రణస్థలం: స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో కొవ్వాడ అణువిద్యుత్ పార్క్ భూసేకరణ సర్వేలకు సంబంధించి సంబంధిత ప్రాంతాల ప్రజా ప్రతినిధులతో అణుపార్క్ భూసేకరణాధికారి జె.సీతారామారాజు, ఆర్డీవో ధయానిధిల ఆధ్వర్యంలో బుధవారం చర్చావేదిక నిర్వహించారు. కార్యక్రమంలో కొవ్వాడ, కోటపాలేం, పాతర్లపల్లి, అల్లివలస, టెక్కలి, మరువాడ తదితర గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూసేకరణాధికారి సీ తారామరాజు మాట్లాడుతూ అణువిద్యుత్ పా ర్క్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణకు సర్వేలు నిలిచిపోయాయని, వాటిని మళ్లీ ప్రా రంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీని కోసం మొదటి విడతగా రూ.389 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. పరిశ్రమ ఏర్పాటుకు, ప్రభుత్వ, ప్రైవేటు భూములు కలిపి 2074 ఎకరాలు అవసరమని అన్నారు. భూములు కోల్పోయిన రైతులకు మూడేళ్లుగా ఇక్కడ అమ్మకాలు, కొనుగోలు ఆధారంగా మార్కెటింగ్ రేటుకు నూతన చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. అమ్మకాలు, కోనుగోలు జరగని చోట బేసిక్ ఆధారంగా నష్టపరిహారం అందిస్తామని అన్నా రు.
ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్లు స్థలంలో 6 లక్షల రూపాయలతో ఇళ్ల నిర్మాణాలను చేపట్టి ఇస్తామని చెప్పారు. ఈ డబ్బులు ఖర్చు చేసి నిర్మించుకున్నవారికి డబ్బులు మిగిలితే వారికి ఇస్తామని, ఒక వేళ తగిలితే వారి నుంచి సేకరించవలసి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు ఎంపీపీ గొర్లె విజయకుమా ర్, న్యాయవాది లక్ష్మణరావు, కోటపాలేం సర్పంచ్ ధనుంజయరావు, వైసీపీ నాయుకులు పిన్నింటి సాయికుమార్, అల్లివలస ఎంపీటీసీ మైలపల్లి వెంకటేష్, కొవ్వాడ నాయకులు స త్యం, తదితరులు మాట్లాడుతూ ఇక్కడ కాకుం డా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజల కు అన్నీ చెప్పాలన్నారు.
అత్యంత ప్రమాదకరమైన పరిశ్రమలు ఏర్పాటుచేసినప్పుడు 9 నుం చి 10 రెట్లు శాతం పెంచి నష్టపరిహారం అందించాలన్నారు. వీటిపై ప్రజావేదిక పెట్టి ప్రజల అభిప్రాయంతో సర్వేలను చేపట్టాలని తెలిపా రు. అనంతరం సీతారామరాజు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు తెలిపిన అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.
అణు విద్యుత్ పార్క్ సర్వేలపై సమావేశం
Published Thu, May 12 2016 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM
Advertisement