ఉద్యోగులను ఖాళీ చేయించిన అధికారులు
మోస్ ల్యాండింగ్: అమెరికాలోని కాలిఫోర్నియాలో దావానలం తీ వ్రత తగ్గుముఖం పట్టే లా కనిపించడం లేదు. గురు వారం ప్రపంచంలోనే పెద్దదైన మోస్ ల్యాం డింగ్‌లోని బ్యాట రీ స్టోరేజీ ప్లాంట్‌ను మంటలు చుట్టుముట్టాయి. దీంతో, అధికారులు కాలిఫోర్నియాకు 77 మైళ్ల దూరంలోని ఈ ప్లాంట్‌ను మూసివేశారు. ఆ చుట్టుపక్కల మోస్ ల్యాండింగ్, ఎల్క్ హార్న్ స్లో ఏరియాల్లోని సుమారు 1,500 మందిని ఖాళీ చేయించారు.
సమీపంలోని ఒకటో నంబర్ హైవేలో కొంత భాగాన్ని మూసివేశారు. టెక్సాస్‌కు చెందిన కంపెనీ విస్ట్రా ఎనర్జీకి చెందిన మోస్ ల్యాండింగ్ పవర్ ప్లాంట్‌లో వేలాదిగా లిథియం బ్యాటరీలను నిల్వ ఉంచుతారు. సోలార్ ఎనర్జీని స్టోర్ చేయడానికి ఇవి చాలా అవసరం. ఈ బ్యాటరీలకు మంటలు అంటుకుంటే అదుపు చేయడం ఎంతో కష్టమని అంటున్నారు. అయితే, కాంక్రీట్ భవనంలోని బ్యాటరీలకు మంటలు వ్యాపించడం అంత సులువు కాదని చెబుతున్నారు. ప్లాంట్‌లోని సిబ్బందిని ముందుగానే ఖాళీ చేయించామని విస్ట్రా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment