ముంబయి: ఇండిగో, ముంబయి విమానాశ్రయానికి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. విమానం ఆలస్యంతో ప్రయాణికులు రన్‌వైపై కూర్చుని భోజనం చేసిన వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. ఈ ఘటనకు ముంబయి విమానాశ్రయం, ఇండిగో రెండూ బాధ్యులుగా ఉన్నాయని నోటీసులో పేర్కొంది. విమానాశ్రయంలో అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించలేదని మండిపడింది.
passengers of IndiGo Goa-Delhi who after 12 hours delayed flight got diverted to Mumbai having dinner just next to indigo plane pic.twitter.com/jGL3N82LNS
— JΛYΣƧΉ (@baldwhiner) January 15, 2024
పొగమంచు కారణంగా ముంబయి విమానాశ్రయంలో ఇండిగో విమానం ఆలస్యం అయింది. దీంతో ప్రయాణిికులు రన్‌వేపైనే వేచి ఉన్నారు. అక్కడే భోజనం కూడా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానాశ్రయంలో విశ్రాంతి గదులు, రిఫ్రెష్‌మెంట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలను పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులను రన్‌వేపైనే ఉంచడంపై కేంద్రం మంత్రిత్వ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.
విమానం ఆలస్యం కావడంపై ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో కెప్టెన్‌పై ఓ ప్రయాణికుడు చేయిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర విమానయాన శాఖా మంత్రి సింథియా స్పందించారు. ప్రయాణికులు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని కోరారు. మంత్రిత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, విమానాల ఆలస్యంపై ప్రత్యేక నిబంధనలను విడుదల చేశారు. ఆ తర్వాత ముంబయి విమానాశ్రయంలో ప్రయాణికులు రన్‌వేపైనే కూర్చుని భోజనం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: కృష్ణ జన్మభూమి కేసు: మసీదు సర్వేపై సుప్రీంకోర్టు స్టే
Comments
Please login to add a commentAdd a comment