‘మెనూ ప్రకారం భోజనం అందించాలి’ | for students mess should as per menu | Sakshi

‘మెనూ ప్రకారం భోజనం అందించాలి’

Published Wed, Jul 27 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

for students mess should as per menu

చెన్నూర్‌: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని మండల ప్రత్యేకాధికారి ప్రభాకర్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని బీసీ, ఎస్సీ  బాలుర వసతి గహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  వంట గదులు, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. ప్రతి రోజూ మెనూ ప్రకారం భోజనాన్ని అందిస్తున్నారా..? లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
        ఈ సందర్భంగా వంట గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కూరగాయలు, పప్పులతో కూడిన భోజనాన్ని తప్పక అందజేయాలన్నారు. వార్డెన్‌లు అందుబాటులో ఉండాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో మల్లేశం పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement