షైన్‌ 2.0: మడతపెట్టే టర్బైన్‌ | Portable Wind Turbine Shine 2 0 | Sakshi
Sakshi News home page

షైన్‌ 2.0: మడతపెట్టే టర్బైన్‌

Published Sun, Oct 20 2024 1:10 PM | Last Updated on Sun, Oct 20 2024 1:15 PM

Portable Wind Turbine Shine 2 0

పవనశక్తిని వాడుకోవాలంటే, భారీ విండ్‌ టర్బైన్‌లు అవసరమవుతాయి. గాలి బాగా వీచే ప్రదేశాన్ని చూసుకుని, ఒకచోట పాతిపెట్టాక వాటిని తరలించడం అంత తేలిక కాదు. అయితే ఈ తేలికపాటి విండ్‌ టర్బైన్‌ను మాత్రం ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు. కోరుకున్న చోట ఆరుబయట ఫ్యాన్‌ మాదిరిగా నిలిపి, దీని నుంచి విద్యుత్తును పొందవచ్చు.

పిక్నిక్‌లలో టెంట్లు వేసుకున్నప్పుడు, టెంట్లకు కావలసిన విద్యుత్తును దీని ద్వారా పొందవచ్చు. కెనడియన్‌ కంపెనీ ‘ఆరియా టెక్నాలజీస్‌’ ఈ పోర్టబుల్‌ విండ్‌ టర్బైన్‌ను ‘షైన్‌-2.0’ పేరుతో రూపొందించింది. వాడకం పూర్తయ్యాక దీనిని చక్కగా మడిచి, సంచిలో వేసేసుకోవచ్చు.

ఇదీ చదవండి: నెట్టింట్లో చర్చకు దారితీసిన ట్వీట్

‘షైన్‌–2.0’ టర్బైన్‌ 50 వాట్ల విద్యుత్తును ఇంటర్నల్‌ బ్యాటరీకి నిరవధికంగా అందిస్తుంది. ఈ విద్యుత్తు ఒక ఇంట్లో వాడుకునే విద్యుత్తు పరికరాలన్నింటికీ పూర్తిగా సరిపోతుంది. దీని ధర 399.99 కెనడియన్‌ డాలర్లు (రూ. 24,626) మాత్రమే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement