సాక్షి, శ్రీశైలం: మరోసారి శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో మళ్లీ పేలుడు కలకలం రేపింది. బుధవారం సాయంత్రం భారీ శబ్ధాలతో మంటలు ఎగసిపడటంతో భయంతో పవర్ ప్లాంట్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. కరెంట్ కేబుల్ పైనుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు లో ఎటువంటి అగ్నిప్రమాదం జరగలేదని, ఎవ్వరూ ఆందోళన చెందొద్దని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు ప్రభాకరరావు స్పష్టం చేశారు.
గత నెల 20వ తేదీన శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో జెన్‌కో సివిల్ డైరెక్టర్ అజయ్ బృందంతో మాక్ డ్రిల్ నిర్వహించమని సీఎండీ ప్రభాకరరావు ఆదేశించారు. సిఎండి అదేశాలతోనే మాక్ డ్రిల్ నిర్వహించామని అధికారులు స్పష్టం చేశారు. కాగా గత నెల 20వ తేదీన శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం సంభవించి తొమ్మిది మంది సిబ్బంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అగ్ని ప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment