mess
-
జేఎన్టీయూ మెస్‌లో పిల్లి ఘటనపై అనుమానాలు!
హైదరాబాద్, సాక్షి: సుల్తాన్పూర్ జేఎన్టీయూ మెస్‌లో చట్నీలో ఎలుక ఘటన మరువక ముందే.. హైదరాబాద్ జేఎన్టీయూ మెస్‌లో పిల్లి ఆహారాన్ని ముట్టినట్లు ఓ వీడియో చక్కర్లు కొట్టింది. ఇది మీడియాకు ఎక్కడంతో.. జేఎన్టీయూ అధికారులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఘటనపై అనుమానాలు ఉన్నాయని, ఇది ఎవరో కావాలని చేసిన పని అయ్యి ఉంటుందని ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి అంటున్నారు. ‘‘నిజానికి హాస్టల్లో కిటికీ తెరిచిన కారణంగానే పిల్లి లోపలికి వచ్చింది. ఒకవేళ పిల్లి వచ్చినా.. తినే టైంలో అక్కడ విద్యార్థులు, స్టాఫ్ ఉంటారు కాబట్టి భోజనం దగ్గరకు అవి వచ్చే అవకాశం ఉండదు. విద్యార్థులు భోజనం చేశాకే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఆ వీడియో తీసి ఉంటారు. లేకుంటే.. వార్డెన్‌కో, ప్రిన్సిపాల్‌కో ఫిర్యాదు చేయకుండా నేరుగా నెట్లో పెడతారా?. సోషల్ మీడియా ప్రచారాల కోసమే అలా చేసి ఉంటారని భావిస్తున్నాం. ఘటనపై విచారణ చేస్తున్నాం. బాధ్యులెవరైనా సరే చర్యలు మాత్రం కఠినంగా ఉంటాయి అని ప్రిన్సిపాల్ అన్నారు. జేఎన్టీయూ కళాశాల మంజీరా వసతిగృహం భోజనశాలలోని ఆహార పదార్థాల గిన్నెల్లో పిల్లి మూతి పెట్టిన దృశ్యాలు ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే ఈ అంశంపై పరిశీలన కోసం కూకట్పల్లి గవర్నమెంట్ ఫుడ్ వెరిఫికేషన్ కమిటీ అధికారులు హాస్టల్లో పరిశీలనలు జరిపారు. ఎలాంటి వంటకాలను పిల్లి ముట్టుకోలేదని ప్రకటించారు. అయితే.. వంటగది, నిత్యావసరాల స్టోర్‌రూమ్‌ను తనిఖీ చేయగా.. అపరిశుభ్రంగా నీరు నిలిచి ఉండడాన్ని గమనించారు. కొన్ని కూరగాయలు పాడైపోవడంతో పారబోయించారు. వంటపాత్రలపై మూతలు, కిటికీలకు మెష్‌లు లేవు. కేర్టేకర్లు మెస్‌లో 24గంటలూ ఉండాలన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నామని, వారి ఆదేశాలకు అనుగుణంగా చర్యలుంటాయన్నారు. -
Viral Video: సరదాకి గెలికాడు.. దెబ్బకు దూలతీర్చేసిందిగా..
-
బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
-
మీపై సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారు: కేటీఆర్
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన వాళ్లను నిలదీశారు. శనివారం ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన కేటీఆర్ అక్కడి పరిస్థితులు దృష్టికి రావడంతో మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నాణ్యమైన ఆహారం పెట్టడంలో అధికారులు విఫలం అయ్యారు. తరచుగా ఫుడ్ పాయిజన్ జరగుతున్నా.. మెస్ కాంట్రాక్టర్‌ను మార్చకపోవడంపై ఆయన వీసీ వెంకటరమణపై అసహనం వ్యక్తం చేశారు. మెస్ కాంట్రాక్టర్‌ను ఇంకా ఎందుకు మార్చలేదని.. ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే పోలీసుల సాయం తీసుకోండని ట్రిపుల్ ఐటీ అధికారులకు సూచించారాయన. బాసర ట్రిపుల్ స్నాతకోత్సవంలో భాగంగా మంత్రులు సబితా, ఇంద్రకరణ్‌రెడ్డిలతో పాటు బాల్కా సుమన్ ట్రిపుల్ ఐటీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ల్యాప్ ట్యాప్, బూట్లు, డెస్క్ ట్యాప్లులు పంపిణి చేశారు. విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించడానికి సర్కారు సిద్దంగా ఉందని ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. ఇదిలా ఉంటే.. బాసర ట్రిపుల్ ఐటీలో తరచూ విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ తరుణంలో కాంట్రాక్టర్‌ను మార్చేసి.. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలంటూ విద్యాశాఖ గతంలో అధికారులను ఆదేశించింది. -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కేటీఆర్ సమావేశం
-
మీ పోరాటం నాకు నచ్చింది.. బాసర ట్రిపుల్ ఐటీలో కేటీఆర్ ఏమన్నారంటే?
సాక్షి, బాసర(ఆదిలాబాద్): కొద్దిరోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. హాస్టల్ మెస్‌లో భోజనం విషయంలో విద్యార్థులు నిరసనలు తెలిపారు. దీంతో, విద్యార్థుల ఆందోళనలు తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సైతం సృష్టించాయి. గవర్నర్ తమిళిసై సహా పలువురు రాజకీయ నేతలు సైతం బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి.. విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సమస్యలపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్.. సోమవారం బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. ఈ సందర్భంగా హాస్టల్లో మౌలిక సదుపాయాలపై కేటీఆర్ ఆరా తీశారు. విద్యార్థులతో సమావేశమై.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమలోనే వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం, కేటీఆర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం మీ పోరాటం నాకు నచ్చింది. రాజకీయాలకు తావు లేకుండా ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా పోరాటం చేసి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. మెస్ సరిగా లేదన్న విషయం ఇప్పటికే గుర్తించాము. ప్రతీరోజు మంచి ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటాము. విద్యార్థులకు త్వరలోనే ల్యాప్‌టాప్‌లు ఇస్తాము. హాస్టల్లో ఉండే కష్టాలు నాకు కూడా తెలుసు. మెస్‌ల్లోనూ, బాత్రూమ్లోనూ ఉండే ఇబ్బందులు నాకూ తెలుసు. నేను కూడా హాస్టల్లో ఉండి చదువుకున్నాను. ఇక్కడున్న సమస్యలు తెలుసుకునేందుకు కొంచెం సమయం పడుతుంది. సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి. మరో రెండు నెలల తర్వాత మళ్లీ ట్రిపుల్ ఐటీకి వస్తాను. ట్రిపుల్ ఐటీలో వసతులను మరింత అభివృద్ధి చేసాము’ అంటూ హామీ ఇచ్చారు. -
బాసర ట్రిపుల్ ఐటీ.. సిబ్బంది గురించి వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు!
నిర్మల్: సరిగ్గా ఇరవై రోజుల క్రితం బాసర ట్రిపుల్ఐటీలోని కేంద్రీయ భండార్ మెస్‌లో తిన్న విద్యార్థులు ఫుడ్‌పాయిజన్ బారిన పడ్డారు. దాదాపు 600మంది విద్యార్థులు అనారోగ్యం పాలవగా, 20మంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత సీరియస్ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం, ఉన్నతాధికారులు చెబుతున్నా.. ఇవేవీ తమకు పట్టవన్నట్లు సదరు మెస్ కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ జరిగిన కేంద్రీయ భండార్ మెస్‌లోనే తాజాగా స్నానాల సీన్ బయటకు వచ్చింది. వంటగదిలోనే..: ఇరువైపులా.. విద్యార్థుల కోసం వండి, వడ్డించే వంటపాత్రలు ఉన్న గదిలోనే ఇద్దరు సిబ్బంది స్నానాలు చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. వేలమంది విద్యార్థుల కోసం వంటలు చేసేచోట స్నానాలు చేయడం ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. వరు సగా ఘటనలు చోటుచేసుకుంటూ, రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశం అవుతున్నా.. వర్సిటీ అధికారుల తీరు మారడంలేదు. ‘‘వర్సిటీని ప్రక్షాళన చేస్తున్నాం. వార్డెన్లు, మెస్ ఇన్చార్జిలను నియమిస్తున్నాం. పక్కాగా పర్యవేక్షిస్తున్నాం’’ అంటూ ఉన్నతాధికారులు తరచూ చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం మార్పు లేదు. ఇలా.. వంటగదిలో స్నానాలు, నాణ్యతలేని ఆహారం య«థావిధిగా కొనసాగుతున్నాయి. అసలు చర్యలేవి..: ఫుడ్‌పాయిజన్ అయి 20 రోజులవుతోంది. ఘటనకు కారణమైన కేంద్రీయ భండార్, ఎస్ఎస్ మెస్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కానీ.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. యథావిధిగా ఆ మెస్ కాంట్రాక్టర్లనే ఇంకా కొనసాగి స్తున్నారు. కేంద్రీయ భండార్ కాంట్రాక్టర్‌కు బడానేతలు, అధికారులతో బలమైన సంబంధాలు ఉన్నాయని, అందుకే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. -
ట్రిపుల్ ఐటీలో డిన్నర్ బాయ్‌కాట్
నిర్మల్/బాసర: ఫుడ్ పాయిజన్ ఘటన జరిగి 15 రోజులు దాటినా.. మెస్ కాంట్రాక్టర్లను మార్చలేదని, ఆరోజు తమకు అధికారులిచ్చిన హామీలు నెరవేర్చలేదని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు శనివారం రాత్రి నిరసనకు దిగారు. మెస్‌లలో ఖాళీ బెంచీలపై కూర్చుని డిన్నర్ బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ఈ–1, ఈ–2కు చెందిన మూడువేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈనెల 15న ట్రిపుల్‌ఐటీలో ఫుడ్‌పాయిజన్ జరిగింది. మెస్‌లలో నాసిరకం, నాణ్యతలేనివి ఉపయోగించడం వల్లే ఇది జరిగిందని, తమ ప్రాణాల మీదకు వచ్చిందని అదేరోజు విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో ఇన్చార్జి వీసీ వెంకటరమణ ఈనెల 24నాటికి డిమాండ్లు నెరవేరుస్తామని హామీఇచ్చారు. అయితే సదరు హామీలేవీ నెరవేరకపోవడంతో శనివారం మళ్లీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన అధికారులు రాత్రి 10 గంటల తరువాత మెస్ కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలుస్తున్నట్లు ప్రకటించారు. వర్సిటీలోని 8,684 మంది విద్యార్థులకు భోజనాలు, టిఫిన్స్ అందించేందుకు ఆగస్టు 6లోపు టెండర్లు దాఖలు చేయాలని డైరెక్టర్ సతీశ్ పేరిట ఆ టెండర్లో పేర్కొన్నారు. అయితే విద్యార్థులు మాత్రం రాత్రి 11 గంటల వరకు భోజనం చేయలేదు. -
ఆర్డీవో సాక్షిగా అన్నంలో పురుగులు
బాసర(ముధోల్): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో మెస్ నిర్వహణ తీరు అధ్వానంగా మారింది. విద్యార్థులకు అందించే బ్రేక్‌ఫాస్ట్, భోజనంలో మొన్న కప్ప, నిన్న బొద్దింక కనిపించగా... నేడు సాలెపురుగు వచ్చింది. మూడు రోజులుగా విద్యార్థులకు కలుషిత ఆహారం సర్వ్ అవుతూనే ఉంది. మొదటిరోజు ఆలూ కూర్మతో కప్పను, రెండో రోజు పప్పుసాంబారుతో బొద్దింకలని వడ్డించారు శక్తి మెస్ నిర్వాహకులు. మీడియాలో వరుస కథనాలతో సీరియస్ అయిన సర్కార్... మెస్ నిర్వహణపై కలెక్టర్ విచారణకు ఆదేశించింది. ఆర్డీవో లోకేశ్ కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష ట్రిపుల్ ఐటీలో సోమవారం పర్యటించి మెస్‌లో భోజనం తీరును పరిశీలించారు. శాంపిల్స్‌ను సేకరించి నాచారంలోని ల్యాబ్‌కు పంపించారు. ఆర్డీవో పరిశీలన కొనసాగుతున్న సమయంలో సైతం విద్యార్థులకు వడ్డిస్తున్న అన్నంలో పురుగులు రావడం తీవ్ర దుమారం రేపింది. వరుసగా కలుషిత ఆహారాన్నే పెడుతున్నా... క్యాంటీన్ నిర్వహిస్తున్న శక్తి మెస్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
అమెరికాపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ధ్వజం
ఇస్లామాబాద్: అగ్రరాజ్యం అమెరికా తన వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌కే ప్రాధాన్యం ఇస్తుందని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అఫ్గాన్‌లో వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికే తమ దేశాన్ని వాడుకుంటోందని విమర్శించారు. అఫ్గాన్ నుంచి అమెరికా తమ దళాల్ని ఉపసంహరించిన తర్వాత ఆ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకుంటూ ఉండడంతో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ‘‘అఫ్గాన్‌లో అమెరికా 20 ఏళ్ల పాటు మిలటరీ చర్యలు తీసుకున్నా ప్రయోజనమేమీ కలగలేదు. ఇప్పుడు బలగాల ఉపసంహరణతో పరిస్థితులు మరింత క్షీణించాయి. తాను సృష్టించిన ఈ గందరగోళాన్ని చక్కదిద్దడానికే పాకిస్తాన్‌ను అమెరికా వాడుకుంటోంది. భారత్‌తో బంధం బలపడ్డాక మాతో వ్యవహరించే తీరులోనే చాలా మార్పు వచ్చింది’’ అని ఇమ్రాన్‌ఖాన్ విదేశీ జర్నలిస్టుల సమావేశంలో వ్యాఖ్యానించారు. అఫ్గాన్ అధ్యక్షుడిగా అష్రాఫ్ ఘనీ ఉన్నంత కాలం తాలిబన్లు అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరపరని, దాని వల్ల సమస్యలు ఇంకా ఎక్కువవుతాయని ఇమ్రాన్‌ఖాన్ చెప్పారు. మరోవైపు జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాక పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు మర్యాదపూర్వకంగానైనా ఫోన్ చేసి మాట్లాడకపోవడంపై ఆ దేశం ఇంకా గుర్రుగానే ఉంది. -
వాలెంటైన్స్‌డే : కాజల్ ఎక్కడికి వెళ్లిందో తెలుసా?
చెన్నై : కొత్తగా పెళ్లయిన దంపతులు మొదటి వాలెంటైన్స్‌డేను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ సైతం తన భర్తతో కలిసి డిన్నర్ డేట్‌ను జరుపుకున్నారు. అయితే వారు వెళ్లింది ఏ స్టార్ హోటల్‌కో అని అనుకుంటే మీరు పొరపడినట్లే. చాలా సాధాసీదాగా ఉండే ఒక చిన్న మెస్‌కి భర్త గౌతమ్కిచ్లూను తీసుకెళ్లింది కాజల్. తమిళనాడు పొల్లాచిలోని శాంతిమెస్ అంటే తనకు ఎంతో ఇష్టమని, దాదాపు 9ఏళ్ల నుంచి తాను ఇక్కడి హోటల్‌కి వస్తున్నానని కాజల్ పేర్కొంది. 'శాంతి అక్క, బాల కుమార్ అన్న..ప్రేమానురాగాలతో వడ్డించి పెడతారు. అందుకే ఈ ఇక్కడి ఆహారం ఎంతో రుచికరంగా ఉండటంతో 27 ఏళ్ల నుంచి ఎంతో ప్రాచుర్యం పొందింది' అని కాజల్ తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అంతటి స్టార్ హీరోయిన్ అయ్యిండి కూడా ఎలాంటి గర్వం లేకుండా కాజల్.. ఓ చిన్న హోటల్ గురించి ఇంత గొప్పగా మాట్లాడటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాజల్-గౌతమ్ దంపతులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చదవండి : (సిగరెట్ కాల్చిన కాజల్.. అభిమానులు షాక్) (తనకున్న వ్యాధి గురించి చెప్పిన కాజల్) My absolute favourite Shanti mess in Pollachi. That’s Shanti akka and Balakumar anna,serving us with utmost love.That’s the reason why their food has consistently been delicious since the past 27years and I’ve been going to their adorable little outlet since 9 years! @kitchlug ❤️ pic.twitter.com/9eJesMI926 — Kajal Aggarwal (@MsKajalAggarwal) February 14, 2021 -
వెజ్జా.. నాజ్ వెజ్జా..?!
