మిత్రా ఎనర్జీకి సుజ్లాన్ టర్బైన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మిత్రా ఎనర్జీ ఏర్పాటు చేస్తున్న 98.7 మెగా వాట్ల పవన్ విద్యుత్ కేంద్రానికి అవసరమైన టర్బై న్లను సుజ్లాన్ గ్రూపు సరఫరా చేయనుంది. ఒకొక్కటి 2.1 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన మొత్తం 47 టర్బైన్లను సరఫరా చేయనున్నట్లు సుజ్లాన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 2010లో 1,000 మెగావాట్ల టర్బైన్లను సరఫరా చేసే విధంగా మిత్రా ఎనర్జీతో సుజ్లాన్ ఒప్పందం కుదుర్చుకుంది.
అందులో భాగంగా సుజ్లాన్ సహాయంతో ఇప్పటికే 310 మోగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా, మరో 205 మెగా వాట్ల యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం మిత్రా ఎనర్జీ తెలంగాణతో సహా మొత్తం ఆరు రాష్ట్రాల్లో 543 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.