ఎన్‌సిసి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం | massive fire accident in NCC Power Plant | Sakshi
Sakshi News home page

ఎన్‌సిసి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

Published Wed, Apr 20 2016 9:22 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

massive fire accident in NCC Power Plant

-రూ.15 కోట్ల ఆస్థి నష్టం
టిపి గూడూరు(నెల్లూరు జిల్లా)

నెల్లూరు జిల్లా టిపి గూడూరు మండలం అనంతవరంలో ఉన్న నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీకి (ఎన్‌సిసి) చెందిన పవర్‌ప్లాంట్ కూలింగ్ టవర్‌లో బుధవారం వేకువజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల  రాత్రి ఒంటి గంట తర్వాత మంటలు చెలరేగి కూలింగ్ ప్లాంట్ మొత్తం విస్తరించాయి.

 

ఎన్‌సిసి పవర్‌ప్లాంట్‌ను సింగపూర్‌కు చెందిన సింటార్క్ కంపెనీ నిర్వహిస్తోంది. అగ్నిప్రమాదాన్ని గమనించిన సిబ్బంది అగ్నిమాపక దళానికి సమాచారం ఇచ్చారు. ఐదు ఫైరింజన్లు వచ్చి తెల్లవారేవరకూ ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో దాదాపు 15 కోట్ల రూపాయల మేర ఆస్తినష్టం జరిగి ఉంటుందని యాజమాన్యం చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement