మారమూల గ్రామాల్లో రోజంతా విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉండటం చాలా కష్టంగానే ఉంటుంది. ఎక్కడైనా 24 గంటల కరెంట్ అందుతుందంటే చాలా గ్రేట్. ప్రస్తుతం మారమూల ప్రాంతాల వారికి 24/7 విద్యుత్ అందించడానికి విశిష్టమైన టర్బైన్లు అందుబాటులోకి వచ్చాయి. బెల్జియన్ కంపెనీ టర్బ్యూలెంట్ వీటిని ప్రజల్లోకి తీసుకొచ్చింది. ఈ విశిష్ట టర్బైన్ల ద్వారా 60 గ్రామాల వరకు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మారుమూల గ్రామాలకు విద్యుత్ అందించడానికి వీటిని తీసుకొచ్చినట్టు కెంపెనీ చెప్పింది. వీటిని ఎక్కువగా నదులు, కాలువల వద్ద ఏర్పాటుచేసి, విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని కంపెనీ పేర్కొంటోంది. చిన్న తరహా విద్యుత్ ఉత్పాదకతకు భవిష్యత్తు ఇదే అంటున్నారు నిపుణులు. అసలెలా ఈ టర్బైన్లు పనిచేస్తున్నాయో ఈ వీడియో ఓ సారి చూడండి.
Comments
Please login to add a commentAdd a comment