వాలెంటైన్స్‌డే : కాజల్‌ ఎక్కడికి వెళ్లిందో తెలుసా? | Kajal Aggarwal,Her Husband Enjoys Valentines Date Night In Pollachi | Sakshi
Sakshi News home page

అక్కడికి 9 ఏళ్ల నుంచి వెళ్తున్నా..అదే నా ఫెవరెట్‌

Feb 15 2021 5:10 PM | Updated on Feb 15 2021 7:06 PM

Kajal Aggarwal,Her Husband Enjoys Valentines Date Night In Pollachi  - Sakshi

చెన్నై : కొత్తగా పెళ్లయిన దంపతులు మొదటి వాలెంటైన్స్‌డేను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ సైతం తన భర్తతో కలిసి డిన్నర్‌ డేట్‌ను జరుపుకున్నారు. అయితే వారు వెళ్లింది ఏ స్టార్‌ హోటల్‌కో అని అనుకుంటే మీరు పొరపడినట్లే. చాలా సాధాసీదాగా ఉండే ఒక చిన్న మెస్‌కి భర్త గౌత‌మ్‌కిచ్లూను తీసుకెళ్లింది కాజల్‌. తమిళనాడు పొల్లాచిలోని శాంతిమెస్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని, దాదాపు 9ఏళ్ల నుంచి తాను ఇక్కడి హోటల్‌కి వస్తున్నానని కాజల్‌ పేర్కొంది.

'శాంతి అక్క‌, బాల కుమార్ అన్న‌..ప్రేమానురాగాల‌తో వ‌డ్డించి పెడ‌తారు. అందుకే ఈ ఇక్కడి ఆహారం ఎంతో రుచికరంగా ఉండటంతో 27 ఏళ్ల నుంచి ఎంతో ప్రాచుర్యం పొందింది' అని కాజల్‌ తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అంతటి స్టార్‌ హీరోయిన్‌ అయ్యిండి  కూడా ఎలాంటి గర్వం లేకుండా కాజల్‌.. ఓ చిన్న హోటల్‌ గురించి ఇంత గొప్పగా మాట్లాడటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాజల్‌-గౌతమ్‌ దంపతులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 


చదవండి : (సిగరెట్‌ కాల్చిన కాజల్‌.. అభిమానులు షాక్‌)

                (తనకున్న వ్యాధి గురించి చెప్పిన కాజల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement