Nuclear Power Park
-
అణు విద్యుత్ పార్క్ సర్వేలపై సమావేశం
రణస్థలం: స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో కొవ్వాడ అణువిద్యుత్ పార్క్ భూసేకరణ సర్వేలకు సంబంధించి సంబంధిత ప్రాంతాల ప్రజా ప్రతినిధులతో అణుపార్క్ భూసేకరణాధికారి జె.సీతారామారాజు, ఆర్డీవో ధయానిధిల ఆధ్వర్యంలో బుధవారం చర్చావేదిక నిర్వహించారు. కార్యక్రమంలో కొవ్వాడ, కోటపాలేం, పాతర్లపల్లి, అల్లివలస, టెక్కలి, మరువాడ తదితర గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూసేకరణాధికారి సీ తారామరాజు మాట్లాడుతూ అణువిద్యుత్ పా ర్క్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణకు సర్వేలు నిలిచిపోయాయని, వాటిని మళ్లీ ప్రా రంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీని కోసం మొదటి విడతగా రూ.389 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. పరిశ్రమ ఏర్పాటుకు, ప్రభుత్వ, ప్రైవేటు భూములు కలిపి 2074 ఎకరాలు అవసరమని అన్నారు. భూములు కోల్పోయిన రైతులకు మూడేళ్లుగా ఇక్కడ అమ్మకాలు, కొనుగోలు ఆధారంగా మార్కెటింగ్ రేటుకు నూతన చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. అమ్మకాలు, కోనుగోలు జరగని చోట బేసిక్ ఆధారంగా నష్టపరిహారం అందిస్తామని అన్నా రు. ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్లు స్థలంలో 6 లక్షల రూపాయలతో ఇళ్ల నిర్మాణాలను చేపట్టి ఇస్తామని చెప్పారు. ఈ డబ్బులు ఖర్చు చేసి నిర్మించుకున్నవారికి డబ్బులు మిగిలితే వారికి ఇస్తామని, ఒక వేళ తగిలితే వారి నుంచి సేకరించవలసి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు ఎంపీపీ గొర్లె విజయకుమా ర్, న్యాయవాది లక్ష్మణరావు, కోటపాలేం సర్పంచ్ ధనుంజయరావు, వైసీపీ నాయుకులు పిన్నింటి సాయికుమార్, అల్లివలస ఎంపీటీసీ మైలపల్లి వెంకటేష్, కొవ్వాడ నాయకులు స త్యం, తదితరులు మాట్లాడుతూ ఇక్కడ కాకుం డా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజల కు అన్నీ చెప్పాలన్నారు. అత్యంత ప్రమాదకరమైన పరిశ్రమలు ఏర్పాటుచేసినప్పుడు 9 నుం చి 10 రెట్లు శాతం పెంచి నష్టపరిహారం అందించాలన్నారు. వీటిపై ప్రజావేదిక పెట్టి ప్రజల అభిప్రాయంతో సర్వేలను చేపట్టాలని తెలిపా రు. అనంతరం సీతారామరాజు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు తెలిపిన అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. -
భూకంప జోన్లో ‘అణు’ పార్కా?
ఎచ్చెర్ల: శ్రీకాకుళం జిల్లా తీరప్రాంత మండలాల్లో తరచూ వస్తున్న భూప్రకంపనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన నాలుగైదు రోజుల్లో రణస్థలం, ఎచ్చెర్ల, పొందూరు మండలాల్లో మూడుసార్లు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం నాటి ప్రకంపనలు రెక్టారు స్కేలుపై 3.5గా నమోదుకాగా ఆదివారం కూడా ఉనికిని ప్రదర్శిం చాయి. భూకంప జోన్‌గా దీనిని పరిగణనలోకి తీసుకోవాలని ఇప్పటికే నిపుణులు అంటున్నారు. ఈనేపథ్యంలో కొవ్వాడవద్ద అణువిద్యుత్ పార్కు ఏర్పాటు విషయమై ప్రభుత్వాలు పునరాలోచించకపోవడం చర్చనీయాంశమవుతోంది. రణస్థలం మండలం కొవ్వాడలో అణుపార్కు ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 2016 మార్చినాటికి భూ సేకరణ పూర్తి చేసి పార్కు పనులకు శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముడు నెలల్లో ఈ పార్కు పనులు ప్రారంభం కానుండటం, ప్రస్తుతం వరుస భూప్రకంపనలు చోటుచేసుకోవడం ఇక్కడి ప్రజానీకాన్ని కలవరపరుస్తున్నాయి. కొవ్వాడలో అణుపార్కు నిర్మాణం పూర్తయ్యాక భూప్రక ంపనలు చోటుచేసుకుంటే ఆ ముప్పు ఊహించడానికే ఇబ్బందికరమనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. దీని ప్రభావం 300 కిలో మీటర్లు వరకు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాకినాడ నుంచి ఒరిస్సా వరకు ఈ ప్రభావం కొన్ని తరాలు రేడియేషన్ప్రభావం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. 2011లో యూపీఏ హయాంలో అణుపార్కుకు జీవోలు విడుదలయ్యాయి. అప్పట్లో బీజేపీ,టీడీపీ దీనిని వ్యతిరేకించాయి. ప్రస్తుతం రెండు ప్రభుత్వాలు నిర్మాణానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుస భూప్రకంపనలను దృష్టిలో పెట్టుకుని పార్కు రద్దు చేయాలంటూ స్థానిక ఉద్యమ నాయకులు ప్రధానికి లేఖలు రాస్తున్నారు. జియోలాజికల్ ఆఫ్ ఇండియా కూడా గతంలో భూకంపజోన్లో అణుపార్కులు ప్రమాదానికి దారితీస్తాయని తేల్చిచెప్పింది. కొవ్వాడ సమీపంలో భూపొరల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. భూమి లోపల పలకలు సర్దుకునే సమయాన ప్రకంపనలు తప్పవని, తీవ్రత రెక్టార్ స్కేల్‌పై ఆరు దాటితే పెనుముప్పు తప్పదని శాస్త్రవేత్తలంటున్నారు. మరోసారి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పక్కాగా సర్వేచేసి ఈ ప్రాంతం అణుపార్కుకు అనుకూలమో కాదో తెలియ జేయాలని పలువురు సూచిస్తున్నారు. అణు పార్కుల్లో పనిచేసే వారికి ప్రైవేట్ సంస్థలు బీమా చేయడానికి ముందుకు రావ డం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపం చ బ్యాంకు సైతం రుణం మంజూరు చేయక పోవటం,ప్రమాదకర రియాక్టర్లు వినియోగించటం వంటివి కూడా ఆందోళనకర అంశాలు. నిర్మాణంపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని పోరాట కమిటీ సభ్యులు కోరుతున్నారు. భవిష్యత్తు తరాలకు తీరని నష్టం భూకంప జోన్లో అణుపార్కు ఏర్పాటు వల్ల భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపుతుంది. ప్రమాదం సంభవిస్తే 300 కిలో మీటర్లు పరిధిలో ఈ రేడియేషన్ ఉంటుంది. హిరోషిమా, నాగసాకి వంటి పరిస్థితి స్థానిక ప్రజలకు ఉంటుంది.అప్పట్లో ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశా. ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీకి కూడా లేఖ రాశాను. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. భూకంపజోన్లో అణుపార్కు అంటూ ఏర్పాటు చేస్తే అది ప్రభుత్వానికి ప్రజా శ్రేయస్సుపై చిత్తశుద్ధి లేకపోవటమే. - ఈఏఎస్ శర్మ, విశ్రాంత ఐఎఎస్ అధికారి -
కొవ్వాడ వైపు రెవెన్యూ అడుగులు!
రణస్థలం:అణువిద్యుత్ పార్క్ నిర్మించతలపెట్టిన కొవ్వాడ ప్రాంతంలో పర్యటించేందుకు రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వారం రోజుల్లో కొవ్వాడ బాట పట్టేలా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు రెవెన్యూసిబ్బంది అణువిద్యుత్పార్క్ ప్రాంతాలను పరిశీలించనున్నారని విశ్వసనీయ సమాచారం. వాస్తవంగా ఈ ప్రాంతంలో ఇంతవరకూ ‘అణు’ సిబ్బంది తప్పా రెవెన్యూ అధికారులు పర్యటించలేదు. అప్పట్లో ఆర్డీవో పరిశీలనకు వస్తే స్థానికులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. అప్పటినుంచి ఇప్పటి వరకూ రెవెన్యూ సిబ్బంది వెళ్లలేదు. ఇదే విషయమై వారం రోజుల క్రితం న్యూక్లియర్ పార్క్ పీడీ వి.వెంకటరమేష్ కలెక్టర్‌ను కలిసి కొవ్వాడలో భూసేకరణ, బాధితులకు ఫ్యాకేజీలపై చర్చించినట్టు సమాచారం. అ సందర్భంగానే కొవ్వాడ ప్రాంతాన్ని రెవెన్యూ యంత్రాంగం పరిశీలించాలని నిర్ణయించింది. కలెక్టర్ నేరుగా ఈ ప్రాంతాల్లో పర్యటించి భూసేకరణ వివరాలు, ఈ ప్రాంత వాసుల నివాసాలు, వారికి ఆవాసం కల్పించడానికి చేపట్టాల్సిన చర్యలు, ప్రజలను మానసికంగా ప్లాంట్ ఏర్పాటుకు సహకరించేలా సిద్ధం చేయడం వంటి విషయాలపై చర్చించనున్నారు. ఇదివరకే జిల్లా కలెక్టర్ ఈ ప్రాంతవాసులకు కల్పించాల్సిన సౌకర్యాలకు సంబంధించి న్యూక్లియర్ అధికారులకు వివరించి ఉన్నారు. అయితే వాటిని ఏ మేరకు చేపట్టాలో తెలుసుకోవడానికి ఈ ప్రాంతంలో రెవెన్యూ సిబ్బంది పర్యటించాలని నిర్ణయించారు. పరిస్థితి ఇది.. కొవ్వాడ ప్రాంతంలో 9,564 మెగావాట్లు సామర్ధ్యంతో నిర్మించ తలపెట్టిన అణువిద్యుత్ పార్క్‌తో దేశంలో అత్యధిక కరెంటును ఉత్పత్తి చేయనున్నారు. అణుపార్క్ ఏర్పాటుకు 2,074 ఎకరాల భూసేకరణకు ప్రతిపాదించారు. ఇందులో 791 ఎకరాలు ప్రభుత్వ భూమి, 683 ఎకరాలు పేదలకు ప్రభుత్వం ఇచ్చిన డి పట్టాభూమి ఉండగా.. 600 ఎకరాలు జిరాయితీ భూమిని సేకరించాల్సి ఉంది. రామచంద్రాపురం, టెక్కలి, కోటపాలెం, జీరుకొవ్వాడ, గూడెం ప్రాంతాల్లో ఈ భూములు ఉన్నాయి. ఇక్కడ నివసిస్తున్న జనాభా తక్కువగా ఉండటం, ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని అణుపార్క్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. శరవేగంగా పనులను చేపట్టేందుకు అన్నివిధాలా రంగం సిద్ధం చేస్తుంది.ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తో అన్ని చర్చలు జరిపిన న్యూక్లియర్ అధికారులు త్వరలోనే ప్రజలకు అందాల్సిన ప్యాకేజీలను ప్రకటించి పనులను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రభావిత గ్రామాలు ఇవే... కొవ్వాడ పరిసరాల్లో న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా సమీప గ్రామాలైన రామచంద్రపురం, టెక్కలి, కోటపాలెం, జీరుకొవ్వాడ, గూడాం గ్రామాలకు ప్రభావం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రామచంద్రాపురంలో 3,926 మంది జనాభా ఉండగా 949 ఇళ్లు ఉన్నాయి. వ్యవసాయంతో పాటు చేపలవేట ఇక్కడ వారి వృత్తి. టెక్కలి గ్రామంలో 39 ఇళ్లలో 105 మంది జీవిస్తున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నారు. కోటపాలెంలో 920 గృహాలుండగా 3,569 జనాభా ఉంది. మత్స్యకార, వ్యవసాయ వృత్తులతో జీవిస్తున్నారు. జీరు కొవ్వాడలో 75 ఇళ్లల్లో 362 మంది జీవిస్తున్నారు. వీరికి వ్యవసాయమే జీవనాధారం. అణుపార్క్ ఏర్పాటు చేస్తే వీరంతా జీవనాధారం కోల్పోవడంతో పాటు నివాసాలు కూడా కోల్పోవాల్సి ఉంటుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితిలో రెవెన్యూ అధికారుల పర్యటన ఎలా సాగుతోందో వేచిచూడాలి.