ఓయూ విద్యార్థుల మెరుపు ధర్నా
ఉస్మానియా యూనివర్సిటీ: మెస్‌ల మూసివేతకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఏ విద్యార్థులు బుధవారం రాత్రి మెరుపు ధర్నాకు దిగారు. మెస్‌లోని వంట గిన్నెలను తార్నాక వద్ద రోడ్డుకు అడ్డంగా పెట్టి రాస్తారోకో చేపట్టారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది.
ఒకవైపు గురువారం నుంచి పరీక్షలు కొనసాగుతుండగా, మరోవైపు ఉన్నపళంగా మెస్‌లను మూసివేసి తమను రోడ్డుపైకి నెట్టారని ఆరోపిస్తూ వందలాది మంది ఎంబీఏ విద్యార్థులు మంజీర హాస్టల్ నుంచి రోడ్లపైకి వచ్చారు. కాలేజీ ప్రిన్సిపల్, ఇతర అధికారులు వచ్చే వరకు ధర్నాను విరమించబోమంటూ విద్యార్ధులు భీష్మించారు.
పోలీసులు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. పీడీఎస్‌యూ ఎంబీఏ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నిలిచింది. ధర్నాతో అటు లాలాపేట ఫ్లైఓవర్ వరకు, ఇటు సికింద్రాబాద్ మెట్టుగూడ వరకు, హబ్సిగూడ మార్గంలో వాహనాలు నిలిచిపోయి. అడిక్‌మెట్, ఓయూ నుంచి తార్నాక వైపు వెళ్లే వాహనాలు ైసైతం గంటల తరబడి కదలలేదు.