చెన్నై : కులం, మతం పేరుతో విభజించడం తెలుసు.. కానీ భోజనం పేరు చెప్పి కూడా మనషులును విభజించడం గురించి చాలా తక్కువుగా విని ఉంటాము. నార్మల్‌గా బయట ఫంక్షన్లలో వెజ్, నాన్ వెజ్ అంటూ రెండు వేర్వేరు మెనులు ఏర్పాటు చేస్తారు. కానీ హస్టల్స్లో ఇలాంటి వర్గీకరణ గురించి ఎప్పుడు వినలేదు. కానీ ఇలాంటి సంఘటన ఒకటి మద్రాస్ ఐఐటీలో చోటు చేసుకుంది. ఇక్కడ క్యాంటీన్లో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్లకు వేర్వేరు దారులనే కాక వేర్వేరే వాష్ బేసిన్లను కూడా ఏర్పాటు చేసింది యాజమాన్యం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే విద్యార్థుల కోరిక మేరకే ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. గత ఏడాది మేలో క్యాంపస్‌లో ‘బీఫ్ పెస్టివల్’ని నిర్వహించారు. ఈ సమయంలో హస్టల్లో గొడవలు కూడా జరిగాయి. బీఫ్ ఫెస్టివల్లో పాల్గొన్నందుకు ఓ రిసెర్చ్ స్కాలర్ని చితక బాదారు కూదా. ఈ సంఘటన తరువాత విద్యార్థులు.. వెజిటేరియన్లకు ప్రత్యేక మెస్ కావాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇలా రెండు మెస్‌లను ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం పేర్కొంది. అయితే ఇలా వేర్వేరు మెస్‌లు ఏర్పాటు చేయడం పట్ల విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. యాజమాన్యం క్యాంపస్‌లో వర్ణ, వర్గ వివక్షలకు తెరతీస్తోందంటూ ఆగ్రహం వ్యక్యం చేస్తున్నారు. అయితే విద్యార్థులను ఆహారం పేరు చెప్పి రెండు వర్గాలుగా విభజించడం పట్ల తమిళ విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన తెలుపుతున్నాయి. మొత్తం ఐఐటీలో 8 వేల మంది విద్యార్థులుండగా వీరిలో 6 వేల మంది నాన్ వెజిటేరియన్లు కాగా.. మరో 2 వేల మంది వెజిటేరియన్లు. -
భగ్గుమన్న ‘బాసర’ విద్యార్థులు
నిర్మల్: తమ సమస్యల పరిష్కారం కోసం బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన రెండోరోజూ కొనసాగింది. ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న ‘ట్రబుల్స్’పై ట్రిపుల్ ఐటీయన్లు గళమెత్తారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఉదయం నుంచి మంగళవారం రాత్రి వరకు ఆందోళనలు నిర్వహించారు. దీంతో అధికారులు సోమ వారం రాత్రి నిరవధిక సెలవులు ప్రకటించి, మెస్‌లను మూసివేశారు. అయినా విద్యార్థులు ఇళ్లకు వెళ్లకుండా మంగళవారం అక్కడే బైఠాయించారు. గవర్నర్ నరసింహన్, ఐటీ మంత్రి కేటీఆర్ వచ్చేంత వరకు కదిలేది లేదని భీష్మిం చు కొని కూర్చున్నారు. చివరకు విద్యార్థుల పలు డిమాండ్లకు ఇన్చార్జి వీసీ అశోక్ ఒప్పుకున్నా వారు సంతృప్తి చెందలేదు. సొమ్మసిల్లిన విద్యార్థులు అధికారులు సెలవులు ప్రకటించడంపై విద్యార్థులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత కళాశాలతో పాటు మెస్‌లను మూసి వేసినా ఇళ్లకు వెళ్లకుండా రోజంతా ఎండలోనే బైఠాయించారు. పలుమార్లు ఇన్చార్జి వీసీ అశోక్ సంప్రదింపులు జరిపినా విద్యార్థులు స్పందించలేదు. ఎండలో తిండి లేకుండా ఉండటంతో చాలామంది విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని అప్పటికప్పుడు తోటి విద్యార్థులే గదుల్లోకి తీసుకెళ్లి సపర్యలు చేశారు. ఇంత జరిగినా అధికారులు మెస్‌లను తెరవకపోవడం, తమకు భోజనం అందించకపోవడంతో విద్యార్థులు మరింత ఆగ్రహించారు. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం రాత్రి పలువురు విద్యార్థులు ఇంటిబాట పట్టారు. ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి.. తమ సమస్యలపై ఆర్జీయూకేటీ విద్యార్థులు నేరుగా మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా వినతులను పంపించారు. దీనికి స్పందించిన కేటీఆర్ సోమవారం రాత్రి వీసీతో మాట్లాడి, తన వద్దకు విద్యార్థుల బృందాన్ని పంపాలని, వారి తో మాట్లాడి పరిష్కరిస్తానని సూచించినట్లు తెలిసింది. సమస్యల పరిష్కారానికి కృషి: ఈటల జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌ను మోత్కులగూడెం చౌరస్తా వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు. బాసర ట్రిపుల్ ఐటీలో తమ పిల్లలకు తాగునీరు లేక అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈటల హామీ ఇచ్చారు. రాత్రి మెస్‌లు తెరిచిన అధికారులు బాసర: విద్యార్థుల ఆందోళనతో మంగళవారం రాత్రి మెస్‌లు తెరిపించారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనంతరం వెళ్లిపోవాలని సూచించారు. సెలవులు ఎప్పటి వరకు అన్నది త్వరలో ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. -
మెడికోలకు మెస్ గోల
–నాసికరం భోజనం పెడుతున్నారని ఆరోపణ అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు పోలీసులకు ఫిర్యాదులు పట్టించుకోని మెడికల్ కళాశాల అధికారులు జిల్లాకే గర్వకారణమైన ప్రభుత్వ మెడికల్ కళాశాల స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ నిర్వహణలో అడుగడుగునా అవినీతి.. అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. నాసిరకం భోజనం పెడుతూ రూ.లక్షలు దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై నాలుగు రోజుల క్రితమే గొడవలు ప్రారంభమై పోలీసులకు ఫిర్యాదులు వెళ్లినా అధికారులు పట్టించుకోవడం లేదు. నెల్లూరు(అర్బన్): నెల్లూరు నగరం దర్గామిట్టలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పెట్టే నాసిరకం భోజనం తినలేకపోతున్నామని మెడికోలు అంటున్నారు. ఈ విషయమై ప్రశ్నించిన విద్యార్థులపై వార్డెన్‌కు సపోర్ట్‌గా ఉన్న వారు శనివారం దాడి చేశారు. విషయం పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. ఈ విషయాలపై ‘సాక్షి’ ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. టెండర్లు లేవు.. బిల్లులుండవు: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 300 మంది మెడికోలు వైద్య విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 130 బాలురకు ఒక మెస్‌ను వార్డెన్ హోదాలో డాక్టర్ రామన్ నిర్వహిస్తున్నారు. 144 మంది బాలికలకు డాక్టర్ లక్ష్మి హాస్టల్‌ను నిర్వహిస్తున్నారు. హాస్టల్‌ను నిర్వహించాలంటే కార్పొరేషన్ అనుమతితో టెండర్లు పిలవాలి. ఎవరు తక్కువకు కొటేషన్ ఇస్తే వారికే నిర్వహణ అప్పగించాలి. ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. లెక్కలు చెప్పమనేసరికి గొడవలు: మెస్ లెక్కలు చెప్పమని సీనియర్ విద్యార్థులు గత శుక్రవారం అడిగినందుకు వార్డెన్ డాక్టర్ రామన్ పర్యవేక్షణలో చెప్పిన లెక్కలు కాకి లెక్కలుగా ఆరోపించారు. ఒక్కదానికీ లెక్క చూపలేదు. బిల్లులు లేవు. తెల్లకాగితం మీద రాసి చూపుతున్నారు. ఇదెక్కడి న్యాయమని విద్యార్థులు ప్రశ్నించారు. దీంతో వార్డెన్లు కమిటీ సభ్యులుగా ఉన్న వారిని విద్యార్థులపైకి ఉసికొల్పారనే ఆరోపణలున్నాయి. శనివారం సాయంత్రం గొడవలు తారాస్థాయికి చేరడంతో కొట్టుకున్నారు. లేడిస్ హాస్టల్లో మరీ దారుణం: లేడీస్ హాస్టల్ వార్డెన్ డాక్టర్ లక్ష్మిది తిరుపతి. ఆమె వారంలో రెండు, మూడు రోజులు తిరుపతికి వెళ్తారు. మెస్ నిర్వహణ బాధ్యతను కేర్ టేకర్పైనే మోపుతున్నారు. కేర్ టేకర్ విద్యార్థినుల నుంచి మెస్ బిల్లులు వసూలు చేస్తుంటారు. అయితే కొంత మంది దగ్గర రూ.3,200, మరికొంతమంది వద్ద రూ.3,500 వంతున వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. డబ్బులిస్తే సమయపాల లేకుండా బాలికలను షాపింగ్‌కు పంపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు నెలల క్రితం ఓ యువతి మిస్సింగ్ పేరిట పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. మార్కులు కట్ చేస్తారనే భయంతోనే మెస్‌కు: వైద్య వృత్తిలో కీలకమైన మార్కులు ఎంతో కీలకం. అవి వార్డెన్లుగా ఉన్న డాక్టర్ల చేతిలో ఉంటాయని, వారిని ప్రశ్నిస్తే మార్కులు పోతాయన్న భయంతో ఇష్టంలేకున్నా మెస్‌లో తింటున్నామని విద్యార్థులు ‘సాక్షి’ వద్ద వాపోయారు. డబ్బులు తిన్నారనేది అపోహ మాత్రమే – డాక్టర్ రవిప్రభు, ప్రిన్సిపల్, మెడికల్ కళాశాల రూ.50 వేలు మిస్యూజ్ అయ్యాయని విద్యార్థులు అపోహ పడుతున్నారు. వాస్తవం లేదు. ఈ విషయమై కొట్టుకోలేదు. విద్యార్థులు నెట్టుకున్నారు. విషయాన్ని పరిశీలిస్తున్నాం. -
‘మెనూ ప్రకారం భోజనం అందించాలి’
చెన్నూర్: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని మండల ప్రత్యేకాధికారి ప్రభాకర్ అన్నారు. బుధవారం పట్టణంలోని బీసీ, ఎస్సీ బాలుర వసతి గహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదులు, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. ప్రతి రోజూ మెనూ ప్రకారం భోజనాన్ని అందిస్తున్నారా..? లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వంట గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కూరగాయలు, పప్పులతో కూడిన భోజనాన్ని తప్పక అందజేయాలన్నారు. వార్డెన్లు అందుబాటులో ఉండాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో మల్లేశం పాల్గొన్నారు. -
ఆంధ్రా యూనివర్సిటీలో ఆందోళన
విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో శుక్రవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. కొంత కాలంగా భోజన వసతులు అధ్వాన్నంగా ఉన్నాయంటూ వీసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వెంటనే చర్యలు తీసుకుని వసతులు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో యూనివర్సిటీ వీసీ నారాయణ భోజన వసతుల గురించి చర్చిస్తున్నారు. -
హెచ్ఆర్సీ ముందు హాజరైన వీసీ
హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్శిటీ వ్యవహారం హెచ్ఆర్సీకి చేరింది. యూనివర్శిటీలో విద్యార్థులకు భోజన వసతి సౌకర్యాలు కల్పించడం లేదంటూ ఆమ్ఆద్మీపార్టీ నేత విశ్వేశ్వరరావు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీంతో హెచ్ ఆర్సీ వీసీకి నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీసీ అప్పారావు శనివారం హెచ్చార్సీ ముందు వివరణ ఇచ్చారు. -
హెచ్‌సీయూలో తెరుచుకున్న మెస్‌లు
మూడో రోజూ వర్సిటీలో కొనసాగిన ఆంక్షలు మంచినీరు, ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ 76వ అకడమిక్ కౌన్సిల్ సమావేశం వాయిదా హైదరాబాద్: వరుస ఆందోళనలతో అట్టుడికిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గురువారం కూడా పోలీసు ఆంక్షలు కొన సాగాయి. సిబ్బంది, విద్యార్థులు మినహా ఇతరులెవరినీ లోనికి అనుమతించలేదు. అయితే ప్రొఫెసర్లు, విద్యార్థి, ప్రజా సంఘాల ఒత్తిడికి తలొగ్గిన యాజమాన్యం మెస్‌లు సహా మంచి నీరు, ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది. వర్సిటీలో మొత్తం 22 హాస్టళ్లు ఉండగా వీటిలో 4 వేల మంది వసతి పొందుతున్నారు. వీరి కోసం పది మెస్లున్నాయి. మెస్సుల్లో పనిచేస్తున్న సిబ్బందిపై విద్యార్థులు దాడి చేయడం తో బుధవారం ఆయా మెస్‌లను బంద్ చేసి నిరసనకు దిగిన విషయం తెలిసిందే. స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రకాశ్‌బాబు, చీఫ్ వార్డెన్ నాగరాజు, ప్రొఫెసర్లు మీనాహరిహరన్, పద్మజ విజ్ఞప్తి మేరకు గురువారం మెస్‌లను పున రుద్ధరించారు. రెండు రోజులుగా ఇబ్బందులు పడ్డ విద్యార్థులు మెస్‌లు తెరుచుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు వర్సిటీలో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో గురువారం జరగాల్సిన 76వ అకడమిక్ కౌన్సిల్ సమావేశం వాయిదా వేశారు. ఆందోళన విరమించి విధుల్లోకి.. కొందరు విద్యార్థుల దాడితో సహాయ నిరాకరణ చేస్తున్న బోధనేతర ఉద్యోగులను గురువారం వీసీ చర్చలకు ఆహ్వానించారు. బోధనేతర ఉద్యోగుల సంఘం జేఏసీ నేతలు ఆర్.గంగరాజు, నిరంజన్‌రెడ్డి, తుకారాం, శంకరయ్య, పూల్‌సింగ్, రఘురామ్ తదితరులు వీసీతో చర్చలు జరిపారు. తమపై దాడి చేసిన వారితో క్షమాపణలు చెప్పించడంతో పాటు భవిష్యత్తులో మళ్లీ దాడులకు పాల్పడమని లిఖితపూర్వక హామీ ఇప్పించాలని డిమాండ్ చేశారు. తమకు తగు రక్షణ కల్పించాలన్నారు. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తామని, ఆందోళన విరమించాలని వీసీ సూచించడంతో తాత్కాలికంగా ఆందోళనను విరమిస్తున్నట్లు వారు ప్రకటించారు. వీసీ దిష్టిబొమ్మ దహనం కాగా, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వర్సిటీ షాపింగ్ కాంప్లెక్స్‌లో వీసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జుహైల్ మాట్లాడుతూ.. రోహిత్ మృతి ఘటనలో వీసీ ప్రథమ ముద్దాయి అని ఆరోపించారు. వర్సిటీ గేట్లకే కాక విద్యార్థుల గళాలకూ తాళం వేయాలని వీసీ చూస్తున్నారని, అరెస్టు చేసి జైలుకు పంపిన వారిని విడుదల చేయించాలని డిమాం డ్ చేశారు. మరోవైపు వంటావార్పు కార్యక్రమ సమయంలో పోలీసుల లాఠీచార్జీలో గాయపడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పీహెచ్డీ విద్యార్థి ఉదయ్భానును.. రోహిత్ వేముల తల్లి రాధిక పరామర్శించారు. -
వండినవి తీసుకొస్తారు...వంటవాళ్లూ వస్తారు!
రోజురోజుకూ మారుతున్న ఆన్లైన్ ఫుడ్ మార్కెట్ - తిండికే కాదు..టీ, స్నాక్స్‌కూ ఆన్లైన్లోనే ఆర్డర్ - 94 వేల కోట్లను దాటిన ఆన్లైన్ ఆహార మార్కెట్ - ఫుడ్ స్టార్టప్స్‌లోకి భారీగా వస్తున్న పెట్టబడులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రోజూ బయటికెళ్లి మెస్‌లోనో, హోటల్లోనో తినాలంటే బ్యాచిలర్స్కి బోర్. ఇంట్లో రోజూ వండే గృహిణులకు... సెలవురోజుల్లో మాత్రమే బయటికెళ్లి తినే అవకాశముంటుంది. అదీ బోరే. ఆఫీస్‌కి ఫుడ్ తెచ్చుకోలేని సమయంలో ప్రతిసారీ పక్కనున్న రెస్టారెంట్‌కెళ్లి తినాలంటే... అదీ బోరే. ఈ బోర్‌డమ్‌కి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేయండంటూ రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి ఫుడ్ స్టార్టప్‌లు. వేడి వేడి టీ నుంచి పరోటాలు, కూరలు, బిర్యానీల దాకా ఒకటేమిటి... అన్నిటినీ ఒక్క క్లిక్‌తో మీరున్న చోటికే తెస్తామంటున్నాయి ఈ కంపెనీలు. కొన్నాళ్ల కిందటివరకూ ఆన్‌లైన్‌ను ఆశ్రయించేవారంతా షాపింగ్, ట్రావెల్‌తో పాటు సినిమా టిక్కెట్లకే ప్రాధాన్యమిచ్చేవారు. ఈ జాబితాలోకిపుడు ఫుడ్ కూడా చేరింది. ఇంకా చెప్పాలంటే ఆన్లైన్ వ్యాపారంలో విలువ ఎక్కువ ఉండే ట్రావెల్ది మొదటి స్థానం కాగా... ఫుడ్‌ది 3వ స్థానం. దేశంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ విలువ రూ.94,755 కోట్లకు (15 బిలియన్ డాలర్లు) చేరిందనేది పరిశ్రమ వర్గాల మాట. అందుకే... గుర్తు పెట్టుకోలేనన్ని స్టార్టప్‌లు ఈ రంగంలోకి దిగుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డరంటే బిర్యానీ, పిజ్జా మాత్రమే. కానీ రకరకాల స్టార్టప్స్ ప్రవేశించాక.. టీ, టిఫిన్లు, సమోసా, సూప్స్, సలాడ్స్, పరాటా, జొన్న రొట్టెలు వంటివన్నీ ఆన్‌లైన్‌లోకి వచ్చేశాయి. అందుకేనేమో క్యాబ్స్ రెంటల్ విభాగంలో ఉన్న ఓలా... ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ నగరాల్లో ఓలా కెఫేను ప్రారంభించింది. ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం కేఎఫ్‌సీ కూడా... రైల్వే టిక్కెట్లు విక్రయించే ఐఆర్సీటీసీతో జట్టుకట్టి ఈ-క్యాటరింగ్ సేవలు ప్రారంభించింది. ఆన్లైన్లో ఫుడ్ మార్కెట్‌కున్న డిమాండ్ చెప్పడానికి ఇవి చాలవూ!!. ఫుడ్‌లోనూ హైదరాబాద్ హవా... ఇతర రంగాల స్టార్టప్‌ల మాదిరిగానే దేశంలోని ఇతర ఫుడ్ స్టార్టప్స్‌కు హైదరాబాదీ ఫుడ్ స్టార్టప్స్ గట్టి పోటీనిస్తున్నాయి. మెనూలోను, సేవల్లోను మాత్రమే కాక... ఇతర కంపెనీల కొనుగోళ్లలోనూ ఇవి ముందుంటున్నాయి. ఓ బ్లూచిప్ కంపెనీ పెట్టిన రూ.50 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌కు చెందిన హలోకర్రీ... స్థానిక స్టార్టప్ కంపెనీ అయిన పరాటా పోస్ట్‌ను, టెక్నాలజీ కంపెనీ ఫైర్ 42ను కొనుగోలు చేసింది. హైదరాబాద్, బెంగళూరుల్లో సేవలందిస్తున్న హలోకర్రీ... ఢిల్లీ, గుర్గావ్, ముంబై, గుజరాత్, పుణెలకూ విస్తరిస్తున్నట్లు కంపెనీ సీఈఓ రాజు భూపతి చెప్పారు. జంక్‌ఫుడ్ కు దూరంగా ఉండే మెట్రోవాసుల కోసం ‘హార్ట్ అండ్ సోల్.కో.ఇన్’ స్థాపించారు హైదరాబాద్‌కు చెందిన ఆర్జున్. రాగి, జొన్నలతో పాటు స్థానికంగా లభించే సేంద్రీయ ఉత్పత్తులతో జొన్న రొట్టెలు, బిస్కెట్ల వంటి ఫుడ్ ఐటమ్స్‌ను విక్రయించడం దీని ప్రత్యేకత. ఇక హైదరాబాద్ కు చెందిన ‘సూప్స్ అండ్ సలాడ్స్’ కేవలం సలాడ్స్నే విక్రయిస్తుంది. సేంద్రీయ ఉత్పత్తులతోనే సూప్స్, సలాడ్లను తయారు చేస్తామని.. కాలానుగుణంగా మెనూ మారుతుంటుందని దీని వ్యవస్థాపకురాలు సౌజన్య చెప్పారు. ప్రస్తుతం ఈ కంపెనీకి రోజుకు 200 వరకు ఆర్డర్లొస్తున్నాయి. 2020కల్లా 42 లక్షల కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ 370 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలో సంఘటిత ఆహారం మార్కెట్ విలువ 48 బిలియన్ డాలర్లు (రూ.3 లక్షల కోట్లు)గా ఉంటే.. ఇందులో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ మార్కెట్ విలువ రూ.94,755 కోట్లు(15 బిలియన్ డాలర్లు)గా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏటా ఫుడ్ డెలివరీ మార్కెట్ 30 శాతం వృద్ధి రేటును కనబరుస్తోంది. 2020 నాటికి 42 లక్షల కోట్లకు చేరుతుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదిక వెల్లడించింది. టీ, స్నాక్స్ కూడా ఆన్లైన్లోనే.. ముంబైలో ప్రసిద్ధి చెందిన చాయ్‌వాలాలను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది ‘చోటు చాయ్‌వాలా.కామ్’. ఇందులో రిజిస్టర్ చేసుకున్న వ్యక్తికి కార్యాలయానికైనా, ఇంటికైనా నిర్ణీత సమయానికి టీ, స్నాక్ డెలివరీ చేయటమే దీని ప్రత్యేకత. ‘‘ప్రస్తుతం ముంబైలో అతిపెద్ద మార్కెట్ ఏరియా అయిన బాంద్రాలో ప్రారంభించాం. నెలకు 500 ఆర్డర్లొస్తున్నాయి. వారానికి రూ.70 చెల్లిస్తే చాలు. ఐదు రోజులు క్రమం తప్పకుండా టీ చేతికొస్తుంది’’ అని సంస్థ సీఈఓ నితిన్ చెప్పారు. ఇక ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులు ఈ-క్యాటరింగ్ సేవల కింద కేఎఫ్‌సీ మీల్‌కు ఆర్డర్ చేయవచ్చు. ప్రస్తుతానికి న్యూఢిల్లీ మీదుగా ప్రయాణించే 12 రైళ్లలో ప్రవేశపెట్టామని.. ఈ నెలాఖరులోగా విశాఖపట్నం, హైదరాబాద్ (కాచిగూడ),బెంగళూరు (యశ్వంత్‌పూర్) స్టేషన్ల నుంచి కూడా ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తామని కేఎఫ్ఎసీ ప్రకటించింది. ఇంటికొచ్చే షెఫ్... అర్ధరాత్రి మీల్స్ స్టార్టప్స్ ఫుడ్ ఆర్డర్ల వరకే పరిమితం కాలేదు. షెఫ్‌లే ఏకంగా ఇంటికొచ్చి వంట చేసి పెడుతున్నారు కూడా. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న రెస్టోకిచ్ ఈ రకమైన సేవలందిస్తోంది. దీంతో పార్టీ సమయాల్లో ఇంట్లోని సభ్యులు వంటింటికే పరిమితం కాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి పార్టీని ఎంజాయ్ చేయవచ్చు. ప్రస్తుతం పుణె, ముంబైల్లో సేవలందిస్తున్న రెస్టోకిచ్ను... ఏడాదిలోగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, గోవాల్లో విస్తరించే యోచన ఉన్నట్లు సంస్థ ఫౌండర్ ముకుల్ తెలిపారు. ఇక ‘ది బూటీకాల్’ స్టార్టప్ది మరో ప్రత్యేకత. కేవలం అర్ధరాత్రి సమయంలో మాత్రమే ఫుడ్ డెలివరీ చేస్తుంది ఈ సంస్థ. నైట్ షిఫ్ట్ ఉద్యోగులు, లేట్ నైట్ పార్టీలకు వెళ్లేవారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్... బూటీకాల్ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. -
ఓయూ విద్యార్థుల మెరుపు ధర్నా
ఉస్మానియా యూనివర్సిటీ: మెస్‌ల మూసివేతకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఏ విద్యార్థులు బుధవారం రాత్రి మెరుపు ధర్నాకు దిగారు. మెస్‌లోని వంట గిన్నెలను తార్నాక వద్ద రోడ్డుకు అడ్డంగా పెట్టి రాస్తారోకో చేపట్టారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. ఒకవైపు గురువారం నుంచి పరీక్షలు కొనసాగుతుండగా, మరోవైపు ఉన్నపళంగా మెస్‌లను మూసివేసి తమను రోడ్డుపైకి నెట్టారని ఆరోపిస్తూ వందలాది మంది ఎంబీఏ విద్యార్థులు మంజీర హాస్టల్ నుంచి రోడ్లపైకి వచ్చారు. కాలేజీ ప్రిన్సిపల్, ఇతర అధికారులు వచ్చే వరకు ధర్నాను విరమించబోమంటూ విద్యార్ధులు భీష్మించారు. పోలీసులు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. పీడీఎస్‌యూ ఎంబీఏ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నిలిచింది. ధర్నాతో అటు లాలాపేట ఫ్లైఓవర్ వరకు, ఇటు సికింద్రాబాద్ మెట్టుగూడ వరకు, హబ్సిగూడ మార్గంలో వాహనాలు నిలిచిపోయి. అడిక్‌మెట్, ఓయూ నుంచి తార్నాక వైపు వెళ్లే వాహనాలు ైసైతం గంటల తరబడి కదలలేదు.