Turbines
-
షైన్ 2.0: మడతపెట్టే టర్బైన్
పవనశక్తిని వాడుకోవాలంటే, భారీ విండ్ టర్బైన్లు అవసరమవుతాయి. గాలి బాగా వీచే ప్రదేశాన్ని చూసుకుని, ఒకచోట పాతిపెట్టాక వాటిని తరలించడం అంత తేలిక కాదు. అయితే ఈ తేలికపాటి విండ్ టర్బైన్ను మాత్రం ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు. కోరుకున్న చోట ఆరుబయట ఫ్యాన్ మాదిరిగా నిలిపి, దీని నుంచి విద్యుత్తును పొందవచ్చు.పిక్నిక్‌లలో టెంట్లు వేసుకున్నప్పుడు, టెంట్లకు కావలసిన విద్యుత్తును దీని ద్వారా పొందవచ్చు. కెనడియన్ కంపెనీ ‘ఆరియా టెక్నాలజీస్’ ఈ పోర్టబుల్ విండ్ టర్బైన్ను ‘షైన్-2.0’ పేరుతో రూపొందించింది. వాడకం పూర్తయ్యాక దీనిని చక్కగా మడిచి, సంచిలో వేసేసుకోవచ్చు.ఇదీ చదవండి: నెట్టింట్లో చర్చకు దారితీసిన ట్వీట్‘షైన్–2.0’ టర్బైన్ 50 వాట్ల విద్యుత్తును ఇంటర్నల్ బ్యాటరీకి నిరవధికంగా అందిస్తుంది. ఈ విద్యుత్తు ఒక ఇంట్లో వాడుకునే విద్యుత్తు పరికరాలన్నింటికీ పూర్తిగా సరిపోతుంది. దీని ధర 399.99 కెనడియన్ డాలర్లు (రూ. 24,626) మాత్రమే! -
‘జల విద్యుత్’కు గ్రీన్ సిగ్నల్ వచ్చేనా ?
అశ్వాపురం: అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ బ్యారేజీని జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు సోమవారం సందర్శించారు. జలవనరుల శాఖ అధికారులు మ్యాప్ ద్వారా బ్యారేజీ నిర్మాణ వివరాలను ఆయనకు తెలియజేశారు. సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ బ్యారేజీకి అనుబంధంగా 280 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బ్యారేజీ పనులు పిల్లర్ల వరకు పూర్తయినా జల విద్యుత్ కేంద్రం నిర్మాణంపై ఇంతవరకూ గ్రీన్ సిగ్నల్ రాలేదు. కాగా, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే జెన్కో సీఎండీ సీతమ్మ సాగర్ బ్యారేజీని సందర్శించారని సమాచారం. రాష్ట్రంలోనే కీలకం.. సీతమ్మ సాగర్ బ్యారేజీ వద్ద నిర్మించనున్న 280 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం రాష్ట్రంలోనే కీలకంగా మారనుంది. సీతమ్మ సాగర్ జల విద్యుత్ కేంద్రంలో ఏడు బల్బ్ టర్బైన్ల యూనిట్లు ఉంటాయి. ఒక్కో యూనిట్ ద్వారా 40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. ఈ కేంద్రం నుంచి ఏడాదికి సుమారు 1016.88 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. రాష్ట్రంలో ఇప్పటి వరకు జల విద్యుత్ కేంద్రాలన్నీ కృష్ణా నదిపైనే ఉన్నాయి. వీటి సామర్థ్యం 2,369 మెగావాట్లు. గోదావరిపై పోచంపాడు వద్ద 36 మెగావాట్లు, నిజాంసాగర్ వద్ద 10 మెగావాట్లు, సింగూరు వద్ద 15 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. సీతమ్మ సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి నదిపై 280 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ కేంద్రం నిర్మిస్తే ఇదే కీలకం కానుంది. బీటీపీఎస్‌ను సందర్శించిన సీఎండీ మణుగూరు రూరల్ : జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు సోమవారం మణుగూరులోని బీటీపీఎస్‌ను సందర్శించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా బీటీపీఎస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు, జీవకోటి మనుగడకు మొక్కలే ఆధారమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ చర్యలను చేపట్టాలన్నారు. అనంతరం బీటీపీఎస్ రైల్వేలైన్ నిర్మాణ పనులు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో జెన్కో డైరెక్టర్లు టీఆర్కే.రావు, ఎం.సచ్చిదానందం, వెంకటరాజం, అజయ్, లక్ష్మయ్య, విద్యుత్ సౌధ సీఈ రత్నాకర్, బీటీపీఎస్ సీఈ బిచ్చన్న, జలవనరులశాఖ ఎస్ఈ వెంకటేశ్వరరెడ్డి, ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈ రాంబాబు, ఏఈ నవీన్, విజిలెన్స్ అధికారులు వినోద్‌కుమార్, ముత్యంరెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు రాంప్రసాద్, పార్వతి, రమేష్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
24/7 కరెంట్ అందించే విశిష్ట టర్బైన్లు
-
24/7 కరెంట్ అందించే విశిష్ట టర్బైన్లు
మారమూల గ్రామాల్లో రోజంతా విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉండటం చాలా కష్టంగానే ఉంటుంది. ఎక్కడైనా 24 గంటల కరెంట్ అందుతుందంటే చాలా గ్రేట్. ప్రస్తుతం మారమూల ప్రాంతాల వారికి 24/7 విద్యుత్ అందించడానికి విశిష్టమైన టర్బైన్లు అందుబాటులోకి వచ్చాయి. బెల్జియన్ కంపెనీ టర్బ్యూలెంట్ వీటిని ప్రజల్లోకి తీసుకొచ్చింది. ఈ విశిష్ట టర్బైన్ల ద్వారా 60 గ్రామాల వరకు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మారుమూల గ్రామాలకు విద్యుత్ అందించడానికి వీటిని తీసుకొచ్చినట్టు కెంపెనీ చెప్పింది. వీటిని ఎక్కువగా నదులు, కాలువల వద్ద ఏర్పాటుచేసి, విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని కంపెనీ పేర్కొంటోంది. చిన్న తరహా విద్యుత్ ఉత్పాదకతకు భవిష్యత్తు ఇదే అంటున్నారు నిపుణులు. అసలెలా ఈ టర్బైన్లు పనిచేస్తున్నాయో ఈ వీడియో ఓ సారి చూడండి. -
మిత్రా ఎనర్జీకి సుజ్లాన్ టర్బైన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మిత్రా ఎనర్జీ ఏర్పాటు చేస్తున్న 98.7 మెగా వాట్ల పవన్ విద్యుత్ కేంద్రానికి అవసరమైన టర్బై న్లను సుజ్లాన్ గ్రూపు సరఫరా చేయనుంది. ఒకొక్కటి 2.1 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన మొత్తం 47 టర్బైన్లను సరఫరా చేయనున్నట్లు సుజ్లాన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 2010లో 1,000 మెగావాట్ల టర్బైన్లను సరఫరా చేసే విధంగా మిత్రా ఎనర్జీతో సుజ్లాన్ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా సుజ్లాన్ సహాయంతో ఇప్పటికే 310 మోగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా, మరో 205 మెగా వాట్ల యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం మిత్రా ఎనర్జీ తెలంగాణతో సహా మొత్తం ఆరు రాష్ట్రాల్లో 543 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.