మంటల్లో చిక్కుకున్న లారీ డ్రైవర్‌.. ఆర్తనాదాలు | Fire truck accident at NH 16 Road Srikakulam In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మంటల్లో చిక్కుకున్న లారీ డ్రైవర్‌.. ఆర్తనాదాలు

Published Tue, Jul 6 2021 7:56 AM | Last Updated on Tue, Jul 6 2021 9:12 AM

Fire truck accident at NH 16 Road Srikakulam In Andhra Pradesh - Sakshi

మంటల్లో కాలుతున్న లారీ క్యాబిన్‌

సాక్షి, శ్రీకాకుళం: స్థానిక యునైటేడ్‌ బ్రేవరీస్‌ పరిశ్రమ సమీపంలో (జాతీయ రహదారిపై) సోమవారం ఉదయం 6 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. జే.ఆర్‌.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిశ్రమ సమీపంలో అగి ఉన్న లారీని విశాఖపట్నం వైపు నుంచి వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టింది. లారీ ముందు భాగం (ఎడమ వైపు) నుజ్జునుజు అయింది. లోపల నిద్రిస్తున్న లారీ ఓనర్‌ (డ్రైవర్‌) కురిమి స్వామి టైర్, డోర్‌కు మధ్య ఇరుక్కుపోయాడు.

లారీలో ఉన్న చిన్న గ్యాస్‌ స్టావ్‌ పేలి మంటలు వ్యాపించాయి. కురిమి స్వామి బయటకు రాలేక అర్తనాదాలు పెట్టాడు. స్థానికులు వచ్చి మంటలు ఆర్పి బయటకు తీసే సరికి ఒళ్లంతా తీవ్రంగా కాలిపోయింది. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం స్వల్పంగా గాయపడ్డాడు. వీరిని 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రణస్థలం అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జే.ఆర్‌.పురం ఎస్‌ఐ జి.రాజేష్‌ తెలిపారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement