మండలంలోని చెల్పూరు శివారు కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్‌లో శనివారం ఉద యం విద్యుదుత్పత్తి ప్రారంభమైంది.
కేటీపీపీ విద్యుదుత్పత్తి పునఃప్రారంభం
Aug 20 2016 11:54 PM | Updated on Sep 4 2017 10:06 AM
600 మెగావాట్ల ప్లాంట్‌లో కొనసాగుతున్న మరమ్మతులు
గణపురం : మండలంలోని చెల్పూరు శివారు కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్‌లో శనివారం ఉద యం విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. బాయిలర్ ట్యూబ్‌ల లీకేజీలతో రెండు రోజుల క్రితం మొదటి దశ విద్యుత్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి నిలిచిన విషయం తెలిసిందే. పగిలిన బాయిలర్ ట్యూబ్‌లకు రెండు రోజుల పాటు మరమ్మతులు చేసిన అధికారులు సింక్రనైజేషన్ ప్రారంభించారు. కాగా మూడు రోజుల క్రితం రెండో దశ 600 మెగావాట్ల ప్లాంట్‌లోనూ విద్యుదుత్పత్తి నిలిచింది. జనరేటర్‌లో సాంకేతిక సమస్య తలెత్తగా ప్లాంట్ ఇంకా ప్రారం భం కాలేదు. మరో మూడు రోజుల్లో మరమ్మతులు పూర్తిచేసి విద్యుదుత్పత్తి ప్రారంభించేం దుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Advertisement
Advertisement