విద్యుత్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన జెన్‌కో సీఎండీ
విద్యుత్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన జెన్‌కో సీఎండీ
Published Tue, Aug 9 2016 7:48 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
మేళ్లచెర్వు : మండలంలోని వజినేపల్లి సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేస్తున్న 120 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను జెన్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్‌రావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పులిచింతల వద్ద ఏర్పాటు చేస్తున్న విద్యుత్ ప్రాజెక్టులో మొత్తం నాలుగు యూనిట్లకు గాను మొదటి యూనిట్‌ను నెల రోజుల్లో ప్రారంభించి 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ చివరి నాటికి రెండవ యూనిట్, 2017 ఫిబ్రవరి చివరి నాటికి మూడు, నాలుగు యూనిట్లను ప్రారంభించి 120 యూనిట్ల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు భద్రాద్రి పవర్ ప్రాజెక్టు ద్వారా1080 మెగావాట్లు, యాదాద్రి ప్రాజెక్టు ద్వారా 400 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం 7600 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబరు నాటికి 9వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. అంతకుముందు అక్కడ జరుగుతున్న పనుల తీరుపై అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన వెంట హైడల్ డైరెక్టర్ వెంకటరాజన్, ఎస్‌ఈ లు శ్రీనివారెడ్డి, సద్గుణ కుమార్, ఈఈ ఆశోక్‌కుమార్, డీఈలు నాగిరెడ్డి రవి,టి.నర్సింహారావు తదితరులున్నారు.
Advertisement
Advertisement