How does coronavirus reach brain?: ప్రాణాంతక కరోనా వైరస్ మానవ శరీరాల్లో సుదీర్ఘకాలం మనుగడ సాగించడానికి గల కారణాలను యూఎన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు తాజాగా విడుదల చేశారు. సాధారణంగా కరోనా వాయుమార్గాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఐతే ఇది అనతికాలంలోనే శరవేగంగా ఊపిరితిత్తుల్లో మత్రమేకాకుండా మెదడుతో సహా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుందని, ఎక్కువకాలం కోవిడ్ మనుగడకు కారణమిదేనని వీరి అధ్యయనాలు వెల్లడించాయి.
కరోనా వైరస్ బారినపడ్డవారు పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా వైరస్ ఒక అవయవం నుండి మరొక అవయవానికి ప్రయాణిస్తుంది. అందుకే సుదీర్ఘ కాలంపాటు బాధపడే కోవిడ్ బాధితుల్లో శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించి మాత్రమే కాకుండా ఇతర లక్షణాలు కూడా బయటపడుతున్నాయి. అందుకు గల కారణాలను అధ్యయనం చేయడం కోసం అమెరికాలో కరోనావైరస్ బారిన పడి మరణించిన 44 మంది రోగులపై శవపరీక్షల సమయంలో తీసిన కణజాలాలను విస్తృతంగా అధ్యయనం చేశారు. కోవిడ్ బారినపడి 230 రోజులు దాటిన తర్వాత కూడా వైరస్ తాలూకు ఆనవాలు మెదడుతో సహా శరీరంలో వివిధ భాగాల్లో కనుగొన్నట్టు పరిశోధకులు తెలిపారు. దీర్ఘకాలం కోవిడ్‌తో బాధపడేవారి అవయవ వ్యవస్థ ఎందుకు ప్రభావితం అవుతుందో కనుగొనేందుకు చేసిన పరిశోధనలు సత్ఫలితాల్నిచ్చాయని మిస్సోరీకి చెందిన క్లినికల్ ఎపిడెమియాలజీ సెంటర్ డైరెక్టర్ జియాద్ అల్-అలీ అన్నారు.
కాబట్టి కరోనా వైరస్ ప్రయాణించగల అవయవాలు కేవల ఊపిరితిత్తులు మాత్రమేకాదు. ఇది మెదడుతో సహా మొత్తం శరీరం అంతటా సోకుతుంది. అధిక శాతం శ్వాసనాళాలు, ఊపిరితిత్తులలో ఉంటుంది.
చదవండి: New Year 2022: న్యూ ఇయర్ రోజున ఇలా చేస్తే ఏడాదంతా మంచి జరుగుతుంది!
Comments
Please login to add a commentAdd a comment