అణు విద్యుత్ కేంద్రం పనులు వేగవంతం
Published Sun, Nov 10 2013 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM
రణస్థలం, న్యూస్‌లైన్: మండలంలోని మత్స్యకార గ్రామమైన కొవ్వాడలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అణువిద్యుత్ కేంద్రం పనులు వేగవంతమయ్యూయి. ఇందులో భాగంగా గతంలోని కోటపాలెం, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన రైతులకు సంబంధించిన భూము లను స్వాధీనం చేసుకోవడానికి మొదటి విడతగా 481 ఎకరాలకు సంబంధించి 4(1) నోటీసులను ప్రభుత్వం జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ భూము లపై ఎలాంటి అభ్యంతరాలున్నా తెలియజేయూలని రైతులను ప్రభుత్వం కోరింది.
ఇందులో భాగంగా ఈ నెల 27న రామచంద్రాపురం, 29న కోటపాలెం గ్రామాల్లో అభ్యంతరాలపై గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయూ గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రభుత్వ అధికారులు శనివారం నోటీసులను అతికించారు. దీంతో కొవ్వాడ పంచాయతీ పరిధిలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నా కనీసం పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. గ్రామసభలకు ముందు ప్రజాభిప్రాయ సేకరణ సభలు ఏర్పాటు చేయూలని కోరుతున్నారు. ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా నేరుగా అభ్యంతరాలపై గ్రామ సభలు పెట్టడం సరికాదని ఈ ప్రాంత మత్స్యకారులు, రైతులు, ప్రజలు, పలు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్షుణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోకపోతే ఆందోళనలు, పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Advertisement
Advertisement