Belgian
-
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. ఏకంగా 165 మందికి జాక్‌పాట్! ఎలా ?
న్యూఢిల్లీ: ఎవరైనా ఒక వ్యక్తికి అనూహ్యంగా ఏదైనా మంచి జరిగితే కలిసి వచ్చిన అదృష్టం అనుకుంటాం. కానీ అనుకోకుండా అదృష్ట దేవత తలుపు తట్టడంతో గ్రామంలో ఏకంగా 165మందికి జాక్‌పాట్ తగిలింది. బెల్జియంలోని ఒక గ్రామంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. దీంతో క్రిస్మస్ ముందే వచ్చిందంటూ వారంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. దాదాపు 165 మంది అకౌంట్లో ఏకంగా (15,11,83,056 డాలర్లు) ఒక్కొక్కరికీ రూ.7.50 కోట్లు జమ అయ్యాయి. ఇదేదో సినిమా స్టోరీలా అనిపించినా.. నిజంగా మిరాకిల్ జరిగింది. వివరాల్లోకి వెళితే ఆంట్వెర్ప్లోని ఉత్తర బెల్జియంలోని ఓల్మెన్ అనే చిన్న గ్రామానికి చెందిన 165 మంది వ్యక్తులు విజేతలుగా నిలిచారని యూరో న్యూస్ నివేదించింది. యూరో మిలియన్స్ లాటరీలో ఓల్మెన్ వాసులు దాదాపు 165 మందిని లాటరీ రూపంలో అదృష్టం వరించింది. ఓల్మెన్‌లో దాదాపు 4000 మంది జనాభా ఉండగా, ప్రతి 24 మందిలో ఒకరు విజేతలు. అయితే గ్రామానికి చెందిన ఒక్కొక్కరు కొంత మొత్తాన్నిచందాగా వేసుకుని ఉమ్మడిగా యూరో మిలియన్ లాటరీ టికెట్స్‌ను కొనుగోలు చేశారు. అంతే వారికి జాక్‌పాట్ తగిలింది. ఏకంగా రూ.1200 కోట్ల విలువైన నగదు గెలుచుకున్నారు. ఫలితంగా ఒక్కొక్కరి ఖాతాలో దాదాపు రూ.7.50కోట్లు జమయ్యాయి. దీంతో ఈ ఏడాది బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ అంటూ ఆ 165 మంది ఆనందంతో మునిగి తేలుతున్నారు. గత కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలుచేస్తున్నప్పటికీ ఇప్పటికి అదృష్టం వరించింది, మరోవైపు లాటరీ గెల్చుకున్నవారంతా ఇప్పటికీ నమ్మలేకపోతున్నారని లాటరీ షాప్ యజమాని విమ్ వాన్ బ్రోకోవెన్ చెప్పాడు. ఇంతమందికి ఒకేసారి లాటరీ రావడం తనకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. విజేతలలో ఇరవై ఏళ్ల యువతి తనకు, తన కుక్కల కోసం ఇల్లు కొనాలని యోచిస్తోందని తెలిపాడు. ఇప్పటివరకు అతిపెద్ద గ్రూప్‌గా ఇంత పెద్దమొత్తంలోలాటరీ గెల్చుకోవడం ఇదే తొలిసారి అని బెల్జియం లాటరీ ప్రతినిధి జోక్ వెర్మోరే వ్యాఖ్యానించారు. అయితే విజేతల వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు. కేవలం 15 యూరోల పెట్టుబడికిగాను ఈ నగదును గెల్చుకోవడం సంచలనంగా మారింది. -
Zara Rutherford: గాలిలో తేలినట్టుందే..!
నీటిమీద, నేల మీద ప్రపంచాన్ని చుట్టి రికార్డులు సృష్టించినవాళ్లు చాలామందే ఉన్నారు. వీరందరికీ భిన్నంగా ఓ 19 ఏళ్ల అమ్మాయి గాల్లో ప్రయాణిస్తూ ప్రపంచాన్ని చుట్టి సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. బెల్జియన్ బ్రిటిష్ సంతతికి చెందిన జరా రూథర్‌ఫర్డ్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే ‘బెస్పోక్ షార్క్ ఆల్ట్రాలైట్ ’ విమానంలో ప్రపంచాన్ని చుట్టేయనుంది. ఆగస్టు పదకొండున బ్రసెల్స్‌లో ప్రారంభమయ్యే జరా ప్రపంచ యాత్ర మూడు నెలలు కొనసాగి యూరప్ లో ముగుస్తుంది. 52 దేశాలను చుట్టే క్రమంలో 51 వేల కిలోమీటర్లు ప్రయాణించనుంది. జరా తల్లిదండ్రులు ఇద్దరు పైలట్లు కావడంతో 14 ఏళ్ల వయసునుంచే విమానం నడపడం నేర్చుకుంది. పద్దెనిమిదో ఏట విమానం నడిపే లైసెన్స్ తీసుకుంది. జరా యాత్ర సవ్యంగా సాగితే ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి అతిపిన్న వయస్కురాలిగా నిలవనుంది. ప్రస్తుతం 30 ఏళ్ల వయసులో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన షెస్తావాయి (2017) పేరుమీద రికార్డు ఉండగా, పురుషుల విభాగంలో 18 ఏళ్ల అతిపిన్న వయస్కుడి మీద మరో రికార్డు ఉంది. ‘‘అమ్మ కాస్త వెనక్కు లాగినప్పటికీ, నాన్న మాత్రం ఎప్పుడూ ప్రోత్సహించేవారు. ఆ ప్రోత్సాహంతోనే ఈరోజు యాత్రకు సిద్ధమయ్యాను. నా యాత్ర విజయవంతమైన తరువాత స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్) చదువుతోన్న చాలామంది అమ్మాయిలు ప్రేరణ పొంది ఏవియేషన్ రంగంలోకి వస్తారు. ఈ విభాగంలో పురుషులకు, మహిళలకు మధ్య చాలా తేడా ఉంది. అందుకే నేను రికార్డు నెలకొల్పి ఏవియేషన్‌లో అమ్మాయిలు కూడా రాణించగలరని నిరూపిస్తాను’’ అని జరా చెప్పింది. -
ఇక ఈ బీర్లకు చీర్స్ చెప్పాల్సిందే!
న్యూఢిల్లీ : ఇక ఎవరైనా మూడు బీర్లు, ఆరు గ్లాసులతో ఛీర్స్ చెప్పాల్సిందే. ఇంతకాలానికి శాస్త్రవేత్తలు బీరులో ఉన్న మంచి గుణాలను కనిపెట్టారు. బీరు తాగితే కొత్తగా బొజ్జలు రాకపోవడమే కాకుండా బొజ్జలు కరిగిపోయి మొత్తంగా స్థూలకాయం తగ్గుతుందట. పైగా సుఖంగా నిద్ర పడుతుందట. వీటిలో ఒకరకమైన బ్యాక్టీరియా, ఈస్ట్ మిశ్రమం ఉండడమే అందుకు కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. అన్ని బీర్లలో ఈ గుణం ఉందో, లేదో తెలియదుగానీ బెల్జియంకు చెందిన హోగార్డెన్, వెస్ట్‌మల్లే ట్రిపల్, ఎట్ క్రైకెన్‌బియర్ బ్రాండ్ల బీర్లలో ఈ మంచి గుణాలు ఉన్నాయట. ఆ బీర్లు రెండుసార్లు, భూగర్భంలో ఉండగా ఒకసారి, సీసాలో మరోసారి బీరు పులియడం వల్ల వాటికి ఆ మంచి గుణాలు అబ్బాయట. భూగర్భంలో పులియడానికి ఒకరకమైన ఈస్ట్, సీసాలో పులియడానికి మరో రకమైన ఈస్ట్‌ను ఉత్పత్తిదారులు ఉపయోగిస్తున్నారని, ఈ రెండోసారి పులియడంతోనే బీరులో ఎక్కువగా ఆరోగ్య లక్షణాలు చేరుతున్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వాటిలో కూడా లైట్ బీరుకన్నా స్ట్రాంగ్ బీరే మంచిదని, అలా అని ఎక్కువగా బీర్లు తాగమని తాను సిఫార్సు చేయడం లేదని ఆమ్స్టర్డామ్ యూనివర్శిటీలో బ్యాక్టీరియా నిపుణుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎరిక్ క్లాసెన్ చెప్పారు. ‘ఎక్కువ ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ రకమైన బ్రాండ్లలో రోజొకటి తాగినా ఆరోగ్యానికి మంచిదే. ఈ రకాల బీరు బాటిళ్లలో 50 శాతానికిపైగా మంచి బ్యాక్టీరియా ఉంది’ ఆయన చెప్పారు. -
24/7 కరెంట్ అందించే విశిష్ట టర్బైన్లు
మారమూల గ్రామాల్లో రోజంతా విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉండటం చాలా కష్టంగానే ఉంటుంది. ఎక్కడైనా 24 గంటల కరెంట్ అందుతుందంటే చాలా గ్రేట్. ప్రస్తుతం మారమూల ప్రాంతాల వారికి 24/7 విద్యుత్ అందించడానికి విశిష్టమైన టర్బైన్లు అందుబాటులోకి వచ్చాయి. బెల్జియన్ కంపెనీ టర్బ్యూలెంట్ వీటిని ప్రజల్లోకి తీసుకొచ్చింది. ఈ విశిష్ట టర్బైన్ల ద్వారా 60 గ్రామాల వరకు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మారుమూల గ్రామాలకు విద్యుత్ అందించడానికి వీటిని తీసుకొచ్చినట్టు కెంపెనీ చెప్పింది. వీటిని ఎక్కువగా నదులు, కాలువల వద్ద ఏర్పాటుచేసి, విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని కంపెనీ పేర్కొంటోంది. చిన్న తరహా విద్యుత్ ఉత్పాదకతకు భవిష్యత్తు ఇదే అంటున్నారు నిపుణులు. అసలెలా ఈ టర్బైన్లు పనిచేస్తున్నాయో ఈ వీడియో ఓ సారి చూడండి. -
ఫైనల్లో సౌరభ్ వర్మ
న్యూఢిల్లీ: బెల్జియం ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుడు సౌరభ్ వర్మ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. బెల్జియంలోని లెవెన్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సౌరభ్ 21-15, 21-16తో ఫాబియన్ రోత్ (జర్మనీ)పై గెలుపొందాడు. ఫైనల్లో లుకాస్ కార్వీ (ఫ్రాన్స్)తో సౌరభ్ ఆడతాడు. ఇదే టోర్నీలో బరిలోకి దిగిన భారత ఇతర ఆటగాళ్లు చిట్టబోరుున రాహుల్ యాదవ్ రెండో రౌండ్లో, ఆనంద్ పవార్ తొలి రౌండ్లో ఓడిపోయారు. -
పేలుళ్లతో అణు ప్లాంట్ తరలింపు
బ్రస్సెల్స్ లో వరుస పేలుళ్లు మారణహోమం సృష్టించిన నేపథ్యంలో రెండు అణువిద్యుత్ ప్లాంట్ లను తరలించినట్టు తెలుస్తోంది. బెల్జియంలోని తిహాంగే, డోయల్ ప్లాంట్లను తరలించారు. అధికారుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తరలింపు గల పూర్తి కారణాలు తెలియరాలేదు. ఈ విషయాన్నిఫ్రెంచ్ బహుళజాతి విద్యుత్ వినియోగ కంపెనీ ఇన్జై ఒక ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సహజ వాయువు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సేవలందిస్తున్న ఈ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. రక్షణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కొంతమంది ముఖ్య సిబ్బంది పర్యవేక్షణలో ప్లాంట్ కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. బ్రసెల్స్ లో మంగళవారం ఉదయించిన ఈ పేలుళ్లలో కనీసం 34 మంది మరణించగా 170 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. -
పారిస్ దాడిపై బెల్జియన్ వ్యక్తి అరెస్టు
రాబత్: పారిస్ దాడితో నేరుగా సంబంధం ఉన్న బెల్జియన్ పౌరుడిని మోరాకో పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని వారే ధ్రువీకరించారు. గత ఏడాది నవంబర్ నెలలో పారిస్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించి ఇప్పటికీ పారిస్ విచారణ జరుపుతోంది. అయితే, ఆ దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల్లో కొంతమందితో నేరుగా ఓ బెల్జియన్ పౌరుడికి సంబంధం ఉన్నట్లు గుర్తించి గత శుక్రవారం అరెస్టు చేసినట్లు మోరాకో అంతర్గత వ్యవహారాలమంత్రి తెలిపారు. అతడు కూడా ఉగ్రవాద సంస్థలు గతంలోనే చేరినట్లు భావిస్తున్నామని చెప్పారు.