Ranastalam
-
కలలే కల్లలై.. కళ్లేదుటే బూడిదై..
రణస్థలం (శ్రీకాకుళం): ఆ ఇల్లాలు ఎప్పటిలాగే మధ్యాహ్న భోజనం కోసం భర్తను పిలిచింది. అయితే, తన స్నేహితుడి పెళ్లికి బాణసంచా తయారు చేస్తున్నానని, కొద్ది సమయంలోనే వచ్చేస్తానని చెప్పి ఆమెను పంపించేశాడు. ఇది జరిగిన కాసేపటికే భారీ పేలుడు సంభవించడంతో భార్య నిర్ఘాంతపోయింది. వెంటనే బయటకు వచ్చి పూర్తిగా కాలిపోయిన తన భర్తను చూసి అక్కడే కూలిపోయింది. మృతుని కుమారులు సైతం స్కూల్‌కు వెళ్లి ఇంటికి వచ్చేసరికే మంటలు ఎగసిపడటంతో భయంతో వెనక్కు పారిపోయారు. ఈ విషాద ఘటన రణస్థలం మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పంచాయతీ పరిధిలో ఫ్రెండ్స్‌కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రెండ్స్ కాలనీలో నివాసముంటున్న కామరాజు(39) కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. స్వగ్రామం లావేరు మండలం వేణుగోపాలపురంలో తన స్నేహితుని పెళ్లి వేడుక నిమిత్తం బాణసంచా తయారుచేసేందుకు సామ్రగి తెచ్చుకున్నాడు. మధ్యా హ్నం 12.25 గంటల సమయంలో కామరాజు బాణసంచా తయారు చేస్తుండగా చేతిలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటలు చెలరేగి పక్కనే ఉన్న నిల్వ ఉంచిన బాణసంచా సామగ్రికి అంటుకోవడంతో భారీ శబ్దంతో రేకు షెడ్డు ఎగిరిపడింది. ఈ ఘటనలో కామరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. పేలుడు ధాటికి ఇంటి ప్రహరీ సైతం కూలిపోయింది. విద్యుత్ తీగకు సైతం మంటలు అంటుకోవడంతో దగ్గరకు వెళ్లేందుకు స్థానికులు సాహసం చేయలేకపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి పైల అశోక్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. చదవండి: (ఫస్ట్‌నైట్ అంటే భయపడ్డాడు.. అందుకే ఇలా చేశాడు: వరుడి తల్లి) ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ.. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని శ్రీకాకుళం డీఎస్పీ ఎం.మహేంద్ర పరిశీలించారు. జె.ఆర్.పురం సీఐ బీసీహెచ్ స్వామినాయుడుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించారు. కామరాజు భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జి.రాజేష్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం తరలించినట్లు చెప్పారు. కామరాజు 20 ఏళ్ల కిందటే స్వగ్రామం వేణుగోపాలపురం నుంచి జె.ఆర్.పురం వచ్చి అన్నయ్య కృష్ణతో కలిసి వడ్రంగి పనులు చేస్తున్నాడు. మందుగుండు తయారీ కేంద్రాలపై దాడులు అరసవల్లి/శ్రీకాకుళం/కాశీబుగ్గ:జె.ఆర్.పురంలో మందుగుండు పేలిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో సీఐ అంబేడ్కర్, ఎస్సైలు విజయ్‌కుమార్, రామకృష్ణలు మంగళవారం 19 చోట్ల సోదాలు నిర్వహించగా ఐదుచోట్ల మందుగుండు సామగ్రి గుర్తించారు. పది మందిని అదుపులోకి తీసుకున్నారు. అరసవల్లి రెల్లివీధి, ఆదిత్యనగర్ కాలనీ తదితర చోట్ల ఈ సోదాలు జరిగాయి. పలాస–కాశీబుగ్గలోనూ పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. -
మంటల్లో చిక్కుకున్న లారీ డ్రైవర్.. ఆర్తనాదాలు
సాక్షి, శ్రీకాకుళం: స్థానిక యునైటేడ్ బ్రేవరీస్ పరిశ్రమ సమీపంలో (జాతీయ రహదారిపై) సోమవారం ఉదయం 6 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. జే.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిశ్రమ సమీపంలో అగి ఉన్న లారీని విశాఖపట్నం వైపు నుంచి వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టింది. లారీ ముందు భాగం (ఎడమ వైపు) నుజ్జునుజు అయింది. లోపల నిద్రిస్తున్న లారీ ఓనర్ (డ్రైవర్) కురిమి స్వామి టైర్, డోర్‌కు మధ్య ఇరుక్కుపోయాడు. లారీలో ఉన్న చిన్న గ్యాస్ స్టావ్ పేలి మంటలు వ్యాపించాయి. కురిమి స్వామి బయటకు రాలేక అర్తనాదాలు పెట్టాడు. స్థానికులు వచ్చి మంటలు ఆర్పి బయటకు తీసే సరికి ఒళ్లంతా తీవ్రంగా కాలిపోయింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం స్వల్పంగా గాయపడ్డాడు. వీరిని 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రణస్థలం అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జే.ఆర్.పురం ఎస్ఐ జి.రాజేష్ తెలిపారు. -
కుటుంబ తగాదాలు.. అన్న, అక్క దారుణ హత్య
సాక్షి, ఎచ్చెర్ల: రణస్థలం మండలం రామచంద్రాపురం లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తి సొంతవాళ్లనే కిరాతకంగా హత్య చేశాడు. వివరాలు.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన గొర్లె రామకృష్ణ అనే వ్యక్తికి తన అక్క జయమ్మ, అన్న సన్యాసితో కొంతకాలంగా కుటుంబ తగాదాలు నడుస్తున్నాయి. దీంతో వారిపై కక్ష పెంచుకున్న రామకృష్ణ హతం చేయాలని భావించి ఆదివారం ఈ దురాఘతానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. (చదవండి: పశ్చిమ గోదావరిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి) -
టీడీపీ నేత.. జీడిపిక్కల దందా
రణస్థలం: విజిలెన్స్ అధికారులకు గతంలో ఒకమారు పట్టుబడినా ఓ టీడీపీ నాయకుడి వక్ర బుద్ధి మారలేదు. దర్జాగా తన అక్రమ వ్యాపార దందా సాగిస్తున్న అతడిపై గట్టిగా నిఘా పెట్టి మరోమారు దాడుల అస్త్రం ప్రయోగించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 1,876 జీడిపిక్కల బస్తాలు బయటపడ్డాయి. మొత్తం 93 టన్నులున్న వీటి విలువ మార్కెట్లో దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రణస్థలం మండలం కోష్ట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పిషిణి జగన్నాథం ఏడెనిమిది ఏళ్లుగా జీడిపిక్కల వ్యాపారం చేస్తున్నాడు. ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలిచ్చి అక్రమంగా జీడిపిక్కల గొడౌన్ ఏర్పాటు చేశాడు. ఇందుకు తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుంటూ దర్జాగా లాభాలు ఆర్జిస్తున్నాడు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లించలేదు. అప్పట్లో ఓ మంత్రి అండదండలు కూడా ఈయనకు పుష్కలంగా ఉండటంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో గత జూన్‌లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, అదే నెలలో విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. దాదాపు లక్ష రూపాయల వరకు జరిమానా విధించారు. అయినా పద్ధతి మారకపోవడంతో ఇతని బాగోతంపై విజలెన్స్ అధికారులు మరోమారు పక్కా నిఘా పెట్టి శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ సిబ్బంది, ఏఎంసీ సెక్రటరీ చిన్నికృష్ణ, గ్రామ రెవెన్యూ అధికారి ఎల్వీ అప్పలనాయుడు ఉన్నారు. ఏ ఒక్కటికీ అనుమతి లేదు.. దీనిపై జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ అప్పలనాయుడు మాట్లాడుతూ మొత్తం స్వాధీనం చేసుకున్న సరుకుకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని పేర్కొన్నారు. కనీసం వ్యవసాయ మార్కెట్ కమిటీకి పన్నులు కూడా చెల్లించలేదన్నారు. జీడి పిక్కల నిల్వ ఉంచేందుకు గొడౌన్‌కు సంబంధించి ఎటువంటి అనుమతి పత్రాలు కూడా ప్రభుత్వం నుంచి పొందలేదని తెలిపారు. స్వాధీనం చేసుకున్న సరుకును శనివారం లావేరు మండలం బెజ్జిపురం వ్యవసాయ మార్కెట్‌కు తరలించామన్నారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, రణస్థలం (శ్రీకాకుళం): ఆదర్శ పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయిని తీరుతో మానసిక వేదనకు గురై ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని గిన్నె భార్గవి ఆత్మహత్యకు యత్నించింది. గత కొద్ది కాలంగా ఉపాధ్యాయిని కక్ష కట్టి ఎన్నో విధాలుగా వేధిస్తునట్లు తమ కుమార్తె అనేకసార్లు వాపోయినట్లు మండలంలోని గోసాం గ్రామానికి చెందిన గిన్నె అసిరినాయుడు (పాలు రెడ్డి) తెలిపారు. శనివారం ఆదర్శ పాఠశాల వసతి గృహంలో ప్రవేశం లేదని ఉపాధ్యాయిని కరాఖండిగా చెప్పడంతో భార్గవి మానసిక ఆందోళనకు గురైనట్లు తండ్రి తెలిపారు. శనివారం సాయంత్రం పురుగు మందు తాగి ఆసుపత్రి పాలైనట్టు పేర్కొన్నారు. హుటాహుటిన శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. శనివారం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తండ్రి చెప్పారు. అయితే తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని జె.ఆర్.పురం ఎస్సై వి.బాలకృష్ణ తెలిపారు. ప్రిన్సిపాల్ వివరణ ఈ దుర్ఘటనపై ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కె.మహేశ్వరరావును వివరణ కోరగా.. ఆదర్శపాఠశాల వసతి గృహం గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైందని, ఆమె ప్రథమ సంవత్సరం చివరిలో ఒక నెలరోజులపాటు అనారోగ్యం, వ్యక్తిగత సమస్యల వల్ల హాస్టల్‌కు రాలేదని, హాస్టల్లో ఉన్నప్పుడే ఒకసారి కడుపులో నొప్పి అని చెబితే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ప్రస్తుత ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నుంచి వసతి గృహంలో ప్రవేశాలకు శనివారం దరఖాస్తులు కోరామన్నారు. గతంలో అనారోగ్యం, వ్యక్తిగత సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవద్దని హాస్టల్ మెయింటినెన్స్ చూస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయిని లక్ష్మికి చెప్పామని ప్రిన్సిపాల్ మహేశ్వరరావు తెలిపారు. -
అణు విద్యుత్ పార్క్ సర్వేలపై సమావేశం
రణస్థలం: స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో కొవ్వాడ అణువిద్యుత్ పార్క్ భూసేకరణ సర్వేలకు సంబంధించి సంబంధిత ప్రాంతాల ప్రజా ప్రతినిధులతో అణుపార్క్ భూసేకరణాధికారి జె.సీతారామారాజు, ఆర్డీవో ధయానిధిల ఆధ్వర్యంలో బుధవారం చర్చావేదిక నిర్వహించారు. కార్యక్రమంలో కొవ్వాడ, కోటపాలేం, పాతర్లపల్లి, అల్లివలస, టెక్కలి, మరువాడ తదితర గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూసేకరణాధికారి సీ తారామరాజు మాట్లాడుతూ అణువిద్యుత్ పా ర్క్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణకు సర్వేలు నిలిచిపోయాయని, వాటిని మళ్లీ ప్రా రంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీని కోసం మొదటి విడతగా రూ.389 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. పరిశ్రమ ఏర్పాటుకు, ప్రభుత్వ, ప్రైవేటు భూములు కలిపి 2074 ఎకరాలు అవసరమని అన్నారు. భూములు కోల్పోయిన రైతులకు మూడేళ్లుగా ఇక్కడ అమ్మకాలు, కొనుగోలు ఆధారంగా మార్కెటింగ్ రేటుకు నూతన చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. అమ్మకాలు, కోనుగోలు జరగని చోట బేసిక్ ఆధారంగా నష్టపరిహారం అందిస్తామని అన్నా రు. ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్లు స్థలంలో 6 లక్షల రూపాయలతో ఇళ్ల నిర్మాణాలను చేపట్టి ఇస్తామని చెప్పారు. ఈ డబ్బులు ఖర్చు చేసి నిర్మించుకున్నవారికి డబ్బులు మిగిలితే వారికి ఇస్తామని, ఒక వేళ తగిలితే వారి నుంచి సేకరించవలసి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు ఎంపీపీ గొర్లె విజయకుమా ర్, న్యాయవాది లక్ష్మణరావు, కోటపాలేం సర్పంచ్ ధనుంజయరావు, వైసీపీ నాయుకులు పిన్నింటి సాయికుమార్, అల్లివలస ఎంపీటీసీ మైలపల్లి వెంకటేష్, కొవ్వాడ నాయకులు స త్యం, తదితరులు మాట్లాడుతూ ఇక్కడ కాకుం డా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజల కు అన్నీ చెప్పాలన్నారు. అత్యంత ప్రమాదకరమైన పరిశ్రమలు ఏర్పాటుచేసినప్పుడు 9 నుం చి 10 రెట్లు శాతం పెంచి నష్టపరిహారం అందించాలన్నారు. వీటిపై ప్రజావేదిక పెట్టి ప్రజల అభిప్రాయంతో సర్వేలను చేపట్టాలని తెలిపా రు. అనంతరం సీతారామరాజు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు తెలిపిన అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. -
పేలిన గ్యాస్ సిలిండర్, 10 మందికి గాయాలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం కోస్తాలో ఆదివారం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ఘటనలో 10 మందికి గాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రెవెన్యూ వెబ్సైట్ హ్యాకింగ్
సైబర్ నేరం కింద పోలీసుల కేసు నమోదు ఎచ్చెర్ల: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల రెవెన్యూ వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురైంది. హుద్‌హుద్ తుపాను సమయంలో మండలంలో ఒక్కరు కూడా మృతి చెందలేదు. అయితే వెబ్సైట్ హ్యాక్ చేసిన ఆకతాయిలు రణస్థలం మండల వాసులు 69 మంది తుపానుకు చనిపోయినట్టు వెబ్సైట్లో ఉంచారు. ఈ మేరకు తహశీల్దార్ ఎం.సురేష్‌కుమార్ వెబ్సైట్ హ్యాకింగ్ అయినట్లు బుధవారం రణస్థలం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై వినోద్‌బాబు సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అణు విద్యుత్ కేంద్రం పనులు వేగవంతం
రణస్థలం, న్యూస్‌లైన్: మండలంలోని మత్స్యకార గ్రామమైన కొవ్వాడలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అణువిద్యుత్ కేంద్రం పనులు వేగవంతమయ్యూయి. ఇందులో భాగంగా గతంలోని కోటపాలెం, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన రైతులకు సంబంధించిన భూము లను స్వాధీనం చేసుకోవడానికి మొదటి విడతగా 481 ఎకరాలకు సంబంధించి 4(1) నోటీసులను ప్రభుత్వం జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ భూము లపై ఎలాంటి అభ్యంతరాలున్నా తెలియజేయూలని రైతులను ప్రభుత్వం కోరింది. ఇందులో భాగంగా ఈ నెల 27న రామచంద్రాపురం, 29న కోటపాలెం గ్రామాల్లో అభ్యంతరాలపై గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయూ గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రభుత్వ అధికారులు శనివారం నోటీసులను అతికించారు. దీంతో కొవ్వాడ పంచాయతీ పరిధిలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నా కనీసం పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. గ్రామసభలకు ముందు ప్రజాభిప్రాయ సేకరణ సభలు ఏర్పాటు చేయూలని కోరుతున్నారు. ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా నేరుగా అభ్యంతరాలపై గ్రామ సభలు పెట్టడం సరికాదని ఈ ప్రాంత మత్స్యకారులు, రైతులు, ప్రజలు, పలు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్షుణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోకపోతే ఆందోళనలు, పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.