బెంగళూరుః కర్నాటక రాజధాని బెంగళూరు విమానాశ్రయంనుంచీ ఉదయం బయల్దేరిన జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో పొగలు రావడంతో.. విషయాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు బెంగళూరు ఎయిర్ పోర్టులో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు.
మంగుళూరుకు చెందిన 9W 2839 జెట్ ఎయిర్ వేస్ విమానం ఉదయం బెంగళూరు ఎయిర్ పోర్టునుంచి టేకాఫ్ అయ్యింది. ఆకాశంలోకి ఎగిరిన కొద్దిసేపటికే ఎయిర్ క్రాఫ్ట్ క్యాబిన్ లో పొగలు రావడాన్ని సిబ్బంది గమనించి, అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాన్ని వెనక్కు రప్పించారు. 9W 2839 జెట్ ఎయిర్ వేస్ విమానం లో సాంకేతిక లోపాలు ఏర్పడటంతో బెంగళూరు ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నట్లు జెట్ ఎయిర్ వేస్ అధికారులు తెలిపారు.
జెట్ ఎయిర్ వేస్ విమానం అత్యవసర ల్యాండింగ్
Published Wed, Jun 15 2016 4:58 PM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM
Advertisement