. ఇప్పటికీ వీల్ ఛైర్ ఆధారంగానే కదలాల్సిన పరిస్థితి ఉండటంతో ఆమె భర్త రూపేష్ ఛాపేకర్, అతని సోదరుడు నీలేష్ ఛాపేకర్ ఎయిర్ పోర్టునుంచి, ఎయిర్ లైన్స్ సిబ్బంది, వైద్యాధికారుల సహాయంతో బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి చేర్చారు. -
డ్రీమ్‌లైనర్ విమానం.. మళ్లీ తుస్!
డ్రీమ్ లైనర్ విమానంలో మళ్లీ సమస్య తలెత్తింది. జపాన్ డ్రీమ్‌లైనర్ విమానం ఇంజన్ వేడెక్కడంతో కౌలాలంపూర్ నుంచి బయల్దేరిన విమానం.. గంటలోపే వెనక్కి తిరిగి వచ్చేసింది. ఆల్ నిప్పన్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అనేక ఇబ్బందులను చవిచూస్తున్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ తాజా ఘటనలతో మరో సమస్యలో పడినట్లు జపనీస్ ఎయిర్ లైన్స్ చెబుతోంది. కుడి ఇంజన్లో సమస్య వచ్చే సమయానికి విమానంలో 203 మంది ప్రయాణికులతో పాటు, 11 మంది సిబ్బంది ఉన్నారు. ఉదయం 8 గంటలకు కౌలాలంపూర్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం ఇంజన్ తీవ్రంగా వేడెక్కడంతో అప్రమత్తమైన సిబ్బంది.. 9.30 గంటల ప్రాంతంలో కౌలాలంపూర్‌లో మళ్లీ ల్యాండ్ చేశారని అధికారులు తెలియజేశారు. ప్రమాదాన్ని గుర్తించి అత్యవసరంగా దింపేయడంతో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, పెద్ద ముప్పు తప్పిందని తెలిపారు. మధ్యాహ్నం 3.15 గంటలకు విమానం నరితా ఎయిర్ పోర్టుకు చేరాల్సి ఉండగా.. ఉన్నట్లుండి విమానంలోని కుడి ఇంజన్లో ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో గుర్తించిన సిబ్బంది విమానాన్ని వెనక్కి తిప్పాల్సివచ్చిందని ఎయిర్ వేస్ ప్రతినిధి షోచిరో హోరీ తెలిపారు. అయితే అత్యధిక వేడి సమస్య ఎందుకు తలెత్తిందన్న విషయంపై విచారిస్తున్నట్లు తెలిపారు. ఇంధన వాడకాన్ని తగ్గించడంలో భాగంగా తేలికైన మిశ్రమ పదార్థాలతో డ్రీమ్ లైనర్ విమానాలను తయారు చేశారు. అభివృద్ధి దశలో వచ్చిన అనేక సమస్యలను దాటి ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్ (ఏఎన్ఏ) 2011లో తొలి వాణిజ్య విమానాన్ని పరిచయం చేసింది. అనంతరం 2013లో డ్రీమ్‌లైనర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేక విద్యుత్ సమస్య తలెత్తింది. సంవత్సరం మొదట్లో బ్యాటరీ సమస్యతో అనేక విమానాల్లో సమస్యలు తెలత్తగా, ఒక విమానం బ్యాటరీ వేడెక్కడంతో అగ్నిప్రమాదం కూడా సంభవించింది. దీంతో లోపాలను సరిదిద్దేందుకు ఓ పక్క ప్రయత్నాలు జరుగుతుండగా తాజాగా కౌలాలంపూర్ విమానం ఘటన వెలుగుచూసింది.