
రోడ్డెక్కిన ‘పవర్’ నిర్వాసితులు
- ప్లాంటు ఎదుట రాస్తారోకో
- ‘సాక్షి’ కథనంతో కదలిక
- స్తంభించిన ట్రాఫిక్.. తహశీల్దార్ హామీతో విరమణ
పినపాక : భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు గురువారం రోడ్డెక్కారు. భూనిర్వాసితులకు ప్రభుత్వం చెప్పి న విధంగా సౌకర్యాలు, అవకాశాలు కల్పించడం లేదని గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీం తో భూనిర్వాసితుల్లో కదలిక వచ్చి పవర్ ప్లాంట్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం పినపాక, మణుగూరు మండలాల రైతులు సుమారు 1,030 ఎకరాలు భూమిని ఇచ్చి జీవనాధారం పూర్తిగా కోల్పోయారు. ప్రభుత్వం భూమి తీసుకునే సమయం లో ఉపాధి కల్పన, విద్య, ఉద్యోగ అవకాశాలు ముందుగా భూ నిర్వాసితులకు అందజేస్తామని తెలిపారు. కానీ పవర్ ప్లాంట్ పనులు ప్రారంభమైన నాటి నుంచి నిర్వాసితులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
అయితే రెవెన్యూ, జెన్ కో అధికారుల తీరు పై ఆగ్రహిస్తూ.. ‘సాక్షి’ కథనంతో చైతన్యవంతులైన భూ నిర్వాసితులు రాస్తారోకో నిర్వహిం చారు. మణుగూరు-వరంగల్ ప్రధాన రహదారిపై సీతారాంపురం వద్ద సుమారు వంద మంది భద్రాద్రి పవర్ ప్లాంట్ ఎదుట సుమారు గంటపాటు రాస్తారోకో చేపట్టారు. అలాగే ప్రభుత్వం ఐటీఐలో ప్రవేశాలు, జాబ్ కార్డులు కావాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతోపాటు ప్రస్తుతం జరుగుతున్న పవర్ ప్లాంట్ పనుల్లో భూ నిర్వాసితుల తోపాటు స్థాని కులకు అవకాశం కల్పించాలని నినదించారు. గిరిజన సొసైటీలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి తమ సమస్యకు పరి ష్కారం చూపాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ ఘన్యానాయక్, కరకగూడెం ఎస్సై ముత్యం రమేష్, ఏఎస్సై పాయం కన్నయ్యదొర అక్కడికి చేరుకుని తగిన న్యాయం చేస్తామని నిర్వాసితులకు హామీ ఇస్తారు. దీంతో ఆందోళనకారులు రాస్తారోకో విరమించారు. రాస్తారోకో వల్ల మణుగూరు-వరంగల్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలి చిపోయింది. కార్యక్రమంలో ఏడూళ్లబయ్యా రం సర్పంచ్ వాగుబోయిన చందర్‌రావు, ఉప్పాక సర్పంచ్ కుంజా వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధు లు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.