సాక్షి,శ్రీకాకుళం: ఒకప్పుడు నాటుకోడి అందరికీ ఇష్టమైన మాంసాహారం. తర్వాత ధరలు పెరిగిపోవడంతో కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితమైంది. బ్రాయిలర్ చికెన్ ధరకు నాటుకోడి చికెన్ ధర రెట్టింపు ఉండేది. కోవిడ్ సమయం నుంచి ప్రజలు ధర కాస్త ఎక్కువైనా మళ్లీ నాటుకోడి వైపు దృష్టి సారించారు.
పెరటి కోళ్ల పరిశ్రమకు ప్రోత్సాహం
రాష్ట్ర ప్రభుత్వం పెరటి కోళ్ల పరిశ్రమను ప్రోత్సహిస్తోంది. మహిళా సంఘాలు, పొదుపు సంఘాల వారికి రాయితీపై కోళ్ల పెంపకం యూనిట్లను అందజేస్తున్నారు. దీని వల్ల నాటుకోడి ధర తగ్గింది. ప్రస్తుతం కిలో నాటుకోడి ధర రూ.400 వరకు ఉంది.
ప్రత్యేక సంతలు
నాటు కోళ్లు కావాలంటే గతంలో గ్రామాలకు వెళ్లి కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు నగరాలు, పట్టణాలకు సమీపంలో ఉన్న గ్రామస్తులు నాటుకోళ్లను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. గురువారం శ్రీకాకుళం నగరంలోని పొట్టి శ్రీరాములు జంక్షన్‌లో నాటుకోళ్ల సంత జరుగుతుంది. బుధవారం నరసన్నపేటలో నాటుకోళ్ల ప్రత్యేక సంత ఉంటుంది. ఇలా జిల్లాలోని పట్టణాల్లో నాటుకోళ్లకు ప్రత్యేక సంతలు నిర్వహిస్తున్నారు. చింతాడ, బుడుమూరు, సీతంపేటలలో వారానికోసారి నిర్వహించే సంతల్లో కూడా నాటుకోళ్లను విక్రయిస్తారు.
చదవండి: బ్యాచిలర్స్ అద్దెకుంటున్న ఇంట్లో మహిళ అనుమానాస్పద మృతి
Comments
Please login to add a commentAdd a comment