ఎచ్చెర్ల: జాతీయ రహదారికి ఆనుకొని రెండు మండలాల సరిహద్దుల్లో ఉన్న ప్రశాంత వాతావరణంలో ఉన్న పల్లెలు కొద్దిరోజులుగా ఆ ప్రశాంతతకు దూరమయ్యాయి. ఏదో తెలియని ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. తమ గుండెలపై థర్మల్ కుంపటి పెడతారేమోనన్న ఆలోచనే వారిని కలవరపాటుకు గురి చేస్తోంది. ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురం, పొందూరు మండలం ధర్మపురం గ్రామాల మధ్య ఉన్న కొండపై ఇటీవల స్థలపరిశీలన జరిపిన ఉన్నతాధికార బృందం ఈ ప్రాంతం ప్లాంట్ ఏర్పాటుకు అనువుగా ఉందని ప్రకటించినప్పటి నుంచి స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఇక్కడి ప్రకృతి వనరులు దెబ్బతింటాయంటూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.సంస్థలు, రైతుల ఆధీనంలో.. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, ఎచ్చెర్ల మండల కాంప్లెక్స్ నుంచి పెద్ద చెరువు వరకు అధికారులు పరిశీలించిన కొండ విస్తరించి ఉంది. అక్కడి నుంచి పొందూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన కొండ ఆవరించి ఉంది. ఎస్.ఎం.పురం పరిధిలో 112 సర్వే నెంబర్, ధర్మపురం పరిధిలో 05 సర్వే నెంబర్‌లో సుమారు 1500 ఎకరాల భూములు ఉన్నాయి.
ఇప్పటికే ఎస్‌ఎం పురం పరిధిలోని కొండ ప్రాంత భూముల్లో అంబేద్కర్ వర్సిటీ, శ్రీ వెంకటేశ్వరా గ్రూప్ కళాశాలలు, ఎచ్చెర్ల ఐటీఐ, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, 21వ శతాబ్ది గురుకులం, రాజీవ్ స్వగృహ, ఎస్‌ఎంపురం ఏపీ గురుకుల పాఠశాల.. ఇలా పలు ప్రభుత్వ, ప్రైవే టు సంస్థలకు ప్రభుత్వం సుమారు 300 ఏకరా లు కేటాయించింది. గతంలో సామాజిక అటవీశాఖ పరిధిలో ఉన్న ఈ భూముల్లో పలువురు రైతులకు పట్టాలు ఇచ్చారు.
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు స్థలాలు కేటాయించటంతో ఇక్కడ భూములు కోల్పోయిన రైతులకు ఆ ప్రాంతంలోనే వేరే చోట పట్టాలు ఇచ్చారు. అలా గే ఇందిరప్రభ లబ్ధిదారులకు స్థలాలు కేటాయించారు. ఇంకోపక్క వాటర్‌షెడ్‌లో భాగంగా ఇక్కడి కొండలను ఆర్‌ఐడీఎఫ్ సంస్థ అభివృద్ధి చేసి మొక్కలు నాటింది. ఇక్కడి జీడి, మామిడి తోటలు సైతం రైతుల ఆధీనంలో ఉన్నాయి. మొత్తం మీద ఎస్‌ఎం.పురం, దర్మవరం ప్రాంతాల పరిధిలో సుమారు 400 మంది రైతులకు గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చాయి. వారందరికీ సాగుహక్కు ఉంది.
పెద్ద చెరువు కింద 500 ఎకరాలు
కాగా ఇదే ప్రాంతంలో ఉన్న ఎస్.ఎం.పురం పెద్ద చెరువు కింద 500 ఎకరాల సాగు భూమి ఉంది. ఈ చెరువుకు మడ్డువలస ప్రాజక్టు నీరు తరలిస్తామని ఎప్పటి నుంచో ప్రభుత్వాలళు హామీ ఇస్తు న్నా కార్యరూపం దాల్చలేదు. ఫరీదుపేట, ఎస్.ఎం.పురం. కనిమెట్ట తదితర గ్రామాల సాగుభూములు ఈ చెరువు ఆయకట్టు పరిధిలో ఉన్నాయి. పక్కా జిరాయితీ భూములైన వీటిలో ప్రతి ఏటా వరితోపాటు ఆరుతడి పంటలు, కూరగాయలు విస్తారంగా సాగు చేస్తున్నారు.
మడ్డువలస నీరు తరలిస్తే ఇంకా మంచి పంటలు పండే అవకాశం ఉంది. ఈ పరిస్థితులో థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రతిపాదనతో రెండు మండలాల్లోని సుమారు పది గ్రామాల రైతులు ఉలిక్కిపడ్డారు. విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ఏస్తే కాలుష్యంతో వ్యవసాయం కనుమరుగవుతుందని ఆందోళన చెందుతున్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజా, దళిత సం ఘాలు పోరాటానికి సైతం సిద్ధమవుతున్నాయి.
అమ్మో.. థర్మల్!
Published Sat, Dec 13 2014 1:53 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement