
సాక్షి, ఎచ్చెర్ల: రణస్థలం మండలం రామచంద్రాపురం లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తి సొంతవాళ్లనే కిరాతకంగా హత్య చేశాడు. వివరాలు.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన గొర్లె రామకృష్ణ అనే వ్యక్తికి తన అక్క జయమ్మ, అన్న సన్యాసితో కొంతకాలంగా కుటుంబ తగాదాలు నడుస్తున్నాయి. దీంతో వారిపై కక్ష పెంచుకున్న రామకృష్ణ హతం చేయాలని భావించి ఆదివారం ఈ దురాఘతానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
(చదవండి: పశ్చిమ గోదావరిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి)
Comments
Please login to add a commentAdd a comment