
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం విద్యుత్ కేంద్రo ప్రమాద ఘటనలో మృతి చెందిన ఏఈ ఉజ్మా ఫాతిమా కుటుంబాన్ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పరామర్శించారు. అజాంపురా హరిలాల్ బాగ్‌లోని ఫాతిమా కుటుంబాన్ని శనివారం ఆయన కలిశారు. ఫాతిమా ధైర్యం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆమె చిన్నప్పటి నుంచి ధైర్యశాలియని, చదువులో ముందుడేదని ఎంపీ గుర్తు చేసుకున్నారు.
ప్రమాదం నుంచి బయటపడేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఇతరులను కాపాడే క్రమంలో ఫాతిమా అసువులు బాశారని అన్నారు. ఆమె కుటుంబానికి త్వరగా సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ అసదుద్దీన్ కోరారు. కాగా, శ్రీశైలం ఎడమ గుట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో ప్లాంట్‌లో 17 మంది విధుల్లో ఉండగా.. 8 మంది గాయాలతో బయటపడ్డారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
(చదవండి: మృత్యుసొరంగం)
Comments
Please login to add a commentAdd a comment