Thermal power plant
-
ఆముదాలవలసలో థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి
-
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ చోరీ
-
అసలే వేసవికాలం.. కరెంట్ సరఫరా ప్రశ్నార్థకం!
వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. దాంతో ఏసీ, కూలర్, ఫ్రిజ్ వంటి గృహోపకరణాల వాడకం పెరుగుతోంది. రానున్న రోజుల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తే వాటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ పీక్ అవర్స్‌లో సరఫరా చేసేందుకు సరిపడా విద్యుత్ మాత్రం తయారుకావడం లేదని నిపుణులు చెబుతున్నారు. దానికితోడు థర్మల్ విద్యుత్తయారీ కేంద్రాలకు బొగ్గుకొరత ఉందని కేంద్రం ఇటీవల సూచించడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 22 థర్మల్ విద్యుత్కేంద్రాల్లో తీవ్ర బొగ్గు కొరత నెలకొంది. ఫలితంగా పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి కావడం లేదు. రోజువారీ విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుండటంతో థర్మల్ విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం తాజాగా సూచించింది. దేశవ్యాప్తంగా 2.09 లక్షల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ విద్యుత్కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరగాలంటే.. వాటిలో ఎప్పుడూ 6.86 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలుండాలి. కానీ, ఈ నెల 8 నాటికి అందులో 68 శాతమే అంటే 4.65 కోట్ల టన్నులే ఉన్నట్లు కేంద్ర విద్యుత్ మండలి(సీఈఏ) తెలిపింది. ముందస్తు నిల్వల్లో తగ్గుదల తెలంగాణలోని థర్మల్ విద్యుత్కేంద్రాల్లో ముందస్తు నిల్వల కోటా 16.34 లక్షల టన్నులు ఉండాల్సి ఉండగా.. 8.61 లక్షల టన్నులే (53 శాతం) ఉన్నట్లు వెల్లడించింది. అన్ని చోట్ల కనీస ఉత్పత్తి జరిగేందుకు వీలుగా ప్రతి విద్యుత్కేంద్రంలో వినియోగించే బొగ్గులో 6 శాతం వచ్చే జూన్ వరకూ విదేశాల నుంచి తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలంటూ కేంద్ర విద్యుత్‌శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణలో సింగరేణి గనులుండటంతో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్కేంద్రాలకు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోబోమని రాష్ట్ర జెన్కో చెబుతోంది. ఇదీ చదవండి: ‘విజయం తనకే దక్కాలనే ఉద్దేశంతో కట్టుకథలు’ సింగరేణిలో అంతంతమాత్రంగానే.. సింగరేణి సంస్థ నుంచి తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాలకు అవసరమైనంత బొగ్గు సరఫరా చేయలేకపోతున్నారు. రోజుకు 2.40 లక్షల టన్నులు పంపాలని పలు రాష్ట్రాల నుంచి డిమాండ్ ఉంది. అంతకన్నా పాతిక వేల టన్నుల దాకా ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ఆమేరకు సంస్థ సరఫరా చేయలేకపోతోంది. తెలంగాణ కోసం ప్రత్యేకంగా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన 1,600 మెగావాట్ల విద్యుత్కేంద్రానికి సంస్థ రోజుకు 21,900 టన్నుల బొగ్గు ఇవ్వాలి. ఈ కేంద్రంలో కనీసం 26 రోజులకు అవసరమైనంత ముందస్తు నిల్వ కోటా కింద 5,68,500 టన్నులు ఉండాలి. ప్రస్తుతం 2,24,800 టన్నులే ఉన్నాయి. -
ఎస్టీపీపీ విస్తరణతో నిరుద్యోగులకు ఉపాధి
జైపూర్(చెన్నూర్): సింగరేణి థర్మల్ పవర్‌ప్లాంటు విస్తరణలో భాగంగా మరో 800 మెగావాట్ల థర్మల్ పపర్ ప్లాంటు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, ఎస్టీపీపీ ప్రభావిత 9 గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. జైపూర్ మండలం ఎల్కంటి, వేలాల, పౌనూర్ గ్రామాల్లో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్ ప్లాంటు విస్తర్ణతో సుమారు 400 నుంచి 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభి స్తాయన్నారు. అనంతరం కుందారంలో రూ.1.56 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. జెడ్పీటీసీ మేడి సునీత, పంచాయతీరాజ్ డీఈ స్వామిరెడ్డి, తహశీల్దార్ మోహ న్‌రెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, ఐసీడీఎస్ సీడీపీవో మనోరమ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్మూ రి అరవిందర్రావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బేతు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. -
ఉవ్వెత్తున వెలుగులు
సాక్షి ప్రతినిధి, కడప: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) వెలుగులు నింపుతోంది. ప్రధానంగా రాయలసీమ ప్రాంత ప్రజలకు లోఓల్డేజీ సమస్యలను కట్టడి చేస్తోంది. విద్యుత్ కోతలకు ఆస్కారం లేకుండా ఆరు యూనిట్లు ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. 1650 మెగావాట్లు సామర్థ్యానికి గాను 1450 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నారు. ఏడాదికి పైగా ఇంతటి సామర్థ్యంలో విద్యుత్ ఉత్పత్తి తీయలేదని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్లుగా ఉత్పత్తి లభిస్తోంది. ఒక్కో యూనిట్ 210 మెగావాట్లు సామర్థ్యంతో 5 యూనిట్లు ఆర్టీపీపీలో నెలకొల్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒకటి, రెండవ యూనిట్లు నోచుకోగా, 3, 4, 5, 6 యూనిట్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూపుదిద్దుకున్నాయి. 6వ యూనిట్ 600 మెగావాట్లు సామర్థ్యంతో నెలకొల్పడంతో మొత్తంగా 1650 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తికి ఆస్కారం ఏర్పడింది. కాగా 2014–19 టీడీపీ సర్కార్ హయాంలో తీవ్రమైన బొగ్గు కొరత ఏర్పడింది. ఆశించిన మేరకు విద్యుత్ ఉత్పాదన నోచుకోలేదు. ముందుచూపు లేకపోవడంతో టీడీపీ హయాంలో తరచూ బొగ్గు కొరత ఉత్పన్నమైందని కార్మికులు వివరిస్తున్నారు. కాగా ఏడాదిగా ఈ స్థాయి సామర్థ్యంతో ఉత్పత్తి చేయడం ప్రస్తుత ఉత్పత్తే అరుదు అని యంత్రాంగం వివరిస్తోంది. దినదినాభివృద్ధి.... రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు దినదినాభివృద్ధి వేగంగా చోటుచేసుకుంది. ఎన్టీ రామారావు హయాంలో అంకురార్పణ చేసి, తొలి యూనిట్‌ను ప్రారంభించి, రెండవ యూనిట్ పనులు కొనసాగించారు. ఆ పనులను చంద్రబాబు సర్కార్ పూర్తి చేయించింది. దివంగత సీఎం వైఎస్ హయాంలో అత్యంత వేగంగా ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లుగా 3, 4, 5, 6 యూనిట్లు వేగంగా నిర్మించారు. వెరశి ఆర్టీపీపీకి 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని తీసుకవచ్చారు. తద్వారా లో ఓల్టేజీ సమస్యకు చెక్ పడింది. 42 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు.. ఆర్టీపీపీలో అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలంటే సుమారు రోజుకు 21 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కానున్నట్లు యంత్రాంగం వివరిస్తోంది. టీడీపీ సర్కార్‌లో ఐదేళ్ల కాలంలో తరచూ బొగ్గు కొరత ఉత్పన్నం కావడంతో ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ ముందు చూపుతో వ్యవహరించింది. ఒకేసారి 6లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఆర్టీపీపీకి చేరాయి. దాంతో బొగ్గు కొరత అనే సమస్యే లేకుండా పోయిందని కార్మికవర్గాలు చెబుతున్నారు. ప్రస్తుతం 42వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఆర్టీపీపీలో సిద్ధంగా ఉన్నాయి. డిమాండ్ ప్రకారమే విద్యుత్ ఉత్పత్తి ఏపీ జెన్కో యాజమాన్యం సూచన మేరకు డిమాండ్‌ను బట్టి ఆర్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నాం. ప్రస్తుతం 6 యూనిట్లు ద్వారా ఉత్పత్తి కొనసాగుతోంది. బొగ్గు కొరత అనే సమస్యే తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఒకేసారి 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు చేరింది. ప్రస్తుతం ప్రతిరోజు 6నుంచి 7వ్యాగన్లు బొగు సరఫరా అవుతోంది. జెన్కో ఆదేశాల మేరకు 1650 మెగావాట్లుకు గాను 1450 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. అన్ని యూనిట్ల ద్వారా ఏకధాటిగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నాం. – మురళీకృష్ణా, సీఈ, ఆర్టీపీపీ -
యాదాద్రి విద్యుత్ కేంద్రానికి సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్/దామరచర్ల: ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 4వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి ఐదు యూనిట్లలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. సుమారు 6 వేల ఎకరాల్లో రూ.29,965 కోట్ల అంచనాతో దీని పనులు చేపట్టగా, రూ.18,443 కోట్ల వ్యయంతో 65శాతం పనులు పూర్తయ్యాయి. 50శాతం విదేశీ బొగ్గు, 50శాతం స్వదేశీ బొగ్గు మిశ్రమంతో విద్యుదుత్పత్తి చేస్తామన్న ప్రతిపాదనలతో జెన్కో ఈ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతులు పొందింది. దీనికి భిన్నంగా 100శాతం స్వదేశీ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నందున ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులను చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దేశీయ బొగ్గుతో కలిగే పర్యావరణ ప్రభావంపై కొత్తగా అధ్యయనం జరిపి మళ్లీ పర్యావరణ అనుమతులను పొందాలని ఆదేశించింది. మళ్లీ అధ్యయనం జరిపేందుకు అనుసరించాల్సిన నిబంధనలను ఇటీవల కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం పర్యటన ఇలా... సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ప్రయాణించి మధ్యాహ్నం 12 గంటల కల్లా దామరచర్ల మండంలోని వీర్లపాలెం చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న థర్మల్ పవర్ ప్లాంట్ పనులను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి పరిశీలిస్తారు. పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం హైదరాబాద్‌కు కేసీఆర్ తిరుగు పయనమవుతారు. -
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఆపేందుకు కుట్ర
సూర్యాపేట: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మితమవుతున్న యాదాద్రి పవర్‌ప్లాంట్‌ను ఆపేందుకు కుట్ర జరుగుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. పవర్‌ప్లాంట్ నిర్మాణం ఆపాలంటూ ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) ఇచ్చిన తీర్పుపై మంత్రి గురువారం విలేకరులతో మాట్లాడుతూ అన్ని పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే నిర్మాణం మొదలుపెట్టామని స్పష్టం చేశారు. ఎన్జీటీ తీర్పు ఏకపక్షంగా ఉందని విమర్శించారు. ఈ తీర్పు యావత్ దేశానికి నష్టం కలిగించేలా ఉందన్నారు. వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టాక వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం సరైంది కాదని పేర్కొన్నారు. నిర్మాణం ఆపాలంటూ లేవనెత్తిన అంశాలు పూర్తి అసంబద్ధంగా ఉన్నాయన్నారు. ఎక్కడో ఉన్న ముంబై సంస్థకు.. యాదాద్రి పవర్‌ప్లాంట్‌కి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీని వెనకాల కచ్చితంగా కుట్ర దాగి ఉందన్నారు. గతంలో ఇదే సంస్థ కేసు వేసినప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొట్టివేసిందని గుర్తు చేశారు. కేసు వేసిన ముంబై సంస్థ వెనకాల అదృశ్య శక్తులు ఉన్నాయని ఆరోపించారు. ఎన్జీటీ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని, న్యాయపోరాటం కూడా చేస్తామని తెలిపారు. అనుకున్న సమయానికల్లా యాదాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణం పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. -
యాదాద్రి ప్లాంట్‌కు ‘పర్యావరణ’ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి (వైటీపీఎస్)కి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ(ఎంవోఈఎఫ్) జారీ చేసిన పర్యావరణ అనుమతులను చెన్నైలోని దక్షిణాది జోన్ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సస్పెండ్ చేసింది. తొలుత విదేశీ బొగ్గు ఆధారిత ప్రాజెక్టుగా ప్రతిపాదించి, తర్వాత దేశీయ బొగ్గుకు మారడంతో.. ఇందుకు అనుగుణంగా కొత్తగా పర్యావరణ అనుమతులు పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ ముంబైకి చెందిన ‘ది కన్జర్వేషన్ యాక్షన్ ట్రస్ట్’ అనే సంస్థ వేసిన కేసులో ఎన్జీటీ సెప్టెంబర్ 30న ఈ తీర్పు ఇచ్చింది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణ జెన్కో ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. దాదాపు 60శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఇలాంటి సమయంలో అనుమతులను నిలిపేయడంతో జెన్కోకు ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది. యంత్రాలు బిగించరాదు యాదాద్రి ప్లాంట్ విషయంగా మళ్లీ కొత్తగా పర్యావరణ ప్రభావంపై మదింపు (ఈఐఏ) చేయించాలని తెలంగాణ జెన్కోను ఎన్జీటీ ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ)తో మళ్లీ పరిశీలన జరిపించి కొత్తగా పర్యావరణ అనుమతులు పొందాలని స్పష్టం చేసింది. అప్పటివరకు ప్రాజెక్టును పూర్తి (కమిషనింగ్) చేయరాదని, యంత్రాలను బిగించకూడదని ఆంక్షలు విధించింది. మౌలిక సదుపాయాల నిర్మాణ పనులను మాత్రం కొనసాగించుకోవచ్చని తెలిపింది. ఈఐఏ నివేదికల ఆధారంగా కేంద్ర పర్యావరణ శాఖ తీసుకోనున్న తదుపరి నిర్ణయానికి లోబడి ఈ నిర్మాణ పనులు ఉండాలని స్పష్టం చేసింది. ఆ అధ్యయనం ఆధారంగానే ఎలాంటి యంత్రాలు వాడాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. ఎన్జీటీ తీర్పులో పేర్కొన్న అంశాలు, సూచనలు దిగుమతి చేసుకున్న బొగ్గు లింకేజీ కోసం ఎలాంటి ఒప్పందం లేదు. బొగ్గు దిగుమతులపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో 100శాతం దేశీయ బొగ్గును వినియోగించనున్నట్టు తెలంగాణ జెన్కో వాదించింది. ఈ పరిస్థితిలో గాలి నాణ్యతపై ఈఐఏ కన్సల్టెంట్‌తో మళ్లీ అధ్యయనం జరిపించాలి. ఎఫ్‌జీడీ, ఇతర కాలుష్య నియంత్రణ చర్యలను అధ్యయన నివేదికకు అనుగుణంగా పునః సమీక్షించాల్సి ఉండనుంది. కింద పేర్కొన్న అంశాల్లో తదుపరి అధ్యయనాల కోసం జెన్కోకు అదనపు టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్ (నిబంధనలు/టీఓఆర్)ను కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేయాలి. ►రేడియోధార్మికతపై అధ్యయనం కోసం బొగ్గు లింకేజీ వివరాలను జెన్కో తెలియజేయాలి. ఆ మేరకు బొగ్గుతో ఉండే ప్రభావంపై అధ్యయనం జరిపించాలి. 100శాతం దేశీయ బొగ్గుకు మారాలనుకుంటే.. దీనితో పర్యావరణంపై ఉండే ప్రభావంపై తదుపరి అధ్యయనం జరిపించాలి. దీని కోసం కేంద్ర పర్యావరణ శాఖకు జెన్కో దరఖాస్తు చేసుకోవాలి. బొగ్గు లింకేజీ విషయంలో అదనపు టీఓఆర్ అవసరమైతే పర్యావరణ శాఖ జారీ చేయాలి. పర్యావరణ ప్రభావంపై మళ్లీ బహిరంగ విచారణ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. ►బూడిద కొలను (యాష్ పాండ్) సామర్థ్యం, డిజైన్, నిర్వహణపై అవసరమైతే అధ్యయనం కోసం పర్యావరణ శాఖ ఆదేశించాలి. ►పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యతపై పడే ప్రభావంపై సమగ్ర అధ్యయనం జరిపించి, నివారణ చర్యలు తీసుకోవాలి. ►అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ 10 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉందని సైట్ పరిశీలన నివేదికలో పేర్కొన్నారు. పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌తో పాటు ఈఐఏ నివేదిక సైతం కచ్చితమైన దూరాన్ని చెప్పలేకపోయింది. పరిధిలో లోపల ఉంటే నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ (ఎన్బీడబ్ల్యూఎల్) నుంచి క్లియరెన్స్ అవసరం. ఈ నేపథ్యంలో పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌తో సమన్వయంతో జెన్కో.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఎంత దూరంలో ఉందో కచ్చితంగా నిర్థారణ జరపాలి. జోన్ పరిధిలో ఉంటే ఎన్బీడబ్ల్యూఎల్ నుంచి క్లియరెన్స్ పొందాలి. ►వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ వచ్చాక.. ప్రాజెక్టుపై మళ్లీ మదింపు జరిపి అనుమతులకు సిఫార్సులపై నిపుణుల కమిటీ స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలి. లేనిపక్షంలో పర్యావరణ శాఖకు నిర్ణయాన్ని వదిలేయాలి. మొత్తం ప్రక్రియను 9 నెలల్లో పూర్తి చేయాలి. ►గతంలో పర్యావరణంపై మెర్క్యురీ స్థాయి ప్రభావమేమీ ఉండదని విమ్టా ల్యాబ్ ఇచ్చిన నివేదికను నిపుణుల కమిటీ తోసిపుచ్చి ఐఐసీటీ హైదరాబాద్‌తో మళ్లీ అధ్యయనం జరిపించింది. ఐఐసీటీ నివేదికను కమిటీకి సమర్పించలేదు. నివేదికను కమిటీ పరిశీలిస్తేనే తదుపరిగా అధ్యయనాలు అవసరమా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోవచ్చు. ►యాదాద్రి కేంద్రం కోసం 2,090 ఎకరాల అటవీ భూమిని కేటాయించారు. ఇకపై థర్మల్ విద్యుత్ కేంద్రాల వంటి కాలుష్య కారక (రెడ్ కేటగిరీ) పరిశ్రమల కోసం అటవీ భూములను కేటాయించవద్దు. -
అదానీ పవర్ చేతికి డీబీ పవర్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ పవర్ ఛత్తీస్‌గఢ్‌లో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటు కలిగిన డీబీ పవర్‌ను కొనుగోలు చేయనుంది. రూ. 7,017 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ కుదిరినట్లు అదానీ పవర్ వెల్లడించింది. డీబీ పవర్ జాంజ్‌గిర్ చంపా జిల్లాలోగల 600 మెగావాట్ల సామర్థ్యంగల రెండు యూనిట్లను నిర్వహిస్తోంది. 923.5 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకి మధ్య, దీర్ఘకాలిక ఒప్పందాలను కలిగి ఉంది. పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియాతో ఇంధన సరఫరా ఒప్పందాలను సైతం కలిగి ఉంది. నగదు చెల్లించేవిధంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అదానీ పవర్ పేర్కొంది. దీనిలో భాగంగా డీబీ పవర్ మాతృ సంస్థ డిలిజెంట్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను చేజిక్కించుకోనున్నట్లు తెలియజేసింది. డీబీ పవర్లో డిలిజెంట్ పవర్ మొత్తం ఈక్విటీ మూలధనాన్ని కలిగి ఉన్నట్లు వివరించింది. 2022 అక్టోబర్ 31లోగా వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. అవసరమైతే పరస్పర అంగీకారంతో గడువును పెంచుకోనున్నట్లు వెల్లడించింది. ఈ కొనుగోలుతో ఛత్తీస్‌గఢ్‌లో థర్మల్ పవర్ సామర్థ్యాన్ని విస్తరించుకోనున్నట్లు పేర్కొంది. 2006లో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో రిజిస్టరైన డీబీ పవర్ గతేడాది(2021–22)లో రూ. 3,448 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. అంతక్రితం ఏడాది(2020–21)లో రూ. 2,930 కోట్ల్ల, 2019–20లో రూ. 3,126 కోట్లు చొప్పున ఆదాయం లభించింది. -
విదేశీ బొగ్గుతో.. ‘విద్యుత్’ మోత!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు తప్పనిసరిగా బొగ్గు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో.. విద్యుత్ ధరల మోత మోగనుంది. ప్రధానంగా కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాల (సీజీఎస్)తోపాటు ప్రైవేటు విద్యుత్ కేంద్రాల నుంచి నుంచి రాష్ట్రానికి సరఫరా అవుతున్న విద్యుత్ ధరలు పెరగనున్నాయి. దీనితో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లతోపాటు సామాన్య వినియోగదారులపైనా ప్రభావం పడనుంది. పదింతల ధరతో.. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 10శాతం బొగ్గును 90శాతం దేశీయ బొగ్గుతో కలిపి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నాణ్యత ఆధారంగా సింగరేణి బొగ్గు ధరలు టన్నుకు రూ.3,000–5,000 వరకు ఉండగా.. దిగుమతి చేసుకునే బొగ్గు ధరలు టన్నుకు రూ.20వేల నుంచి రూ.40 వేల వరకు ఉంటున్నాయి. విదేశీ బొగ్గు కారణంగా ఒక్కో యూనిట్ విద్యుత్ ధర అదనంగా 9–10 పైసలు పెరుగుతుందని రాష్ట్ర విద్యుత్ సంస్థలు అంచనా వేశాయి. మొత్తంగా ఏడాదికి రూ.630 కోట్లు భారం పడుతుందని పేర్కొన్నాయి. మొత్తం రూ. 7,173 కోట్లు రాష్ట్రానికి దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా.. ఎన్టీపీసీ సహా ఇతర కేంద్ర విద్యుత్ కేంద్రాల నుంచి 2,650 మెగావాట్లు, సెమ్బ్‌కార్ప్ అనే ప్రైవేటు సంస్థ నుంచి 840 మెగావాట్లు థర్మల్ విద్యుత్ రాష్ట్రానికి సరఫరా అవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022–23లో కేంద్ర విద్యుత్ కేంద్రాల నుంచి 17,116.91 మిలియన్ యూనిట్లు విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి రాష్ట్ర డిస్కంలకు ఈఆర్సీ అనుమతిచ్చింది. ఈ విద్యుత్‌కు స్థిర ధర వ్యయం రూ.2,112.01 కోట్లు, చర వ్యయం రూ.4,601.41 కోట్లు కలిపి.. మొత్తం రూ.6,713.42 కోట్లు వ్యయం అవుతుందని ఈఆర్సీ అంచనా వేసింది. 10శాతం దిగుమతైన బొగ్గును వాడితే చర వ్యయం అదనంగా రూ.460.14 కోట్లు పెరిగి.. మొత్తం వ్యయం రూ.7,173.56 కోట్లకు చేరుతుంది. ఇక సెమ్బ్‌కార్ప్ ఎనర్జీ నుంచి 7,353.58 ఎంయూ విద్యుత్ కొనుగోళ్లకు ఈఆర్సీ అనుమతిచ్చింది. ఇందుకు రూ.1,471.29 కోట్ల స్థిర వ్యయం, రూ.1,697.44 కోట్ల చర వ్యయం కలిపి మొత్తం రూ.3,168.7 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. దిగుమతి చేసుకున్న బొగ్గు వాడితే చర వ్యయం అదనంగా రూ.169.74 కోట్లు పెరిగి.. మొత్తం వ్యయం రూ.3,338.44 కోట్లు అవుతుంది. రేపటితో ముగియనున్న డెడ్‌లైన్! దేశంలోని అన్ని థర్మల్ ప్లాంట్లు మే 31లోగా బొగ్గు దిగుమతుల కోసం ఆర్డర్ చేయాలని, జూన్ 15 నాటికి ఆ బొగ్గు విద్యుత్ కేంద్రాలకు వచ్చి చేరాలని కేంద్రం గడువు విధించింది. రాష్ట్రంలో 4,042.5 మెగావాట్ల తెలంగాణ జెన్కో, 1,200 మెగావాట్ల సింగరేణి, 2,600 మెగవాట్ల ఎన్టీపీసీ–రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. సింగరేణి బొగ్గు లభ్యత పుష్కలంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ జెన్కో, సింగరేణి సంస్థ బొగ్గు దిగుమతులు చేసుకోబోమని ఇప్పటికే కేంద్రానికి తేల్చి చెప్పాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో ఎన్టీపీసీ బొగ్గు దిగుమతులు చేసుకోనుంది. విద్యుత్ స్థిర, చర వ్యయాలేంటి ? థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి అయ్యే స్థిర, చర వ్యయాలను కలిపి యూనిట్ విద్యుత్ ధరను ఖరారు చేస్తారు. విద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం పెట్టిన పెట్టుబడులను/పెట్టుబడి రుణాలను వడ్డీతో సహా కలిపి స్థిర వ్యయం పేరుతో రాబట్టుకుంటారు. విద్యుదుత్పత్తికి వాడే బొగ్గు, ఇతర ఖర్చులు, నిర్వహణ వ్యయాలను చర వ్యయం కింద లెక్కించి వసూలు చేస్తారు. -
మార్చి 2024లోగా యాదాద్రి ప్లాంట్ పూర్తి చేయాలి
సాక్షి,హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని 2024 మార్చినాటికి పూర్తి చేయాలని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్ ఉన్నతాధికారులను కోరారు. బీహెచ్ఈఎల్ ఉన్నతాధికారులతో శనివారం ఆయన ఇక్క డ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర అవసరాలను తీర్చడానికి పెద్ద మొత్తంలో విద్యుత్‌ను కొనాల్సి వస్తోందన్నారు. కాబట్టి యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలన్నారు. -
జనహితం కోరుతూ జెన్కో అడుగులు
సాక్షి, అమరావతి: వెలుగులు పంచే థర్మల్ విద్యుత్ కేంద్రాలు మరోపక్క విషవాయువులను వెదజల్లుతున్నాయి. దీన్ని తక్షణమే అదుపు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ముఖ్యంగా ఆమ్ల వాయువుల (సల్ఫ్యూరిక్ యాసిడ్) నియంత్రణ తప్పనిసరి చేసింది. వాస్తవానికి 2015లో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికే అమలు కావాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వం థర్మల్ ప్లాంట్లలో ప్లూగ్యాస్ డీ సల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ) ప్రక్రియపై దృష్టి పెట్టలేదు. పర్యావరణానికి చేటు తెస్తున్న ఆమ్ల వాయువుల నియంత్రణపై ప్రస్తుత సర్కారు వేగంగా అడుగులేస్తోంది. రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాల్లో ఎఫ్‌జీడీ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమైంది. సల్ఫర్‌తో చిక్కే..! రాష్ట్రంలో ఏపీ జెన్కో పరిధిలో 5 వేల మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. పూర్తి స్థాయిలో ఇవి విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే రోజుకు 70 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. బొగ్గును మండించినప్పుడు అందులోని నైట్రోజన్, సల్ఫర్ వంటి వాయువులు వెలువడతాయి. థర్మల్ కేంద్రాల నుంచి గాలిలోకి వెళ్లే వాయువుల్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ బొగ్గు వినియోగంలో పాయింట్ ఒక్క శాతం మాత్రమే ఉండాలి. పాత విద్యుత్ కేంద్రాల వల్ల ఇది ఆరు రెట్లు ఎక్కువ ఉంటోందని పర్యావరణ శాఖ చెబుతోంది. విదేశీ బొగ్గు వాడే కేంద్రాల్లో ఇది పది శాతం వరకూ ఎక్కువగా ఉంటోంది. ఆమ్ల వర్షాలకు సల్ఫ్యూరిక్ యాసిడే కారణం. దాదాపు 50 కి.మీ. పరిధిలో దీని ప్రభావం ఉంటుంది. పంటలకు హాని చేస్తుంది. ప్రాణాలను హరించే జబ్బులకూ కారణమవుతుంది. (చదవండి: ‘థర్మల్’కు డిమాండ్) ఎలా నియంత్రిస్తారు..? బొగ్గును బాయిలర్‌లో మండించటం వల్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ బయటకొస్తుంది. దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిమ్నీ ద్వారా భూమికి 100 అడుగులపైకి పంపి గాలిలో కలుపుతారు. అది భూమిని చేరేలోపు తీవ్రత తగ్గుతుంది. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రాలు అనుసరిస్తున్న విధానమిది. ఎఫ్‌జీడీ ప్రక్రియలో సున్నపురాయిని పొడిచేసి, నీళ్లతో కలిపి చిమ్నీపైకి పంపుతారు. రసాయన చర్య వల్ల సల్ఫర్ జిప్సమ్‌గా మారుతుంది. ఈ జిప్సమ్‌ను ఇళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తారు. భారీ ఖర్చే..! ఎఫ్‌జీడీ ప్లాంట్ నిర్మించాలంటే ప్రతీ మెగావాట్‌కు రూ.50 లక్షలు ఖర్చు చేయాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ జెన్కో దశల వారీగా ఈ ప్రక్రియను చేపడుతోంది. ముందుగా నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం, కృష్ణపట్నం కేంద్రాల్లో ఎఫ్‌జీడీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. (చదవండి: ‘పవర్’ఫుల్ సెక్టార్) టెండర్లు పిలుస్తున్నాం: శ్రీధర్, ఎండీ, జెన్కో ‘ఎఫ్‌జీడీ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలుస్తున్నాం. ఇప్పటికే డాక్యుమెంట్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాం. పర్యావరణానికి ఏమాత్రం హాని లేకుండా అత్యాధునిక టెక్నాలజీతో ఈ ప్లాంట్లను నిర్మించాలని చూస్తున్నాం’ అని జెన్కో ఎండీ శ్రీధర్ తెలిపారు. -
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
చెన్నై : తమిళనాడు థర్మల్ ప్లాంట్‌లో బుధవారం సంభవించిన పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి పళనిస్వామి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలలో ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, స్వల్పగాయాలైన వారికి 50 వేల రూపాయల నష్టపరిహారాన్ని అందిస్తామని తెలిపారు. ఇది వరకే సీఎం పళనిస్వామితో ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తప్పకుండా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. (ఈ సారి లాల్బగ్చా గణేశుడి ఉత్సవాలు లేవు ) Anguished to learn about the loss of lives due to a blast at Neyveli power plant boiler in Tamil Nadu. Have spoken to @CMOTamilNadu and assured all possible help.@CISFHQrs is already on the spot to assist the relief work. Praying for the earliest recovery of those injured. — Amit Shah (@AmitShah) July 1, 2020 భారీ పేలుడు ఘటనలో ఆరుగురు చనిపోగా, 17 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. కడలూరులోని నేవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ( ఎన్ఎల్సీ ) థర్మల్ పవర్ స్టేషన్-2లోని ఐదవ యూనిట్ వద్ద బాయిలర్ పేలి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించగా 17 మందికి తీవ్రంగా గాయపడినట్లు జిల్లా ఎస్పీ శ్రీ అభినవ్ తెలిపారు. క్షతగాత్రులను చెన్నైలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ఎన్ఎల్సి దగ్గరున్న అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని లేదంటే పరిస్థితి ఇంకా భయానకంగా మారేదని అధికారులు పేర్కొన్నారు. బాయిలర్ పేలుడుకు గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. మే నెలలోనూ ఇదే విధమైన పేలుడు సంభవించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. Tamil Nadu: Explosion at a boiler in stage -2 of the Neyveli lignite plant. 17 injured persons taken to NLC lignite hospital. Visuals from the spot. More details awaited. https://t.co/jtaOudE9P0 pic.twitter.com/FWKYNsePVO — ANI (@ANI) July 1, 2020 -
థర్మల్ పవర్‌ప్లాంట్ బాధితులకు అండగా ఉంటాం..
ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లిలో థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఎనిమిదేళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న బాధితులకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కొండంత భరోసా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ప్లాంట్‌కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయడమే కాకుండా.. తరతరాలుగా తంపర భూముల్లో చేపలవేట కొనసాగిస్తున్న కండ్ర, ఇతర మత్స్యకారుల జీవనోపాధి కోసం.. ఆ భూములు వారికే దక్కేలా చూస్తాననిహామీ ఇచ్చారు. పవర్‌ప్లాంట్ కోసం సేకరించిన భూములను తమకివ్వాలని కోరుతూ దాదాపు 10 వేల మంది కండ్ర సామాజికవర్గంవారు గత 3,051 రోజులుగా చేస్తున్న నిరాహారదీక్ష శిభిరాన్ని గురువారం ఆయన సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 326వ రోజు గురువారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో కొనసాగింది. కోటబొమ్మాళి శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. లక్ష్మీపురం క్రాస్, సవరపేట క్రాస్, శివరాంపురం క్రాస్, సంతబొమ్మాళి, బోరభద్రక్రాస్, జగన్నాథపురం క్రాస్, వడ్డితాండ్ర, దండుగోపాలపురం వరకూ సాగింది. పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. మరీ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆత్మీయ స్వాగతం పలికారు. పలువర్గాల ప్రజలు తమ సమస్యలను జగన్‌కు చెప్పుకొని భరోసా పొందారు. దీక్షా శిబిరంలో జగన్ వడ్డితాండ్ర వద్ద దీక్షలు చేస్తున్న పవర్‌ప్లాంట్ బాధితులను వైఎస్ జగన్ పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పవర్‌ప్లాంట్‌కు ఇచ్చిన అనుమతులను రద్దుచేయాలని.. ఆ మేరకు 1108 జీవోను రద్దు చేయాలని, తంపర భూముల లీజులను పునరుద్ధరించి తమ కుటుంబాలను ఆదుకోవాలని, ఆ భూముల్లో రొయ్యల కుండీలను తొలగించాలని, తిత్లీ తుపానులో ఇళ్లు కోల్పోయిన వారందరికీ ఇళ్లు నిర్మించాలంటూ.. థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు జగన్‌ను కోరారు. తమపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక మంత్రి అచ్చెన్నాయుడు సైతం ఇటీవల తమ దీక్షా శిబిరానికి వచ్చి జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఆరు నెలలు దాటినా ఇంతవరకూ అతీగతీ లేదన్నారు. తంపర భూముల్లో ఆరువేల మంది సంప్రదాయ మత్స్యకారులు పొట్టపోసుకుంటున్నారని తెలిపారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని, 2011 ఫిబ్రవరి 28న కాకరాపల్లి వద్ద జరిగిన కాల్పుల్లో మృతిచెందిన మూడు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. వారి సమస్యలను సావధానంగా విన్న జగన్.. మనందరి ప్రభుత్వం వచ్చాక ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తంపర భూములు సంప్రదాయ మత్స్యకారులకు దక్కేలా చూస్తానని, తిత్లీ తుపానులో దెబ్బతిన్న ఇళ్ల స్థానే కొత్తవి కట్టిస్తామని భరోసా ఇచ్చారు. వేట నిషేధంలో రూ.10 వేలు సాయం.. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే సాయాన్ని రూ.10 వేలకు పెంచుతామని మత్స్యకారులకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. సంతబొమ్మాళి సమీపంలో ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల మత్స్యకార ప్రతినిధులు వీరుపల్లి రాజశేఖర్, మైలపల్లి జగదీశ్వరరావు, సూరాడ జోగారావు, బి,రాధ, లక్ష్మి తదితరులు జగన్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. మత్స్యకారులకు ఎస్టీ హోదా కల్పించాలని, వలసల నివారణకు జెట్టీలు నిర్మించాలని, మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై జగన్ స్పందిస్తూ కార్పొరేషన్ ఏర్పాటుచేయడమే కాకుండా ప్రతి కుటుంబంలో 45 ఏళ్లు దాటిన ఆడపడుచులకు వైఎస్సార్ చేయూత కింద రూ.75 వేలు వంతున ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారికి తక్షణ సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. పొట్టచేతపట్టుకుని వలసలు పోతున్న మత్స్యకార యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలనే సంకల్పంతోనే ఇప్పుడున్న పరిశ్రమలతో పాటు.. కొత్తగా వచ్చే పరిశ్రమల్లో సైతం 75శాతం స్థానిక రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ఇందుకోసం తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టాన్ని తెచ్చి.. ఉద్యోగాలిచ్చి వలసలను నివారిస్తామని వారికి భరోసా ఇచ్చారు. వేటకు వెళ్లి సముద్రంలో మరణించిన 189 మందికి ఈ సర్కార్ ఇంతవరకు ఎటువంటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదని మత్స్యకార సంఘం నేతలు జగన్ దృష్టికి తెచ్చారు. ఎస్టీ హోదా కల్పించే విషయమై కేంద్రానికి సిఫార్సు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. మంత్రి అరాచకాలు మితిమీరాయి.. మంత్రి అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో ఆయన వర్గీయుల అరాచకాలు మితిమీరాయని నిమ్మాడ వాసులు అనేక మంది వైఎస్ జగన్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి మాట కాదన్న వారిని సామాజికంగా వెలివేస్తున్నారని వాపోయారు. ఒకప్పుడు ఎర్రన్నాయుడుకి ఈ గ్రామంలో 12 ఎకరాలు భూమి ఉండేదని, ఈవేళ ఎంత భూమి ఉందో లెక్కేలేదని ఆ ప్రాంతవాసులు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి భూముల మధ్యలో ఒక రైతుకున్న ఒకటిన్నర ఎకరం భూమిని సాగు చేసుకోనివ్వకుండా ఇబ్బందిపెడుతున్నారని, ఆ రైతుకు తెలియకుండానే ఆ భూమిని సెల్ టవర్ల నిర్మాణానికిచ్చి అద్దె కూడా మంత్రే కాజేస్తున్నారని చెప్పారు. సుమారు 22 కుటుంబాలపై అనాగరిక వెలి కొనసాగుతోందన్నారు. వీటిపై మంత్రిని, ఆయన అనుచరులను ప్రశ్నిస్తే.. భౌతిక దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో అంతా దగా తిత్లీ తుపాను వచ్చి నెల దాటినా ఇంతవరకు పరిహారం అందలేదని వివిధ గ్రామాల ప్రజలు జగన్ వద్ద మొరపెట్టుకున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులను నష్టపరిహారం అంచనాల్లో పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. వైఎస్సార్సీపీ అభిమానులమని నర్సాపురంలో 30 ఏళ్లుగా నిర్వహిస్తున్న రేషన్‌షాపు లైసెన్సును టీడీపీ నాయకులు రద్దు చేయించారని బడే రాజేశ్వరి, పింఛన్లు తీసేస్తున్నారని అదే గ్రామానికి చెందిన నీలమ్మ, తమ ప్రాంతానికి రోడ్లు వేయడం లేదని, జన్మభూమి కమిటీల ఆగడాలు మితిమీరాయని ఉద్దండవానిపాలేనికి చెందిన చింతాడ రమణమ్మ, పాదయాత్రలో పాల్గొంటే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని పాలతలగాం గ్రామానికి చెందిన నారాయణమ్మ.. బావనపాడు పోర్టు పేరుతో ఊళ్లకు ఊళ్లే ఖాళీచేయించి వేలాది ఎకరాలను బలవంతంగా సేకరిస్తున్నారని బుడ్డా మోహనరెడ్డి, పోర్టుతో ఉపాధి అవకాశాలు అపారమని మభ్యపెట్టి పచ్చని పంట పొలాలు సేకరిస్తున్నారని పలువురు రైతులు.. ఇలా దారిపొడవునా గ్రామగ్రామానా ఎందరెందరో.. టీడీపీ పాలనలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న జగన్.. మనందరి ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చారు. పోర్టు పేరుతో ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేయిస్తున్నారన్నా.. భావనపాడు పోర్టు పేరుతో పలు గ్రామాలను ఏకంగా ఖాళీ చేయించి.. వేలాది ఎకరాలను బలవంతంగా తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నా.. పోర్టు నిర్మించి.. ఉపాధి కల్పిస్తామని మభ్యపెడుతూ ఇష్టారాజ్యంగా వేలాది ఎకరాలు సేకరిస్తున్నారు. దీంతో పచ్చని పంటపొలాలను కోల్పోతున్నాం. ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. ఐదు పంచాయితీల పరిధిలో ఏడువేల కుటుంబాల పరిస్థితి దుర్భరంగా మారింది. ప్రభుత్వ భూములు 20 వేల ఎకరాలున్నా.. అవసరానికి మించి 5,700 ఎకరాలు అవసరమంటూ ఇబ్బందులు పెడుతున్నారు. – బుడ్డా మోహనరెడ్డి, భావనపాడు పాదయాత్రకు వెళ్తే.. సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ బెదిరించారు.. అయ్యా.. మీ పాదయాత్రలో పాల్గొనవద్దంటూ టీడీపీ నేతలు మా గ్రామాల్లో బెదిరింపులకు దిగుతున్నారు. యాత్రకి వెళితే పింఛన్లు, సంక్షేమ పథకాలు నిలిపేస్తామంటూ బెదిరిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు తిత్లీ తుపాను నష్ట పరిహారం ఇవ్వడం లేదు. ఇళ్లు కూలిపోయి నరకం చూస్తున్న వృద్ధులపై కూడా కనికరం చూపడం లేదన్నా.. న్యాయం జరిగేలా చూడండి.. –కవిత, నారాయణమ్మ, సాగిపిల్లి రవణమ్మ, పాలతలగాం శిష్టకరణాలను ఓబీసీలో చే ర్చేందుకు కృషిచేయరూ శిష్టకరణాలను ఓబీసీల్లో చేర్చాలి. మీ నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డిగారు మా కులాన్ని ఓసీ కేటగిరి నుంచి బీసీల్లో చేర్చారు. మీరు సీఎం అయ్యాక ఓబీసీల్లోకి చేర్చాలి. –శిష్టకరణాల సంఘం నేతలు సదాశివుని కృష్ణ, డబ్బీరు భవనీశంకర్, రఘుపాత్రుని చిరంజీవి, పెదపెంకి శ్రీరామ్‌కుమార్, ఆర్ఆర్ మూర్తి ప్రజా సంకల్ప యాత్ర 326వ రోజు ఇప్పటి వరకు నడిచిన దూరం 3,494.1 కిలో మీటర్లు 326వరోజు నడిచిన దూరం 7.2 కిలో మీటర్లు ప్రారంభం: ఉ. 7.30 గంటలకు దుర్గమ్మపేట ముగింపు: సా. 5 గంటలకు దండుగోపాలపురం ముఖ్యాంశాలు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం దుర్గమ్మపేట, సంతబొమ్మాళి మండలంలోని లక్ష్మీపురం క్రాస్, సవరపేట క్రాస్, శివరాంపురం క్రాస్, సంతబొమ్మాళి, బోరుబద్ర క్రాస్, జగన్నాథపురం క్రాస్, వడ్డితాండ్ర కూడలి, దండుగోపాలపురం గ్రామాల ప్రజలతో మమేకం. నేటి పాదయాత్ర షెడ్యూల్ ప్రారంభం: ఉ. 7.30 గంటలకు దండుగోపాలపురం ముఖ్యాంశాలు టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం, కాశిపురం, దామోదరపురంక్రాస్ గ్రామాల ప్రజలతో మమేకం. -
సింగరేణిలో 800 మెగావాట్ల ప్లాంట్
సాక్షి, హైదరాబాద్ : మంచిర్యాల జిల్లా జైపూర్‌లో సింగరేణి బొగ్గు గనుల సంస్థ నిర్మించనున్న 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జైపూర్‌లో సింగరేణి సంస్థ 1,200 మెగావాట్ల సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించి విద్యుదుత్పత్తి జరుపుతోంది. అక్కడే 600 మెగావాట్ల సామర్థ్యంతో మరో సబ్ క్రిటికల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రెండేళ్ల కిందట శంకుస్థాపన చేశారు. అయితే సబ్ క్రిటికల్‌కు బదులు సూపర్ క్రిటికల్ బాయిలర్ టెక్నాలజీతో ప్లాంట్ నిర్మించాలని సింగరేణికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సూచించింది. కేంద్రం సూచన మేరకు 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి సింగరేణి ప్రతిపాదనలు పంపగా ఇటీవల సీఎం ఆమోదించారని సంస్థ వెల్లడించింది. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రాగానే పనులు మొదలుపెట్టనున్నారు. సెప్టెంబర్‌లో 93 శాతం విద్యుదుత్పత్తి జైపూర్‌లోని 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ సెప్టెంబర్‌లో 93.84 శాతం సామర్థ్యంతో విద్యుదుత్పత్తి జరిపిందని సంస్థ యాజమాన్యం తెలిపింది. 810.76 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవగా.. 762.92 మిలియన్ యూనిట్లను గజ్వేల్‌లోని పవర్ గ్రిడ్‌కు సరఫరా చేశామని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు 4,613 ఎంయూల విద్యుదుత్పత్తి జరిపి 4325.48 ఎంయూలను రాష్ట్ర అవసరాలకు సరఫరా చేసినట్లు వెల్లడింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 87.53 శాతం సామర్థ్యంతో విద్యుదుత్పత్తి జరిపినట్లు సంస్థ తెలిపింది. -
తాళం పడింది!
► ‘థర్మల్’ కేంద్రంలో ఆగిన ఉత్పత్తి ► ఉద్యోగ, కార్మికుల్లో ఆందోళన ► ఏకమైన కార్మిక సంఘాలు సాక్షి, చెన్నై: ఎన్నూర్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి తాళం వేశారు. చడీ చప్పుడు కాకుండా ఆ కేంద్రాన్ని మూసి వేయడాన్ని ఉద్యోగ, కార్మికులు జీర్ణించుకోలేకున్నారు. తమకు ప్రత్యామ్నాయం కల్పించాలని ఆందోళన బాట పట్టారు. ఉత్తర చెన్నై ఎన్నూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించారు. తొలుత 60 మెగావాట్ల ఉత్పత్తితో మొదలై, క్రమంగా 450 మెగావాట్లకు సామర్థ్యన్ని పెంచారు. ఒకటి, రెండు యూనిట్ల ద్వారా తలా 60 మెగావాట్లు, మూడు, నాలుగు, ఐదు యూని ట్ల ద్వారా తలా 110 మెగావాట్ల చొప్పున ఉత్పత్తి సాగుతూ వచ్చింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ కేవలం చెన్నై నగర, సరిహద్దులకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా 1030, పరోక్షంగా మూడు వందల మంది ఉద్యో గ కార్మికులు పనిచేస్తూ వస్తున్నారు. ఇటీవల ఈ కేంద్రం విస్తరణ పేరుతో పక్కనే కొత్తగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అన్నాడీఎంకే సర్కారు చర్యలు తీసుకుంది. 660 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఆ కేంద్రంలో తొలి యూనిట్ ఏర్పాటుకు తగ్గ పనులకు చర్యలు చేపట్టారు. ఈ పనులు ముగియడానికి మరో రెండేళ్లు పట్టడం ఖాయం. ఈ పరిస్థితుల్లో పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రస్తుత కేంద్రంలోని యూనిట్లు తరచూ మరమ్మతులకు గురవుతూ వచ్చారుు. ఒక దాని తర్వాత మరొకటి అన్నట్టుగా నాలుగు యూనిట్లు మరమ్మత్తులకు గురయ్యారుు. అదే సమయంలో అక్కడి యూనిట్ల కాల పరిమితి 40 సంవత్సరాలు మాత్రమేనని, అంతకు మించి ఆరు సంవత్సరాలు అధికంగానే అవి పనిచేయడం వలన మరమ్మతులకు గురవుతున్నదన్నట్టుగా అధికార వర్గాలు తేల్చారు. అలాగే, నేల బొగ్గు తరలింపు మరింత శ్రమగా మారి ఉండడంతో , అత్యాధునిక పరికరాల్ని రంగంలోకి దించి మరమ్మతులు చేరుుంచడం కష్టతరంగా అధికారులు గుర్తించారు. ఈ కేంద్రాన్ని ఇక ముందుకు తీసుకెళ్లడం కన్నా, శాశ్వతంగా తాళం వేయడం మంచిదన్న నిర్ణయానికి ఇటీవల తమిళనాడు విద్యుత్‌బోర్డు వర్గాలు వచ్చారుు. ఇందుకు తగ్గ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. ఈ సమాచారంతో ఉద్యోగుల్లో ఆందోళన బయలు దేరింది. ఆ కేంద్రాన్ని రక్షించుకునేందుకు తీవ్రంగానే పోరాటా లు సాగించినా ఫలితం శూన్యం. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో చడీచప్పు డు కాకుండా గురువారం ఆ కేంద్రానికి అధికారులు శాశ్వతంగా తాళం వేశారు. దీంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల్లో ఆందోళన బయలు దేరింది. మొన్నటి వరకు ఒకటో యూనిట్ ద్వారా 60 మెగావాట్ల ఉత్పత్తి సాగుతూ వచ్చిం దని, ఉన్న నేలబొగ్గును అంతా ఖాళీ చేరుుంచి, హఠాత్తుగా మూసివేయడం ఎంత వరకు సమంజసమని కార్మిక సం ఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పనిలో పడ్డారుు. 46 ఏళ్లుగా సేవల్ని అందించిన ఆ కేంద్రాన్ని, పక్కనే నిర్మిస్తున్న మరో కేంద్రం కోసం మూసి వేయడం మంచి పద్ధతేనా..? అని సీఐటీయూ నేత వెంకటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చే స్తూ, పోరుబాట సాగించనున్నామన్నా రు. ఇక, గురువారం ఆ కేంద్రం వద్దకు చేరుకున్న ఉద్యోగ, కార్మికులు తాళం పడడంతో అక్కడే బైఠారుుంచి ఆందోళనకు దిగారు. ఇక, ఇక్కడి ఉద్యోగ, కార్మికులకు న్యాయం లక్ష్యంగా భారీ ఎత్తున నిరసనలు సాగించేందుకు పన్నెండు కార్మిక సంఘాలు ఏకమయ్యారుు. -
రాష్ట్రానికే తొలి ప్రాధాన్యం!
* రామగుండం ఎన్టీపీసీ విద్యుత్‌లో రాష్ట్రానికి 85 శాతం వాటా * కేటాయించని 15 శాతం విషయంలో తొలి ప్రాధాన్యం రాష్ట్రానిదే * ప్రపంచ స్థాయి నాణ్యత వల్లే ఎన్టీపీసీ కొత్త ప్లాంట్ల వ్యయం పెరుగుదల * కొత్త ప్లాంట్ల విద్యుత్ ధరలు యూనిట్‌కు రూ.5 నుంచి రూ.6 * ఎన్టీపీసీ దక్షిణ ప్రాంతీయ ఈడీ ఫడ్నవీస్ స్పష్టం సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న 1,600 (2‘800) మెగావాట్ల తెలంగాణ సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి మిగిలిన 15 శాతం విద్యుత్ కేటాయింపుల్లో రాష్ట్రానికే తొలి ప్రాధాన్యం లభిస్తుందని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) దక్షిణ ప్రాంతీయ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వీబీ ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఇప్పటికే అందులో నుంచి 85 శాతం విద్యుత్ వాటాలు రాష్ట్రానికి కేటాయించిన విషయం తెలిసిందే. రామగుండం ప్లాంట్ నుంచి 100 శాతం విద్యుత్‌ను రాష్ట్రానికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రం పరిధిలో ఉందన్నారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో దక్షిణాదిలో ఎన్టీపీసీ సాధించిన వార్షిక పురోగతిని వెల్లడించారు. దేశం మిగులు విద్యుత్ సాధ నలో ఎన్టీపీసీ పాత్ర కీలకమన్నారు. 25 శాతం దేశ విద్యుత్ అవసరాలను ఎన్టీపీసీ తీరుస్తోందన్నారు. పెరుగుతున్న కొత్త ప్లాంట్ల వ్యయంపై.. ఎన్టీపీసీ కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ వ్యయంతో పాటు విద్యుత్ ధరలూ పెరుగుతుండటం పట్ల రాష్ట్ర ఈఆర్సీ వ్యక్తం చేసిన ఆందోళనలపై ఫడ్నవీస్ స్పం దించారు. ప్రపంచస్థాయినాణ్యతాప్రమాణాలతో కొత్త ప్లాంట్లు నిర్మిస్తున్నామని, అందుకే సంస్థ ప్లాం ట్లు మన్నికగా ఉంటాయన్నారు. కొత్త ప్లాంట్ల నిర్మాణంపై మెగావాట్‌కు సగటున రూ.5 కోట్ల నుంచి రూ.5.5 కోట్ల వరకు వ్యయం జరుగుతోందన్నారు. కొత్త ప్లాంట్ల విద్యుత్ ధరలు యూనిట్‌కు రూ.5 నుంచి రూ.6 వరకు ఉంటాయన్నారు. పాత విద్యుత్ ప్లాంట్లు కోర్బా నుంచి రూ.2.20కు, తాల్చేరు నుంచి రూ.2.50 కు యూనిట్ చొప్పున తక్కువ ధరకే విద్యుత్ విక్రయిస్తున్నామన్నారు. 1,600 మెగావాట్ల రామగుండం ప్లాంట్ నిర్మాణ వ్యయం రూ.10 వేల కోట్ల వరకు ఉంటుందని, ఈ ప్రాజెక్టు విద్యుత్ ధర యూనిట్‌కు రూ.3-3.50 వరకు ఉండవచ్చు అన్నారు. ఇకపై పీఎల్ఎఫ్ ముఖ్యాంశం కాదు విద్యుత్ ప్లాంట్లను బ్యాకింగ్ డౌన్ చేసి ఉత్పత్తి తగ్గించాల్సి వస్తున్న నేపథ్యంలో ఇకపై విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుకోవడం కంటే విద్యుత్ లభ్యతే ముఖ్యమని ఆయన అన్నారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాక నాలుగేళ్లుగా విద్యుత్ డిమాండ్‌లో వృద్ధి లేదన్నారు. రాష్ట్రంలో 2,600 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ రెండో దశ ప్రాజెక్టు నిర్మాణంపై ఇంకా ఆదేశాలు అందలేదన్నారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం భవిష్యత్తులో భారంగా మారే అవకాశముందని, వాటి నిర్మాణంపై పునరాలోచన చేయాలని కేంద్ర సూచనల ప్రభావం రామగుండం రెండో దశ ప్లాంట్‌పై లేదన్నారు. కేంద్రం నుంచి దేశీయ బొగ్గు కేటాయింపులు జరిగిన తర్వాత ఏపీలోని లాలమ్ కోడూరులో 4వేల మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనులను దేశీయ బొగ్గు పరిజ్ఞానంతో ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో రామగుండం ఎన్టీపీసీ ఈడీ పీకే మహాపాత్రో, కాయంకుళం జీఎం శంకర్ దాస్, సింహాద్రి జీఎం పీకే బొంద్రియా, అనంతపురం సోలార్ ప్రాజెక్టు జీఎం కేసీ దాస్ పాల్గొన్నారు. -
వేడిని విద్యుత్తుగా మార్చే పదార్థం
వృథా అవుతున్న వేడిని శక్తిగా మార్చే వినూత్నమైన పదార్థాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఆవిష్కరించింది. తద్వారా థర్మల్ పవర్ ప్లాంట్లు మొదలుకుని సామాన్య వాహనాల వరకూ అన్నింటితో అదనంగా విద్యుదుత్పత్తి చేసే సౌకర్యం ఏర్పడనుంది. వాహనాల్లో లీటర్ పెట్రోలు పోస్తే అందులో ప్రయాణానికి ఉపయోగపడేది 20 శాతం మాత్రమే. మిగిలినదంతా వేడి రూపంలో వృథా అవుతుంటుంది. బొగ్గుతో నడిచే థర్మల్ పవర్ ప్లాంట్లలో అయితే ఈ వృథా 50 నుంచి 60 శాతం వరకు ఉంటుంది. దీంట్లో ఏ కొంచెం మొత్తాన్ని తిరిగి విద్యుత్తుగా మార్చగలిగినా ఎంతో ప్రయోజనముంటుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పర్డ్యూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నానోస్థాయి టంగ్స్టన్, హఫీనియం ఆక్సైడ్లతో వేడిని విద్యుత్తుగా మార్చే పదార్థాన్ని తయారు చేశారు. సోలార్ సెల్స్ సూర్యకిరణాల్లోని శక్తిని ఎలాగైతే విద్యుత్తుగా మారుస్తాయో.. ఈ థర్మోవోల్టాయిక్ పదార్థం వేడిని విద్యుత్తుగా మారుస్తుందన్నమాట. -
నేడు భద్రాద్రిలో ‘పర్యావరణ’ తనిఖీలు
నెలాఖరులోగా తేలనున్న థర్మల్ విద్యుత్ కేంద్రం భవితవ్యం తనిఖీ నివేదిక ఆధారంగా పర్యావరణ అనుమతులపై నిర్ణయం 29, 30వ తేదీల్లో సమావేశం కానున్న నిపుణుల సాధికారిక కమిటీ ఇప్పటికే ప్రాజెక్టుపై రూ.800 కోట్లను వెచ్చించిన జెన్కో హైదరాబాద్: రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) ఖమ్మం జిల్లా మణుగూరులో నిర్మిస్తున్న 1,080 (4X270) మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ గురువారం తనిఖీ చేయనుంది. ఈ తనిఖీల్లో నిర్ధారించే అంశాల ఆధారంగానే ఈ ప్రాజెక్టు భవితవ్యంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఈ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతుల జారీ కోసం జెన్కో పెట్టుకున్న అభ్యర్థనపై పరిశీలన జరపాలా, వద్దా? అనే అంశంపై 8 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) గత జూలై 11న ఆదేశించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 11తో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో... తనిఖీలు జరుగనున్నాయి. కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల సాధికారిక కమిటీ ఈ నెల 29, 30వ తేదీల్లో ఢిల్లీలో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. తనిఖీలు ఎందుకు? ఏవైనా ప్రాజెక్టులు చేపట్టినపుడు.. ఎలాంటి నిర్మాణ పనులు ప్రారంభించక ముందే ఆ స్థలంలో పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేసి కేంద్ర పర్యావరణ శాఖకు నివేదిక సమర్పించాలి. ఆ నివేదిక ఆధారంగా పర్యావరణ అనుమతులపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఈ అధ్యయానికి ముందే భద్రాద్రి ప్రాజెక్టు నిర్మాణ పనులను జెన్కో చేపట్టడంతో ప్రాజెక్టు స్థలంలో మార్పులు జరుగుతున్నాయి. దీంతో పర్యావరణ ప్రభావంపై సరైన అధ్యయనం సాధ్యమా? అన్న అంశంపై పరిశీలన జరపాలని ఎన్జీటీ ఆదేశించింది. ఈ మేరకు ప్రొఫెసర్ సీఆర్ బాబు నేతృత్వంలో పర్యావరణ శాస్త్రవేత్తలతో కేంద్ర పర్యావరణ శాఖ ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందం గురు, శుక్రవారాల్లో ప్రాజెక్టుస్థలంలో తనిఖీలు జరిపి.. ఈ నెల 24లోగా కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రాజెక్టుకు అనుమతులపై కేంద్ర పర్యావరణ శాఖ నిర్ణయం తీసుకోనుంది. అయితే రూ.5,044 కోట్లతో చేపట్టిన భద్రాద్రి విద్యుత్ కేంద్రాన్ని 2016లోగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఎన్జీటీ కేసు, పర్యావరణ అనుమతుల జారీలో జాప్యంతో గడువును మరో రెండేళ్లకు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే యంత్రాల కొనుగోళ్లు, ఇతర నిర్మాణ పనుల కోసం రూ.800 కోట్లను జెన్కో ఖర్చు చేసింది. ఒకవేళ పర్యావరణ అనుమతుల జారీపై పరిశీలన జరపవద్దని నిర్ణయిస్తే.. ప్రాజెక్టు నిర్మాణాన్ని విరమించుకునే పరిస్థితి ఉత్పన్నం కానుంది. -
రాజుకుంటోంది!
థర్మల్ పవర్ ప్లాంటు, పోలాకి, ఆందోళన ‘థర్మల్’ వ్యతిరేక గ్రామాల్లో ఉద్రిక్తత పోలీసుల నీడలో పోలాకి థర్మల్ ప్రతిపాదిత గ్రామాలు శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలోని థర్మల్‌పవర్ ప్లాంటు నిర్మాణ ప్రతిపాదిత గ్రామాల్లో వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. జపాన్‌కు చెందిన సుమితోమో సంస్థ ఆర్థిక సాయంతో 4000 మెగావాట్ల పవర్‌ప్లాంటు ఏర్పాటు ప్రతిపాదనను ఈ ప్రాంతీయులు వ్యతిరేకిస్తున్నారు. తమ బతుకులను నాశనం చేయవద్దని వేడుకుంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోకుండా భూసర్వేలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలుమార్లు సర్వేను అడ్డుకొని ప్రజలు నిరసన తెలిపారు. బుధవారం కూడా సర్వేకు అధికారులు పూనుకోవడంతో జనం తిరగబడ్డారు. అయితే అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ప్రజా సంఘాల నాయకులు, పలువురు రైతులను అరెస్టు చేశారు. అనంతరం సర్వేను కొనసాగించారు. ఓదిపాడు(పోలాకి): పోలాకి థర్మల్ వ్యతిరేక ఉద్యమం ఉద్రిక్తంగా మారుతోంది. పవర్‌ప్లాంటు ఏర్పాటును ఈ ప్రాంతీయులు వద్దని వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా మొండిగా భూసర్వే చేస్తుడడం, ప్రజలు అడ్డుకుంటుండడంతో పరిస్థితి చేరుదాటుతోంది. గత మూడు వారాలుగా చేపడుతున్న సర్వేను ఎప్పటికప్పుడు ప్రజలు అడ్డుకుంటున్నారు. మంగళవారం కూడా ఓదిపాడు, చీడివలస, సన్యాసిరాజుపేట, కోరాడలచ్చయ్యపేట, గవరంపేట గ్రామాల్లో సర్వేచేపట్టేందుకు వచ్చిన అధికారులను అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. దీంతో వెనుదిరిగిన పోలీసులు, సర్వే బృందాలు బుధవారం పక్కా ప్రణాళికతో సర్వేకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఉదయం నుంచే ఈ గ్రామాల ప్రజలు బయటకు రాకుండా పోలీసు బలగాలను ఎక్కడికక్కడ మోహరించారు. అయినా ఆగ్రహంతో ఊగిపోయిన జనం వారిని ఖాతరు చేయకుండా ముందుకు సాగారు. దీంతో సీపీఎం రాష్ట్రకార్యవర్గసభ్యుడు చౌదరి తేజేశ్వరరావు, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నేతింటి నీలంరాజు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.సురేష్‌బాబు, రైతుసంఘం నాయకులు మోహనరావు, బగ్గు భాస్కరరావులతో పాటు మరికొంతమంది ప్రజాసంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అంతటితో ఆగకుండా స్థానిక థర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకుడు ముద్దాడ బైరాగినాయుడుతోపాటు పలువురు రైతులు, నాయకులను అరెస్ట్ చేసేందుకు విఫలయత్నం చేశారు. ప్రతిఘటించిన ప్రజలు పొలాల ద్వారా సర్వే చేపట్టే చోటుకు చేరుకుని అడ్డుకున్నారు. వేర్వేరు గ్రామాల నుంచి ఉద్యమకారులు రావడంతో ఒకానొక సమయంలో పోలీసులు చేతులెత్తేశారు. దీంతో సర్వేను కొద్దిసేపు నిలిపివేశారు. అనంతరం తహసీల్దార్ జె.రామారావు, నరసన్నపేట, ఆమదాలవలస సీఐలు చంద్రశేఖరరావుల సమక్షంలో ఎచ్చెర్ల నుంచి అదనపు బలగాలను రప్పించారు. వారి సమక్షంలో పొలాల్లో ఉన్న ఉద్యమ నాయకుడు ముద్దాడ బైరాగినాయుడుతో పాటు మరి కొంతమంది స్థానిక థర్మల్ వ్యతిరేకపోరాట సమితి నాయకులు, రైతులను అరెస్ట్ చేసి నరసన్నపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అడ్డువచ్చిన మహిళలు, వృద్ధులను సైతం పక్కకు లాగిపడేశారు. అప్పటివరకు నిలిచిన సర్వేను ఆ తరువాత ఏపీజెన్కో ఏఈ టీవీ మధు ఆధ్వర్యంలో పోలీసుల నీడలో కొనసాగించారు. బందోబస్తులో నరసన్నపేట, జలుమూరు, జేఆర్‌పురం, శ్రీకాకుళం వన్‌టౌన్ ఎస్‌ఐలతోపాటు ప్రత్యేక దళం పోలీసులు పాల్గొన్నారు. తొలిసారిగా స్థానికుల అరెస్టు థర్మల్ వ్యతిరేకపోరులో స్థానికులను అరెస్టు చేయడం ఇదే తొలిసారి. గతంలో పలుమార్లు ప్రజాసంఘాల నాయకులు, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. థర్మల్ వ్యతిరేక పోరాటంలో చురుగ్గాపాల్గొంటున్న వైఎస్ఆర్సీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు ముద్దాడ భైరాగినాయుడుతోపాటు ప్రతిపాదిత గ్రామాలకు చెందిన దాదాపు 30 మంది రైతులు, నాయకులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేయడంతో పరిస్థితి మున్ముందు ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యమానికి మద్దతు థర్మల్ ఉద్యమానికి నరసన్నపేటకు చెందిన నాయకులు మద్దతు ప్రకటించారు. నియోజకవర్గ కేంద్రానికి అత్యంత దగ్గర్లో థర్మల్‌ప్లాంట్ నిర్మాణం జరిగితే కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చింతు రామారావు అన్నారు. పోలీసులు అరెస్టు చేసిన థర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకుడు ముద్దాడ భైరాగినాయుడు, రైతులు మల్లేసు, ధనుంజయరావు, కుమ్మరి శిమ్మయ్య, సురేష్, చిన్నప్పన్న, అంపోలు విజయ్‌కుమార్, కింజరాపు అప్పారావు, కుమ్మరి తవిటయ్య, యర్రయ్యలను పట్టణ నాయకులు నరసన్నపేట పోలీస్‌స్టేషన్‌లో పరామర్శించారు. మద్దతు ప్రకటించిన వారిలో కోరాడ చంద్రభూషణగుప్త, ఆరంగిమురళి,మొజ్జాడ శ్యామలరావు ఉన్నారు. -
పోలాకిలో ఉద్రిక్తత
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పోలాకిలో థర్మల్ పవర్ ప్లాంట్ సర్వేను బుధవారం స్థానికులు అడ్డుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే ప్లాంట్ కోసం జిల్లాలోని చీడివలస, గవరంపేట, గోవిందరాజులపేట గ్రామాల్లో సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సదరు గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. తమ నిరసన తెలిపేందుకు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన ఆయా గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో సదరు గ్రామాల ప్రజలు పోలీసుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సర్వేను ఎలాగైనా అడ్డుకుని తీరతామని ఉద్యమకారులు స్పష్టం చేశారు. -
మళ్లీ థర్మల్ సెగ
పోలాకి: మళ్లీ థర్మల్ సెగ రాజుకుంది. జపాన్‌కు చెందిన సుమితొమో సంస్థ ఆర్థిక సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ధర్మల్ పవర్ ప్లాంట్ భూములసర్వే పోలాకి మండలంలో సెగలు పుట్టిస్తోంది. ప్లాంటు నిర్మాణ విషయమై ఆదినుంచి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకువెళ్లడంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. సోమవారం ప్రతిపాదిత భూముల్లో సర్వే నిర్వహిస్తున్న అధికారుల బృందాన్ని అడ్డుకోవాలని అక్కడి ప్రజలు నిర్ణయంచటంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. థర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు కూడా మద్దతు తెలపటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే తహసీల్దార్ జెన్ని రామారావు స్పందించి సిబ్బంది, పోలీసులతో ప్రతిపాదిత గ్రామాలకు చేరుకున్నారు. అక్కడ ప్రజలు, థర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు, రైతులతో మాట్లాడారు. ఇది కేవలం భౌగోళిక సర్వే మాత్రమేనని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేయటంతో సర్వే నిలిపి వేస్తున్నట్టు తహసీల్దార్ ప్రకటించారు. ప్లాంటే వద్దంటే.. భూముల సర్వే ఎందుకు? అనంతరం సీపీఎం నాయకుడు చౌదరి తేజేశ్వరరావు మాట్లాడుతూ ప్లాంట్ నిర్మాణాన్ని ఇక్కడి ప్రజలు వ్యతిరేకిస్తుంటే భూముల సర్వే ఎందుకని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. సర్వే పేరుతో ఒక్క అడుగు ముందుకు వేసినా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తరువాత పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఆయనకు మద్దతుగా థర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ముద్దాడ బైరాగినాయుడు, కింజరాపు మల్లేశ్వరరావు, సురేష్‌బాబు, రైతు సంఘం నాయకుడు మోహనరావు తదితరులు అధికారులకు ప్రశించారు. నేటినుంచి గ్రామాల్లో అవగాహన సదస్సులు సర్వే నిలిపి వేసిన అనంతరం తహసీల్దార్ ధర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు, రైతులతో మాట్లాడారు. మంగళవారం నుంచి ధర్మల్ ప్రతిపాదిత గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. ముందుగా చీడివలస, ఓదిపాడు, గవరంపేట గ్రామాల్లో సదస్సులు నిర్వహించి ప్రజల అనుమానాలు నివృత్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐ అనిల్‌కుమార్‌తోపాటు సిబ్బంది కృష్ణమోహన్, వెంకటరమణ పాల్గొన్నారు. -
సింగరేణి రెండో యూనిట్ సింక్రనైజేషన్ ప్రక్రియ ప్రారంభం
అదిలాబాద్ జిల్లా జైపూర్‌లో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ రెండో యూనిట్ సింక్రనైజేషన్ ప్రక్రియను ఈరోజు ప్రారంభించారు. ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్. శ్రీధర్ ఈరోజు పనులను ప్రారంభించి విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. -
ప్రైవేటుకు ‘సింగరేణి’ ప్లాంట్!
► జర్మన్ కంపెనీ చేతికి జైపూర్ థర్మల్ ప్లాంట్ నిర్వహణ, పర్యవేక్షణ ► జెన్కోకు అప్పగించే విషయంలో సింగరేణి వెనకడుగు ► మూడేళ్ల నిర్వహణ కోసం స్టియాగ్ ఎనర్జీతో ఒప్పందం ► అనంతరం స్వయంగా పర్యవేక్షణ చేపట్టనున్న సింగరేణి సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థ ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వహణ, పర్యవేక్షణ (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) బాధ్యతలను జర్మనీకి చెందిన స్టియాగ్ ఎనర్జీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ సంస్థకు అప్పజెప్పింది. టెండర్ల ద్వారా ఈ కాంట్రాక్టు దక్కించుకున్న స్టియాగ్ ఎనర్జీతో సింగరేణి యాజమాన్యం తాజాగా ఒప్పందం కూడా కుదుర్చుకుంది. వాస్తవానికి ఈ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ జెన్కోకు అప్పగించాలని భావించినా... ఇటీవల జెన్కో పనితీరు దెబ్బతినడం, విద్యుత్ కేంద్రం నిర్వహణ కోసం షరతులు పెట్టిన కారణంగా.. ప్రైవేటు సంస్థవైపు సింగరేణి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జైపూర్‌లో 1,200 మెగావాట్ల (రెండు 600 మెగావాట్ల యూనిట్లు) థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సింగరేణి చేపట్టిన విషయం తెలిసిందే. తొలిసారిగా విద్యుదుత్పత్తి రంగంలో అడుగుపెట్టిన సింగరేణికి విద్యుత్ కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణలో అనుభవం లేదు. దీంతో ప్రాజెక్టు బాధ్యతలను స్టియాగ్కు అప్పగించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి మూడేళ్ల పాటు స్టియాగ్ సంస్థ నిర్వహణ, పర్యవేక్షణలో సింగరేణి ప్లాంటులో విద్యుదుత్పత్తి జరగనుంది. ఆ తర్వాత విద్యుత్ ప్లాంట్ నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను స్వయంగా చేపట్టాలని సింగరేణి భావిస్తోంది. నిర్వహణ, పర్యవేక్షణ అవసరాల కోసం ఆలోగా ఇంజనీర్లు, ఇతర సిబ్బందిని నియమించుకోనుంది. స్టియాగ్ ఎనర్జీ సంస్థ ప్రస్తుతం ఒడిశాలో 2,400 (4ఁ600) మెగావాట్ల వేదాంత థర్మల్ ప్లాంట్, 1,050 (2ఁ525) మెగావాట్ల హిందుజా థర్మల్ ప్లాంటు నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తోందని, అందుకే ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని సింగరేణి అధికార వర్గాలు పేర్కొన్నాయి. జెన్కోను కాదని... విద్యుదుత్పత్తి రంగంలో విశేష అనుభవమున్న రాష్ట్ర విద్యుత్ సంస్థ(జెన్కో)కే జైపూర్ విద్యుత్ ప్లాంట్ బాధ్యతలు అప్పగించాలని సింగరేణి యాజమాన్యం భావించింది. రెండు సంస్థల మధ్య ప్రాథమిక స్థాయిలో సమాలోచనలు సైతం జరిగాయి. ఆ ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ నిమిత్తం జెన్కో ఇటీవల దాదాపు 100 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసుకుంది కూడా. కానీ చివరకు ప్రైవేటు కంపెనీల వైపే సింగరేణి యాజమాన్యం మొగ్గు చూపింది. అయితే ఇటీవలి కాలంలో జెన్కో తన సొంత కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్వహణలో ఆపసోపాలు పడింది. ప్రారంభించిన కొద్దిరోజులకే 600 మెగావాట్ల కేటీపీపీ థర్మల్ విద్యుత్ కేంద్రం మరమ్మతులకు వచ్చింది. దీంతోపాటు జైపూర్ ప్లాంట్ నిర్వహణ కోసం జెన్కో షరతులు విధించడంతో ప్రైవేటు కంపెనీ వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందని సింగరేణి వర్గాలు వెల్లడించాయి. సొంత విద్యుత్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యత ఒత్తిడి నేపథ్యంలో జెన్కో సంస్థే వెనక్కి తగ్గిందని మరో అధికారి పేర్కొనడం గమనార్హం. 30న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం! ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ఈ నెల 30న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించాలని సింగరేణి భావిస్తోంది. ఇందుకోసం ప్రాజెక్టు పైలాన్‌తో పాటు హెలిప్యాడ్‌ను సైతం సిద్ధం చేసింది. ప్రాజెక్టులో 600 మెగావాట్ల తొలి యూనిట్ సింక్రనైజేషన్ ఇప్పటికే పూర్తయింది. మరో 600 మెగావాట్ల రెండో యూనిట్ సింక్రనైజేషన్‌ను ఈనెల 20-25 తేదీల మధ్య పూర్తి చేయాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే నెలలో రెండు యూనిట్ల నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రారంభోత్సవ కార్యక్రమంపై అధికారికంగా స్పందించేందుకు సింగరేణి వర్గాలు నిరాకరించాయి. -
'పనులు త్వరగా పూర్తిచేయాలి'
జైపూర్: అదిలాబాద్ జిల్లా జైపూర్ మండల కేంద్రానికి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను సింగరేణి సంస్థ సీ అండ్ ఎండీ ఎన్. శ్రీధర్ గురువారం పరిశీలించారు. ఈ నెలాఖరు వరకు మొదటి యూనిట్ సింక్రనైజేషన్ చేయనున్న నేపథ్యంలో పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన అధికారులకు సూచించారు. -
ఎన్టీపీసీలో సాంకేతిక సమస్య
రామగుండం ఎన్టీపీసీ ఏడవ యూనిట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం కలిగింది. లోపానికి సరిదిద్దడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏడవ యూనిట్ నిరంతరాయంగా 458 రోజుల పాటు విద్యుదుత్పత్తి చేసి ఇటీవలే రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.. -
రుణమొచ్చేసింది!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని దామరచర్ల మండలంలో నిర్మించతలపెట్టిన యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంటు విషయంలో కీలకమైన అడుగు పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.16,070 కోట్ల రుణాన్ని రూరల్ ఎలక్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) మంజూరు చేసింది. ఈ మేరకు చెక్కును కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆర్ఈసీ అధికారులు అందజేశారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థికపరమైన అడ్డం కులు తొలగినట్టేనని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలకమైన భూసేకరణ పనులు కూడా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమని గుర్తిం చిన 1690 ఎకరాల భూసేకరణకు అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూములు కోల్పోయే వారు మరోమారు పరిహారం కోసం ఆందోళనలు ప్రారంభించారు. ఆర్వోఎఫ్ఆర్ కింద పట్టాలున్న అటవీభూములు సాగులో లేకపోయినా తమకు పరిహారం చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తుండడం గమనార్హం. వడివడిగా అడుగులు.. ఆర్ఈసీ సహకారంతో దామరచర్ల మండలంలోని దిలావర్పూర్ అటవీ ప్రాంతంలో నిర్మించతలపెట్టిన 4,400 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం స్థానిక అధికార యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇక్కడ ప్రాజెక్టు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించిందే తడవుగా అప్పటి కలెక్టర్ చిరంజీవులు, ప్రస్తుత జేసీ ఎన్. సత్యనారాయణల నేతృత్వంలో మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు పర్యవేక్షణలో అటవీభూముల, ఇతర పట్టాభూముల గుర్తింపు ప్రక్రియను వారం రోజుల్లో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి అం దజేశారు. ఈ నివేదిక ఆధారంగా అటవీభూములకు పరి హారంగా ఇవ్వాల్సిన భూములను కూడా జిల్లా వ్యాప్తంగా గుర్తించి కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు కూడా పంపారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు 4,500 ఎకరాల అటవీభూమిని ఈ ప్రాజెక్టు కింద తీసుకునేందుకు అంగీకరించి, ఈ మేరకు జిల్లాలోని పలుచోట్ల ప్రభుత్వ భూములను కూడా అటవీశాఖ పరిధిలోనికి బదలాయించుకుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో జూన్ నెల లో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు వచ్చి యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంటుకు శంకుస్థాపన కూడా చేసి వెళ్లారు. ఈ నేపథ్యంలో పట్టా, ఉడాఫ్భూముల సేకరణకు స్థానిక అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఇప్పటికే 870 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రాథమిక నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మరో 920 ఎకరాలకు నోటిఫికేషన్ సిద్ధం చేస్తున్నామని అధికారులు చెపుతున్నారు. ఈ సేకరణ ప్రక్రియ పూర్తయితే ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగిరం కానున్నాయి. అయితే, ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయే వారికి కూడా ప్రభుత్వం తరఫున మంచి పరిహార ప్యాకేజీనే రూపొందించినా, పరిహారం ఎవరికి చెల్లించాలన్న విషయంలో మళ్లీ నిర్వాసితుల నుంచి ఆందోళనలు ఎదురవుతున్నాయి. తొలిదశలోనే ప్రతిఘటన వాస్తవానికి ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రకటించి భూములను సర్వే చేస్తున్నప్పుడే మండలంలోని దిలావర్పూర్ అటవీరేంజ్‌లో తమ భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులు ఆందోళనలు చేశారు. సర్వే జరగకుండా అడ్డుకున్నారు. అయితే, ప్రభుత్వ ఆలోచనను నిర్వాసితులకు, స్థానిక రాజకీయ పక్షాలకు వివరించిన జేసీ సత్యనారాయణ, ఆర్డీఓ కిషన్‌రావు అప్పట్లో సర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించగలిగారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ శంకుస్థాపనకు రావడానికి ముందు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు, జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డిలు కూడా స్థానికులను కలిసి ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజిని చెప్పి వారికి సర్దిజెప్పారు. అయితే, వారి వివరణకు సంతృప్తి చెందిన స్థానికులు కొంత సర్దుమణిగినా మళ్లీ ఆందోళనలు ప్రారంభించడం గమనార్హం. పరిహారంలో మెలిక.. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గాను కేంద్ర పర్యావరణ శాఖ 4,676 ఎకరాలు అటవీభూములను కేటాయించింది. ఇక, పట్టా భూములు 197.14 ఎకరాలు, ఉడాఫ్ పట్టా భూములు 159.01 ఎకరాలు, ప్రభుత్వ భూములు 116.26 ఎకరాలున్నాయి. వీటిల్లో పట్టా, ఉడాఫ్ భూములకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వగా, అటవీ, ప్రభుత్వ భూముల్లో నిర్వాసితులు ఎవరు కబ్జాలో ఉన్నారన్న వివరాలు వెల్లడించాల్సి ఉంది. పవర్ ప్లాంట్‌లో పరిధిలో అటవీ హక్కుల చట్టం కింద (ఆర్వోఎఫ్ఆర్) పట్టాలు పొందిన రైతుల వివరాలు తమ వద్ద లేవని, అటవీశాఖ వద్ద మాత్రమే ఉన్నాయని స్థానిక అధికారులు చెపుతున్నారు. పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగనున్న ప్రాంతంలో ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఉండి, సేద్యంలో ఉన్న భూములకు మాత్రమే నష్ట పరిహారం ఇస్తామని అంటున్నారు. అయితే, స్థానికులు మాత్రం సేద్యం చేయనప్పటికీ పట్టాలున్న రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ ఆర్వోఎఫ్ఆర్ కింద ఇచ్చిన అటవీ భూములకు సంబంధించి కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. సుమారు 100 ఎకరాల వరకూ ఓ మాజీ ప్రజా ప్రతినిధి కుటుంబ సభ్యుల కబ్జాలో ఉన్నాయని, వీటిలో కొన్నింటికి ఆర్వోఎఫ్ఆర్ కింద పట్టాలున్నాయని, మరో పార్టీకి చెందిన మండలాధ్యక్షుడి చేతిలో 20 ఎకరాల వరకు భూమి ఉందని, ఈ భూమి కింద పరిహారం పొందేందుకు బినామీల పేరిట ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పొందారని తెలుస్తోంది. ఈ విషయంలో స్థానిక రెవెన్యూ యంత్రాంగం కూడా రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్వోఎఫ్ఆర్ పట్టా భూముల విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోననే చర్చ స్థానికంగా జరుగుతోంది. -
థర్మల్ పవార్
పోలాకి:‘మీ అభివృద్ధి మాకొద్దు... మమ్మల్నిలా బతకనీయండి... చిన్న గ్రామాలని మాపై కక్ష గట్టారా?... మమ్ము పురుగులకంటే హీనంగా చూస్తారా... వంశధార నిర్వాసితులకు పరిహారం ఎలాగిస్తున్నారో చూడటంలేదా... ఏం సోంపేట, కాకరాపల్లిలో జరిగిన సంఘటనలు మరచిపోయారా...’ అంటూ పోలాకి మండలంలోని థర్మల్ పవర్‌ప్లాంట్ ప్రతిపాదిత ప్రాంత ప్రజలు నిలదీశారు. కలెక్టర్‌ను, ఎమ్మెల్యేపైనా విరుచుకుపడ్డారు. అసలు తమకు ప్లాంట్ ఒద్దే ఒద్దని నినదించారు. దీంతో అధికారులంతా అక్కడినుంచి నిష్ర్కమించారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తోటాడ పరిసరప్రాంతాల్లో దాదాపు 2500 ఎకరాల్లో జపాన్‌కు చెందిన సుమిటోమో కంపెనీ పెట్టుబడులతో నిర్మించ తలపెట్టిన థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మాణంపై జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రజాభిప్రాయసేకరణ రసాభాసగా మారింది. తొలుత కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవిభజన తరువాత పరిశ్రమలు అనివార్యమైన నేపధ్యంలో జిల్లా అభివృద్ధి జరగాలంటే ఇలాంటి ప్లాంట్లు అవసరమన్నారు. జిల్లాలో జపాన్ బృందం పరిశీలించిన నాలుగు ప్రాంతాల్లో పోలాకి అనువుగా వుండటంతో పాటు ఇక్కడ కేవలం 179 కుటుంబాలకే పునరావాసం కల్పిస్తే సరిపోతుందని అన్నారు. ఇక్కడి ప్రజలకు, రైతులకు మెరుగైన, సంతృప్తికరమైన నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ఒకప్రాంతప్రజలకు నష్టమే అయినప్పటికీ రాష్ట్ర అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాను సమర్థిస్తున్నానని తెలిపారు. ప్రజలుకూడా సహకరించి ప్లాంటు వద్దనటం కన్నా పరిహారం గూర్చి చర్చించుకోవాలని కోరడంతో ప్రజలంతా ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ ఎంపీపీ కరిమి రాజేశ్వరరావు, ప్రతిపాదిత ప్రాంత నాయకులు ముద్దాడ బైరాగినాయుడు, సంపతిరావు రామన్న, పాగోటి అప్పారావు, కోట అప్పారావు తదితరులు మాట్లాడుతూ అసలు తమప్రాంతంలో ప్లాంటు నిర్మాణమే వద్దంటే పరిహారం గూర్చి మాట్లాడటం దారుణమని అన్నారు. తమ గ్రామాలకు వచ్చి తమ కడుపుకోత తెలుసుకోవాలని కోరారు. రైతులనుంచి తీసుకున్న భూములకు బదులుగా వేరే చోట భూములు ఇస్తారా..? అని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంటు నిర్మాణానికి ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. ధ్వజమెత్తిన ప్రజాసంఘాలు జిల్లాలో ఇప్పటికే థర్మల్‌పవర్ ప్లాంట్లపై తీవ్రవ్యతిరేకతలు వ్యక్తమౌతున్నా ప్రభుత్వం మళ్ళీ దేశంలోనే అతిపెద్ద పవర్‌ప్లాంట్ జిల్లాలో చేపట్టాలని ఏకపక్షంగా పూనుకోవటంపై పలు ప్రజాసంఘాల నాయకులు కలెక్టర్ సమక్షంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. నాయకులు తమ స్వార్థంకోసం జిల్లాను ప్రయోగశాలగా మార్చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు వారిని మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ప్రజలు వారికి బాసటగా నిలిచి ధర్మల్ప్లాంటు వద్దంటే వద్దని నినాదాలు చేశారు. పరిస్దితి గమనించిన కలెక్టర్, ఎమ్మెల్యేలు ప్రజల అభిప్రాయాలను పూర్తిగా వినకుండానే అక్కడినుండి నిష్ర్కమించారు. అధికారపార్టీ అత్యుత్సాహం మండలంలోని ప్రతిపాదిత గ్రామాలకు చెందిన ప్రజలు, నాయకులు అభిప్రాయాలు తీసుకునే కార్యక్రమంలో ఆ గ్రామాలతో సంబంధంలేని అధికారపార్టీకి చెందిన కార్యకర్తలు, జన్మభూమి కమిటీ సభ్యులు ముందుగా వచ్చి కుర్చీలపై తిష్టవేశారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు అభివృద్ధి మంత్రాలు జపిస్తుంటే ముందుగా చప్పట్లతో అనుకూల వాతావరణం కల్పించే ప్రయత్నం చేశారు. అధికారపార్టీకి చెందిన నాయకుడు పల్లి సూరిబాబు అనుకూలంగా మాట్లాడటంతో ప్రతిపాదితప్రాంత గ్రామాల ప్రజలు ఒక్కసారిగా మండిపడ్డారు. ఓదిపాడు వద్ద కాన్వాయి అడ్డగింత ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా జరగకపోయినా అధికారులు, నాయకులు థర్మల్ప్లాంటు ప్రాంతం పరిశీలనకు వచ్చారు. అక్కడ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతుండగా ఓదిపాడు, సన్యాసిరాజుపేట గ్రామాలకు చెందిన మహిళలు, వృద్ధులు కలెక్టర్ కాన్వాయికి అడ్డంగా వచ్చారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిపైనా విరుచుకుపడ్డారు. అక్కడ కూడా పోలీసులు వారందనీ ప్రక్కకునెట్టి కాన్వాయి ముందుకుపోనిచ్చారు. జెన్కో ఈఈ కె.వి.వి.సత్యనారాయణమూర్తి, ఏడీఈ రాజ్‌కుమార్, శ్రీకాకుళం డీఎస్పీ భార్గవనాయుడు, ఎంపీపీ తమ్మినేని లక్ష్మీభూషణ్రావు, తహశీల్దార్ రామారావు, ఎంపీడీఓ లక్ష్మీపతి, సీఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ థర్మల్ సెగ
పోలాకి:ప్రశాంతంగా వున్న పోలాకి మండలంలో థర్మల్సెగలు రాజుకుంటున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మండల ప్రజలు మండిపడుతున్నారు. జపాన్‌కు చెందిన సుమిటెమో కంపెనీ నిర్మించ తలపెట్టిన నాలుగువేల మెగావాట్ల సామర్థ్యం గల ఆల్ట్రామెగా సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్‌ప్లాంట్‌పై గతంలో స్థానికుల నుంచి తీవ్రవ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై మండలకేంద్రంలో భారీర్యాలీలు నిర్వహించారు. అధికారులు, నాయకులకు వినతిపత్రాలు కూడా అక్కడి ప్రజలు, పలు రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల నాయకులు అందజేశారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్లాంటు నిర్మాణంపై ఆ కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ప్రతిపాదిత గ్రామాల్లో ప్రజలు మళ్లీ ఆందోళనలో పడ్డారు. కొన్నాళ్లుగా ప్రశాంతంగా వున్న ప్లాంట్ నిర్మాణం ఇక తప్పదన్నట్లు సంకేతాలు స్పష్టంగా రావటంతో మళ్ళీ థర్మల్ వ్యతిరేక ఉద్యమం పోలాకి మండలంలో పెద్ద ఎత్తున రాజుకోనున్నట్లు కన్పిస్తోంది. ఇప్పటికే ప్రతిపాదిత గ్రామాలైన తోటాడ, చీడివలస, కొండలక్కివలస, గంగివలస, సన్యాసిరాజుపేట, ఓదిపాడు, గవరంపేట, చెల్లాయివలస, దీర్ఘాశి, కుసుమపోలవలస, కోరాడలచ్చయ్యపేటల్లో దాదాపు 2500 ఎకరాల భూములు గుర్తించి రెవెన్యూ అధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు సమాచారం. ఇదే జరిగితే అక్కడ సారవంతమైన భూములు రైతులు కోల్పోవ టంతో పాటు, పర్యావరణానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని పలువురు పర్యావరణ ప్రేమికుల వాదన. దీనిపై అప్పట్లో స్థల పరిశీలనకు వచ్చిన జపాన్ బృందం ఆ తరువాత అక్కడ ప్రాథమిక సర్వే ద్వారా నేలస్వభావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతానికి వచ్చి ఏపీ జెన్కో అధికారులను ప్రజలు అడ్డుకున్నారు. అక్కడినుంచి వారిని వెళ్లగొట్టి తమవ్యతిరేకతను స్పష్టపరిచారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీతో పాటు, సీపీఐ, సీపీఎం తదితర అన్ని రాజకీయ పార్టీలు అక్కడి ప్రజలకు అండగా నిలిచాయి. తాజాగా మళ్లీ తెరపైకి వచ్చిన థర్మల్ ప్రతిపాదనపై అక్కడి ప్రజలు, నాయకులు ఏవిధంగా తమ అభిప్రాయాలు వ్యక్తపరచనున్నారో అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. -
ముహూర్తం ఓకే
ఈనెల 8న సాయంత్రం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన అదే రోజు నక్కలగండి, వాటర్‌గ్రిడ్ పైలాన్‌కు కూడా.. నల్లగొండలో భారీ బహిరంగసభ పవర్‌ప్లాంటు నిర్వాసితులతో భేటీ అయిన మంత్రి జగదీశ్‌రెడ్డి (సాక్షి ప్రతినిధి, నల్లగొండ): ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. దామరచర్ల మండలం దిలావర్పూర్ అటవీరేంజ్‌లో భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) సహకారంతో నిర్మించతలపెట్టిన 4వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు ఈనెల 8వ తేదీన సాయంత్రం 4:40 నిమిషాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంటుకు ఇప్పటికే పలుమార్లు శంకుస్థాపనల తేదీలను ప్రకటించినా అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని, ఈనెల 8న శంకుస్థాపన ము హూర్తంఖరారైందని అధికార వర్గాలు తెలిపాయి. అదే రోజు నక్కలగండి ప్రాజెక్టు, చౌటుప్పల్‌లోని వాటర్‌గ్రిడ్ పైలాన్‌కు కూడా సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో జిల్లాకు రానున్నారు. తొలుత దామరచర్లలో శంకుస్థాపన అనంతరం నక్కలగండి ప్రాజెక్టుకు సాయంత్రం 5:20 నిమిషాలకు, ఆ తర్వాత చౌటుప్పల్‌లో సాయంత్రం ఆరుగంటలకు వాటర్ గ్రిడ్ పైలాన్‌ను ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం రోడ్డు మార్గంలో నల్లగొండకు వచ్చి ఎన్జీ కళాశాల మైదానంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల కోసం అటు అధికార యం త్రాంగం, ఇటు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంచి ప్యాకేజీ ఇచ్చే యోచన దామరచర్ల పవర్‌ప్లాంటు నిర్మాణం కారణంగా నిర్వాసితులయ్యే వారికి, భూములు కోల్పోయే వారికి మంచి ప్యాకేజీ ఇచ్చే యోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు చెపుతున్నాయి. ఇదే విషయమై స్థానికులతో చర్చించేందుకు మంగళవారం మం త్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కరరావు, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, జేసీ సత్యనారాయణతో కలిసి దామరచర్ల మండలంలో పర్యటించారు. మోదుగుల తండా, కప్పూరి తండాలలో గిరిజనులతో కలిసి ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్వాసితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ కూడా నిర్వాసితుడేనని, మిడ్‌మానేరు ప్రాజెక్టు కింద కేసీఆర్ గ్రామం మునిగిపోవడంతో ఆయన కుటుం బం చింతమడకకు వెళ్లిందని చెప్పారు. ఓ నిర్వాసితుడిగా, ఓ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అందరికీ న్యాయం చేస్తారని చెప్పారు. అయితే కొత్త భూసేకరణ చట్టం అమలు రాష్ట్రంలో దామరచర్ల నుంచే చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 1710 ఎకరాల భూములు కోల్పోయే వారికి మార్కెట్ ధర కన్నా మూడు రెట్ల నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఇళ్లు కోల్పోయేవారికి పరిహారంతో పాటు కొత్త ఇల్లు క ట్టిస్తామని, ఇల్లు మారేందుకు గాను రూ.50వేలు ఇస్తామని, అనంతరం నెలకు రూ.3వేల చొప్పున 12 నెలల పాటు ఖర్చులు చెల్లిస్తామని, ఇల్లు పూర్తయిన అనంతరం వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద మరో 50వేల రూపాయలు ఇస్తామని కలెక్టర్ నిర్వాసితులకు వివరించారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఆందోళనలను కూడా సర్దుమణిగేలా చేసి సీఎం శంకుస్థాపన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించే దిశలో అధికార యంత్రాంగం పనిచేయనుంది. నాలుగేళ్లలో పూర్తి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు పేరుతో నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు బీహెచ్ఈఎల్తో రూ.17950 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ఇటీవలే ఒప్పందం కూడా కుదుర్చుకుంది. మొత్తం నాలుగు వేల మెగావాట్లకు గాను 800 మెగావాట్ల చొప్పున 5 టర్బైన్లను నిర్మించనున్నారు. మొదటి రెండు టర్బైన్లను మూడేళ్లలో, మిగిలిన మూడు టర్బైన్లను నాలుగేళ్లకాలంలో నిర్మించేలా ప్రణాళికలు తయారయ్యాయి. ఒక్కో మెగావాట్‌కు 4.8 కోట్ల రూపాయల చొప్పున వ్యయం చేయనున్నారు. -
జనవరి నాటికి జైపూర్ ప్లాంట్‌ను సిద్ధం చేయాలి
నిర్మాణ కంపెనీలతో సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ సమీక్ష గోదావరిఖని: సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను 2016 జనవరి నాటికి పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. గురువారం ఆయన సింగరేణి అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులపై హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జైపూర్ ప్లాంట్ ప్రధాన నిర్మాణ సంస్థ అయిన బీహెచ్ఈఎల్ చేపడుతున్న పనులను అంశాల వారీగా సమీక్షించారు. యూనిట్-1లో బాయిలర్ లైటప్ జూన్‌లో, యూనిట్-2లో జూలైలో జరుగనున్న స్విచ్ యార్డు పనులు మరింత వేగవంతం చేయాలని, రెండో యూనిట్లో మందకొడిగా సాగుతున్న సివిల్ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యాలన్స్ ఆఫ్ ప్లాంట్ పనుల నిర్మాణ ఏజెన్సీ ‘మెక్‌నెల్లి భారత్’తో చిమ్నీ పనుల గురించి చర్చించారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న సివిల్ పనుల్లో వంద క్వార్టర్ల నిర్మాణం, శ్రీరాంపూర్ నుంచి పవర్ ప్లాంటు వరకు రోడ్డు వెడల్పు పనులు, శ్రీరాంపూర్ ఓసీ నుంచి పవర్ ప్లాంటు వరకు జరగాల్సిన రైల్వే లైన్ పనులపై ఆయన సమీక్షించారు. వీటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రానున్నది వర్షాకాలం కనుక.. సివిల్ పనులను రాత్రి వేళల్లోనూ కొనసాగించాలన్నారు. ఇందుకు అవసరమైన సిబ్బందిని, లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. -
విద్యుత్ రంగంలో స్వావలంబనే ధ్యేయం
- కోల్ఇండియాలో భాగస్వామ్యంపై ఆప్ సర్కార్ చర్చలు - ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలుతో ప్రభుత్వంపై భారం - 2017 నాటికి డిమాండ్ 8,700 మెగావాట్లకు చేరుతుందని అంచనా సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ రంగంలో ఢిల్లీ నగరం ఇతరులపై ఆధారపడకుండా తన కాళ్లపై నిలబడేలా ఆప్ సర్కార్ చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా కోల్ ఇండియా లిమిటెడ్ ఒడిశాలోని సుందర్‌గడ్ జిల్లాలో ఏర్పాటుచేయనున్న థర్మల్‌పవర్ ప్లాంటులో భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది. ఈ 1,600 మెగావాట్ల ప్లాంటులో భాగస్వామిగా మారడం వల్ల విద్యుత్తు కోసం ఇతరులపై ఆధారపడవలసిన అవసరం తగ్గుతుందని ఆప్ భావిస్తోంది. ఈ విషయమై ఆప్ సర్కారు కోల్ ఇండియా లిమిటెడ్ అధికారులతో చర్చలు జరుపుతోంది. అయితే ఈ విషయంపై ఇంతవరకు నిర్ణయం వెలువడలేదు. విద్యుత్ రంగంలో ఢిల్లీకి స్వావలంబన కల్పిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి రావడం వల్ల ఢిల్లీ ప్రభుత్వంపై అధిక భారం పడుతోంది. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసినట్లయితే నగర వాసులకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేయవచ్చని ఆప్ సర్కారు భావిస్తోంది. ఇందుకోసం బొగ్గు బ్లాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు ఇతరులతో కలిసి విద్యుదుత్పాదన ప్లాంట్లు ఏర్పాటుచేయడానికి ఆసక్తి చూపుతోంది. కోల్‌బ్లాక్‌ను మంజూరుచేయాలని కోరుతూ ఢిల్లీ సర్కారు కేంద్రానికి ఇప్పటికే లేఖలు రాసింది. దీంతో పాటు కోల్ ఇండియా లిమిటెడ్‌తో కలిసి సుందర్‌గడ్ జిల్లాలో థర్మల్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేయాలనుకుంటోంది. రాజధానిలో విద్యుత్ డిమాండ్ 2017 నాటికి 8,700 మెగావాట్లకు చేరుతుందని కేంద్ర విద్యుత్ అథారిటీ అంచనా. గతేడాది నమోదైన పీక్ విద్యుత్ డిమాండ్ 5,925 మెగావాట్లు కాగా ఈ సంవత్సరం అది 6,500 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని విద్యుతుత్పాదన కేంద్రాల ద్వారా 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. నగరానికి సరఫరా అయ్యే విద్యుత్‌లో దాదాపు 70 శాతం బయటి నుంచి కొనుగోలు చేస్తున్నారు. -
జపాన్ తప్ప జనం అక్కర్లేదా?
పోలాకి: పచ్చని ప్రాంతాల్లో థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టి ప్రజల నోట్లో బుగ్గిపోసే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు జపాన్, సింగపూర్లు తప్ప ఇక్కడి జనం కనిపించరా?.. వారి ఆవేదన వినిపించదా? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రశ్నించారు. బుధవారం పోలాకి మండలంలోని థర్మల్ ప్రతిపాదిత గ్రామాల్లో ఆయన పర్యటించారు. మందుగా సన్యాసిరాజుపేట ప్రాంతంలోని భూములను పరిశీలించారు. వాటి వివరాల గురించి స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తోటాడ, చెల్లాయివలస, చీడివలస తదితర గ్రామాల్లో ఏర్పాటుచేసిన సభల్లో మాట్లాడుతూ ఇప్పటికే పైడిభీమవరంలో రసాయన, ఫార్మా కంపెనీలు పెట్టి కాలుష్యప్రాంతంగా మార్చిన పాలకులు ఇప్పుడు సోంపేట, కాకరాపల్లి, పోలాకి ప్రాంతాలను థర్మల్ ప్లాంట్లతో కాలుష్య కసారాలుగా మర్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పారిశ్రామికాభివృద్ధి పేరుతో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను ప్రయోగశాలగా మార్చుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉత్తరాంధ్రకు ఇస్తామన్న ప్యాకేజీల విషయంలో ఇక్కడి ప్రజాప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలన్నారు. అంగన్వాడీ వర్కర్లు, యానిమేటర్లు, మధ్యాహ్న భోజన పధక నిర్వాహకుల డిమాండ్లు తీర్చటం చేతకాని చంద్రబాబుకు సింగపూర్ ప్లాన్లు ఎందుకని ఎద్దేవావేశారు. ఎలాంటి ఉద్యమ నేపథ్యంలేని పోలాకి ప్రాంతంలో ప్రజల ఆశాంతిని అర్థం చేసుకుని థర్మల్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శి బవిరి క్రిష్ణమూర్తి మాట్లాడుతూ థర్మల్ ప్రతిపాదనను విరమించుకోకపోతే సోంపేట, కాకరాపల్లిలకు మించిన ఉద్యమాన్ని ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటియూ నాయకుడు ఆర్.సురేష్‌బాబు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు టి.తిరుపతిరావు, గొల్లలవలస సర్పంచ్ ప్రతినిధి పంచిరెడ్డి సింహాచలం, థర్మల్ వ్యతిరేక ఉద్యమ నాయకులు కోట అప్పారావు, ఉప్పాడ శాంతారావు, అలిగి రామారావు తదితరులు పాల్గొన్నారు. -
థర్మల్ కుంపటి మాకొద్దు
పలాస: థర్మల్ ప్లాంట్ పేరుతో సోంపేట, కాకరాపల్లి సంఘటనలను పునరావృతం చేయవద్దని వివిధ ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో ఆదివారం రౌండు టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ ఉద్దానంలో పవర్ ప్లాంటు ఏర్పాటు ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని, కిడ్నీ వ్యాధి బాధితుల కోసం ఉద్దానంలో డయాలిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్దానం ప్రాజెక్టు ద్వారా క్రమం తప్పకుండా మంచినీరు సర ఫరా చేయాలని, బహుళజాతి కంపెనీలతో ప్రభుత్వాలు కుదుర్చుకున్న అన్ని రకాల ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండు చేశారు. గతంలో ప్రతిపక్ష నాయకునిగా ఈ ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు థర్మల్ ప్రాజెక్టులను వ్యతిరేకించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ఒప్పందాలు రద్దు చేయకపోగా కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకోవడం దారుణమన్నారు. ప్రశాంత ఉద్దానంలో విధ్వంసకర పరిశ్రమలను పెట్టడాన్ని విరమించుకోవాలన్నారు. థర్మల్ ప్రాజెక్టును పెట్టాలని ప్రయత్నిస్తే ఇక్కడి ప్రజలు ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. జీవితాలపై తీవ్రప్రభావం చూపే ప్లాంట్‌ను అడ్డుకోవడానికి ప్రజలంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు ఎస్.వీరాస్వామి, పి.నారాయణరావు, పౌరహక్కుల సంఘం నాయకుడు పత్తిరి దానేసు, ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకుడు పుచ్చ దుర్యోధన, ప్రజా కళామండలి నాయకుడు జుత్తు శంకర్, అమరుల బంధుమిత్రుల సంఘం నాయకుడు జోగి కోదండరావు, టెక్కలి డివిజన్ రైతాంగ సాధన క మిటీ నాయకుడు దాసరి శ్రీరాములు, కుల నిర్మూలన కమిటీ నాయకుడు మిస్క క్రిష్ణయ్య, డీటీఎఫ్ నాయకుడు కె.ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. -
‘పవరే’ పరమార్థమా!
ఎచ్చెర్ల, పొందూరు:థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన ఎస్ఎంపురం-ధర్మపురం, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌ల చుట్టూనే తిరుగుతోంది. జపాన్‌కు చెందిన సుమితొమొ సంస్థ, జెన్కోలు కలిసి ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ కోసం సోంపేట, పలాస, పోలాకి ప్రాంతాల్లోనూ భూములను పరిశీలించినా.. ఎస్.ఎం.పురం-ధర్మపురం ప్రాంతాల్లో ఏర్పాటుకే సుమితొమొ ఆసక్తి చూపుతోందని విప్ ఏకపక్షంగా చెప్పిడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఈ నాలుగు ప్రాంతాలను పరిశీలించేందుకు ఆ సంస్థ ప్రతినిధి బృందం జిల్లాకు నేడో రేపో రావాల్సి ఉంది. ఈ విషయాన్ని పట్టించుకోకపోగా ఇక్కడ అవసరమైన భూములు అందుబాటులో ఉన్నాయని కూన ప్రకటించడంపై నిరసన వ్యక్తమవుతోంది. పట్టు కోసమేనా..? : కాగా ఎస్.ఎం.పురం ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉండగా, ధర్మపురం ఆమదలవలస నియోజకవర్గ పరిధిలోని పొందూరు మండల ంలో ఉంది. ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకట్రావు ప్రమేయం లేకుండానే ఆమదలవలస ఎమ్మెల్యే అయిన రవికుమార్ ఈ ప్రాంతాల్లో పలుమార్లు పర్యటించి స్థలాలు పరిశీలించారు. తాజాగా ఆదివారం కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహంతో కలిసి మరోసారి పరిశీలించారు. ఎస్.ఎం.పురం ఏపీ గురుకుల పాఠశాలలో ఇదే అంశంపై వారిద్దరూ రెవెన్యూ అధికారులతో సమీక్ష జరిపినా అదే గ్రామానికి చెందిన జెడ్పీ చైర్పర్సన్ చౌదిరి ధనలక్ష్మికి గానీ, స్థానిక సర్పంచ్ అయిన ఆమె కుమారుడు చౌదిరి అవినాష్‌కు గానీ సమాచారం లేదు. భూములెక్కడ..? పోనీ విప్ చెబుతున్నట్లు భూములు అందుబాటులో ఉన్నాయా అంటే.. అదీ లేదు. ప్రాజెక్టుకు 2600 ఎకరాలు అవసరమని నిర్ణయించగా ఎచ్చెర్ల పరిధిలో ఎస్సీ రైతులకు పట్టాలుగా ఇచ్చిన 75 ఎకరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎస్.ఎం.పురం పరిధిలో 122 సర్వే నెంబర్లో 790 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉండగా.. అందులో 130 ఎకరాలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి, 50 ఎకరాలు 21వ శతాబ్ది గురుకులానికి, 100 ఎకరాలు రాజీవ్ స్వగృహకు, 20 ఎకరాలు ఏపీ గురుకుల పాఠశాలకు ఎప్పుడో కేటాయించారు. మిగిలింది నిర్మాణాలకు సైతం పనికి రాని కొండ ప్రాంతమే. ఇక పొందూరు మండలం ధర్మపురంలో కూడా ఎస్సీ రైతులకు పట్టాలు ఇచ్చిన సుమారు 200 ఎకరాల భూములే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే రైతుల నుంచి తీసుకోక తప్పదు. ప్రస్తుతం ఇక్కడ ఎకరా ధర రూ.15 లక్షల నుంచి రూ. 20 లక్షలు ఉండగాఅధికారులు మాత్రం రూ.5 లక్షలే ఉందని అంటున్నారు. ప్రభుత్వ విప్ మాత్రం తుళ్లూరు ప్రాంతంలా ఇక్కడి రైతులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయి పోతారని, ఇంటికో ఉద్యోగం సైతం వచ్చేస్తుందని త్రిశంకు స్వర్గం చూపిస్తున్నారు. అధికారుల కోణం మరోలా ఉంది. ఈ ప్రాంతం పొందూరు రైల్వేస్టేషన్‌కు, సముద్రతీరానికి దగ్గరగా ఉండటంతో పాటు ప్రాజెక్టుకు మడ్డువలస ప్రాజెక్టు నీరు అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో దీని వైపు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. వీరందరి ఆలోచనలు, పట్టుదలలు ఎలా ఉన్నా గ్రామాలు, పంట భూములను కాలుష్య కోరల్లోకి నేట్టే పవర్ ప్లాంట్ వద్దే వద్దని ఆందోళనలు ప్రారంభించారు. పట్టాలు లాక్కుంటే ప్రతిఘటిస్తాం ప్రభుత్వం థర్మల్ పవర్ ప్లాంట్ ఆలోచన విరమించుకోవాలి. పంట భూములను పనికిరాని భూములని అనటం ప్రభుత్వ విప్‌కు తగదు. పట్టాలు లాక్కోవాలని చూస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదు. - గుడివాడ కుప్పయ్య, బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జి కాలుష్య కోరల్లోకి నెట్టొద్దు ప్రభుత్వం గతంలో 112 సర్వే నెంబర్లో ఎస్సీ విలాంగులకు భూమి పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు లాక్కోవాలని చూస్తే సహించేది లేదు. గ్రామాలను కాలుష్య కోరల్లోకి నెట్టే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి. -ఎ.అప్పారావు, దళిత నాయకుడు -
థర్మల్.. వేగిరం
నల్లగొండ టుటౌన్ : దామరచర్ల మండలం వీర్లపాలెం, దిలావర్పూర్ గ్రామాల మధ్య ఏర్పాటుచేయనున్న థర్మల్‌పవర్ ప్లాంట్ పనులను జిల్లాయంత్రాంగం వేగవంతం చేసింది. నిన్నమొన్నటిదాకా భూ సర్వే చేపట్టిన అధికారులు నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. భూ సేకరణలో ఎక్కువగా అటవీ భూములు ఉండడంతో ముందుగా వాటిని అటవీయేతరులుగా మార్చే పనిలో పడ్డారు. వీటిపై ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అందరితో తీర్మానం ఆమోదించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ సత్యనారాయణరెడ్డి శుక్రవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, వీఆర్ఓలతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.అటవీ భూములను అటవీయేతర భూములుగా మార్చడానికి గ్రామసభలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దామరచర్ల మండలంలో ప్రభుత్వం థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రతిపాదించిందని, దీనికి సంబంధించి మండలంలోని 12 గ్రామాలలో దాదాపు 10 వేల 700ల ఎకరాలలో భూ సేకరణ సర్వే కూడా పూర్తయిందన్నారు. అందువల్ల అక్కడి అటవీ భూములను అటవీయేతర భూములుగా మార్చడానికి శనివారం నుంచి గ్రామసభలు నిర్వహించాలన్నారు. అధికారులు 12 గ్రామాలకు టీములుగా బయలుదేరి వెళ్లి గ్రామసభలు నిర్వహించి తీర్మానంపై గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంతకాలు తీసుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారుల పర్యవేక్షణలో టీమ్ లీడరుగా వ్యక్తిగత శ్రద్ధ చూపాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఈ విషయాన్ని గ్రామస్తులకు వివరించి వారి సందేహాలను నివృత్తి చేసి ప్రతిపాదనలు పంపాలని కోరారు. 12 మంది తహసీల్దార్లను 12 గ్రామాలకు టీమ్ లీడర్లుగా నియమించామన్నారు. వీఆర్ఓ, అటవీ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను 12 గ్రామాలకు కేటాయించి 17వ తేదీ ఉదయం 10 గంటలకు గ్రామాలకు చేరుకుని నిర్దేశించిన పనిని పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో జేసీ సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, డీఆర్ఓ నిరంజన్, మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ప్లాంట్‌పై గ్రామసభలు దామరచర్ల : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మండలంలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ పవర్ ప్రాజెక్టు పై శనివారం పలుగ్రామాల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఆర్డీఓ కిషన్‌రావు తెలిపారు. మండలంలోని అటవీభూములు కలిగి ఉన్న వీర్లపాలెం, కొండ్రపోల్, దిలావర్పూర్, కల్లెపల్లి, నర్సాపురం, ముదిమాణిక్యం, వాచ్యతండా, కేజేరెడ్డి కాలనీ, బాలాజీనగర్, తి మ్మాపురం గ్రామాల్లోని గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గ్రామసభలకు తనతోపాటు తహసీల్దార్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వీఆర్ఓలు హాజరు కానున్నట్లు తెలిపారు. -
సింగరేణి భూముల
లీజు గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: గోదావరి తీరంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థకు ఇచ్చిన భూముల లీజు గడువును మరో 20 ఏళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 23,953 హెక్టార్ల భూమి లీజు గడువు ముగిసిన నేపథ్యంలో తాజా ఉత్తర్వుల ద్వారా సింగరేణి సంస్థకు మరో 20 ఏళ్ల పాటు బొగ్గును ఉత్పత్తి చేసే వెసులుబాటు కల్పించినట్లయింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధనశాఖ సోమవారం జీవో 1,2,3 లను విడుదల చేసింది. సింగరేణి ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమితో పాటు అటవీశాఖకు చెందిన భూములకు కూడా ఈ సందర్భంగా లీజు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో 26.44 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 6,848 హెక్టార్ల భూమి లీజు గడువు గత డిసెంబర్‌తో ముగిసిన నేపథ్యంలో సింగరేణి సంస్థ కోరిక మేరకు జనవరి ఒకటో తేదీ నుంచి 20 ఏళ్లపాటు లీజును పొడిగించారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 62.88 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 12,611 హెక్టార్ల భూమి లీజు గడువు కూడా ముగిసిన నేపథ్యంలో ఈ భూమికి కూడా 20 ఏళ్ల వరకు లీజు కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. యుద్ధప్రాతిపదికన పనులు జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సింగరేణి చైర్మన్, ఎండీ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ప్లాంటు నిర్మాణ పురోగతిపై ఇక్కడి సింగరేణిభవన్‌లో సోమవారం సమీక్ష జరిగింది. వచ్చే నవంబర్ నాటికి ప్లాంటు నిర్మాణం పూర్తి చేసి విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామని సింగరేణి యాజమాన్యం సీఎంకు నివేదించిన నేపథ్యంలో పనుల వేగం పెంచేందుకు ఈ సమీక్ష నిర్వహించారు. నీరు, బొగ్గు సరఫరా, రోడ్ల విస్తరణ వంటి అంశాలపై ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్, మెక్నల్లీ భారత్ కంపెనీల ఇంజినీర్లతో చర్చించారు. -
రాజుకుంటున్న థర్మల్ కుంపటి
పొందూరు:పొందూరు-ఎచ్చెర్ల మండలాల సరిహద్దులో థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలన్న ప్రతిపాదన ఆ ప్రాంతంలో ఉద్యమ కుంపటి రాజేస్తోంది. స్థలపరిశీలనకు జపాన్‌కు చెందిన సుమిటోమో సంస్థ ప్రతినిధులు రానున్నారన్న వార్తలతో కలవరపాటుకు గురైన స్థానికులు థర్మల్ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆదివారం ముక్తకంఠంతో నినదించారు. పొందూరు మండలం తోలాపి సత్యసాయి సేవా మందిరం వద్ద ధర్మపురం, పిల్లలవలస, దళ్లవలస, తోలాపి, కనిమెట్ట గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, రైతులు సమావేశమయ్యారు. ఈ గ్రామాల పరిధిలోనే సుమారు 2 వేల ఎకరాల్లో థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించడంపై వారంతా చర్చించారు. ఈ ప్రాజెక్టు వల్ల త మ గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పంట భూము లు నాశనమవుతాయని, వ్యవసాయం కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ప్రతిపాదనకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. తమ మనోభావాలను పట్టించుకోకుండా ప్రాజెక్టు ఏర్పాటుకే నిర్ణయిస్తే ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పంట భూముల్లో థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ ప్రతినిధి సువ్వారి గాంధీ, గురుగుబెల్లి మధుసూదనరావు, పప్పల దాలినాయుడు, పప్పల అప్పలనాయుడు, యతిరాజుల జగన్నాథం, చల్లా ముఖలింగం, బొనిగి రమణమూర్తి, గురుగుబెల్లి శ్రీరామ్మూర్తి, పాత్రుని శ్రీనివాసరావు, మొదలవలస మురళీ, పాపారావు, వావిలపల్లి తిరుమలరావు, వజ్జాడ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కింతలి, కనిమెట్ట, తోలాపి, దళ్లవలస గ్రామాల్లో చాలావరకు నారాయణపురం కాలువ ద్వారా పంటలు పండిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వీఆర్‌గూడెం, తండ్యాం, రాపాక, పొందూరు, తోలాపి, కింతలి, కనిమెట్ట, పిల్లలవలస, ధర్మపురం, బురిడి కంచరాం, ఎస్ఎంపురం పరిధిలోని పలు గ్రామాల్లో మెట్టు భూములను సస్యశ్యామలం చేసేందుకు రూ. 47 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో ఇప్పటికే అరిణాం అక్కివలస డిస్ట్రిబ్యూటరీ నిర్మించి నీరు విడుదల చేశారు. ధర్మపురం డిస్ట్రిబ్యూటరీ పనులు చిన్న ఇబ్బందుల కారణంగా నిలిచిపోయాయి. వీటిని మళ్లీ చేపట్టేందుకు మడ్డువలస ప్రాజెక్టు అధికారులు సిద్ధమవుతున్న తరుణంలో థర్మల్ ప్రతిపాదన పిడుగుపాటులా రైతులను తాకింది. పచ్చదనం పోతుంది థర్మల్ ప్రాజెక్టుతో పచ్చదనం కనుమరుగవుతుంది. గాలి విషతుల్యమవుతుంది. ఈ ప్రాంతం ఏడారిగా మారిపోతుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గిపోతాయి. వేసవికాలంలో రెట్టింపు స్ధాయిలో పెరిగిపోతాయి. -గురుగుబెల్లి మధుసూదనరావు, విశ్రాంత ప్రిన్సిపాల్ థర్మల్ ప్రతిపాదన విరమించాలి థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలి. వ్యవసాయాన్నే నమ్ముకొని బతుకుతున్నాం. భూమి సారం దెబ్బతింటాయి. రైతు శ్రేయస్సే ధ్యేయమని చెబుతున్న ప్రభుత్వం పంట భూముల్లో పవర్ ప్రాజెక్టు పెట్టడం అన్యాయం. - చల్లా ముఖలింగం, సర్పంచ్, ధర్మపురం ప్రాణాలైనా అర్పిస్తాం... ప్రాణాలు అర్పించైనా పవర్ ప్రాజెక్టు ప్రతిపాదనను అడ్డుకుం టాం. సోంపేట, కాకరాపల్లి పోరాటాల స్ఫూర్తితో ఇక్కడా ఉద్యమాలుచేపడతాం. రైతాం గాన్ని, పంట భూములను కాపాడుకుంటాం. అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ మంటలు రేపడం తగదు. -సువ్వారి గాంధీ, ఎంపీపీ ప్రతినిధి, వీఆర్‌గూడెం -
‘థర్మల్’ సర్వే బృందానికి చుక్కెదురు
మొదటిరోజే అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు పురుగుమందు డబ్బాలతో మహిళల ధర్నా దామరచర్ల: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ శివారులో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన 7,500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ పవర్‌ప్లాంట్ భూసేకరణ సర్వేకు వెళ్లిన అధికారులకు మొదటిరోజే చుక్కెదురైంది. శుక్రవారం మండలానికి వచ్చిన అధికారుల బృందాన్ని తాళ్లవీరప్పగూడెం, మోదుగులకుంట తండా గ్రామస్తులు అడ్డుకున్నారు. మహిళలు పురుగు మందు డబ్బాలతో ధర్నాకు దిగారు. ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్‌ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన భూమిని ఏరియల్ సర్వే చేశారు. అనంతరం మండలంలోని ఏడు గ్రామాల పరిధిలో 9 వేల ఎకరాల్లో ప్లాంట్ నిర్మాణం చేపడుతామని, అందుకు త్వరలో భూసేకరణ జరుగుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాళ్లవీరప్పగూడెం గ్రామ రైతులకు కంటి మీద కునుకులేదు. గ్రామానికి చెందిన పేద రైతులు తుంగపాడు బందం వెంట ఫారెస్ట్, ప్రభుత్వ భూమి సుమారు వెయ్యి ఎకరాల మేర సేద్యం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ప్లాంట్ నిర్మాణంలో భాగంగా ఈ భూములు పోనున్నాయి. మోదుగుకుంటతండా గిరిజనులది కూడా ఇదే పరిస్థితి. దీంతో ఆయా గ్రామాలవాసులు సీఎం ప్రకటన నాటినుంచి కొంత ఆందోళనగా ఉన్నారు. అధికారుల బృందం భూమిని సర్వే చేసేందుకు మొదట తాళ్లవీరప్పగూడానికి చేరుకున్నారు. వారిని గ్రామరైతులు, స్థానికులు అడ్డుకున్నారు. థర్మల్ పవర్‌ప్లాంట్ పేరుతో జీవనాధారమైన భూములను లాక్కుంటే తమ బతుకుదెరువు ఏమిటని పలువురు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలు బజారున పడతాయని వాపోయారు. తమ భూములు తీసుకుంటే చావేగతని పురుగుమందు డబ్బాలు ఎత్తారు. ప్రభుత్వం సమస్య పరిష్కరించేవరకు ఇక్కడినుంచి కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు. ప్రతి రైతుకు పరిహారం సర్వేలో ఉన్న మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. విద్యుత్ ప్లాంట్ నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారంతోపాటు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. కేవలం భూమి సర్వే చేసినంత మాత్రాన జరిగే నష్టం ఏమీ ఉండదని నచ్చజెప్పారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. -
థర్మల్ పవర్ ప్లాంట్‌కు నేటినుంచి భూ సర్వే
దామరచర్ల : దామరచర్ల మండల పరిధిలో నిర్మించతలపెట్టిన 7500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ భూసేకరణ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు రంగం సిద్ధం చేశారు. భూ సర్వే కోసం కలెక్టర్ చిరంజీవులు 21 బృందాలను నియమించారు. ఈ మేరకు అధికారుల బృందాలు శుక్రవారం నుంచి ఐదు రోజులపాటు మండలంలోని ముదిమాణిక్యం, కొండ్రపోల్, కల్లెపల్లి, దిలావర్పూర్, నర్సాపురం, తాళ్లవీరప్పగూడెం, వీర్లపాలెం గ్రామాల పరిధిలో గల ఫారెస్టు భూములు సర్వే చేయనున్నారు. ప్రాజెక్టు కావాల్సిన 9వేల ఎకరాలను సేకరించనున్నారు. బృందంలో ఉండేది వీరే.. సర్వే కోసం నియమించిన 21 బృందాలు విడిపోయి ఒక్కో గ్రామాన్ని పరిశీలిస్తారు. ఒక్కో బృందంలో డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు సర్వేయర్లు, వారికి సహాయకులుగా ఒక వీఆర్ఓ, వీఆర్ఏ ఉంటారు. ప్రతి రెండు బృందాల పనితీరును పరిశీలించేందుకు తహసీల్దార్‌ను నియమించారు. ఐదు బృందాలకు కలిపి ఒక ఆర్డీఓను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈయన ఎప్పటికప్పుడు వారి పనితీరును పర్యవేక్షిస్తుంటారు. ఈ ఐదు బృందాలు ఐదు రోజులపాటు ఏడు గ్రామాల్లో తిరిగి భూమి సర్వే చేయనున్నాయి. ఐదు రోజులూ స్థానికంగానే.. సర్వే చేసేందుకు మండలానికి వచ్చే అధికారులు ఐదు రోజులపాటు (26 నుంచి 30వ తేదీ వరకు) స్థానికంగానే ఉంటా రు. అంటే సర్వే పూర్తయ్యేంతవరకు ఉండాలి. వారికి కావాల్సిన వసతులను కూడా కల్పించారు. దామరచర్ల, వీర్లపాలెం, ముదిమాణిక్యం, తాళ్లవీరప్పగూడెం గ్రామాలు సర్వే చేసేవారికి మండలకేంద్రంలో, దిలావర్పూర్, కల్లెపల్లి, నర్సాపూర్, కొండ్రపోల్ పరిధిలో సర్వే చేసే అధికారులకు మిర్యాలగూడలో వసతి ఏర్పాటు చేశారు. రైతులు అందుబాటులో.. సర్వే చేసే గ్రామాల్లో ఫారెస్టు భూములు పొందిన రైతులు ఐదురోజులు వారివారి భూముల మీద అందుబాటులో ఉండాలని అధికారులు కోరుతున్నారు. పునరావాసం ద్వారా డిఫారెస్టు భూములు పొందిన రైతులు, అటవీ హక్కుల చట్టం ద్వారా సంక్రమించిన వారు, ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా భూముల పొందిన రైతులు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఈ పత్రాలతో రైతులు సిద్ధంగా ఉండాలి.. ఆయా గ్రామాల పరిధిలో ఫారెస్టు భూములపై హక్కులు పొందిన రైతులు కింది సర్టిఫికెట్లతో సిద్ధంగా ఉండాలి. ఆ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్, టైటిల్ డీడ్, పట్టా సర్టిఫికెట్, భూమికి సంబంధించిన(లిఖిత పూర్వక) హక్కు కాగితాలు, ఆధార్‌కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌం ట్ బుక్, భూమి శిస్తు రశీదులతో ఐదురోజులు అందుబాటులో ఉండాలి. రైతులు సహకరించాలి ఐదు రోజులపాటు ఫారెస్టు భూముల సర్వేకు ఆయా గ్రామాల రైతులు సహకరించాలి. ఫారెస్టు భూములు పొందిన రైతులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో ఉండాలి. ఐదురోజుల్లో ఎప్పుడైనా సర్వే అధికారులు భూముల మీదికి రావచ్చు. సేద్యం చేసే ఫారెస్టు భూములకు సంబంధించి రైతులు ఆధారాలతో లేకుంటే అవి ఫారెస్టు భూములుగాపరిగణిస్తారు. సర్వే బృందానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. అధికారుల బృందానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. - వేముల రమాదేవి, తహసీల్దార్ మఠంపల్లిలో బంగారం, నగదు చోరీ మఠంపల్లి : మండలకేంద్రంలోని శౌరినగర్‌లో కాకుమాను బాలశౌరి ఇంటిలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం బాధితుడు స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. గురువారం అర్ధరాత్రి క్రీస్తుజననం సందర్భంగా స్థానిక శుభవార్త చర్చిలో జరిగే పూజలకు వెళ్లి తెల్లవారుజామున ఇంటికి వచ్చామన్నారు. కాగా అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనుక భాగం నుంచి తలుపులు పగులకొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలోని 26గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 10వేల నగదు, కొన్నివెండి వస్తువులు అపహరించారన్నారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేయనున్నట్లు బాధితుడు తెలిపారు. -
వీర్లపాలెంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు
నల్గొండ: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామం థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలమని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తామని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మంగళవారం నల్గొండలో వెల్లడించారు. థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు నల్గొండ జల్లాలో సీఎం కేసీఆర్ మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం వీర్లపాలెంలో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానికంగా థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ఆయన మంత్రులు, ఎంపీ, ఉన్నతాధికారుల వద్ద వ్యక్తం చేశారు. థర్మల్ ప్లాంట్‌ను వీర్లపాలెంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, కలెక్టర్ చిరంజీవులు, జెన్కో అధికారులు, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌లు పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరారు. ఈ 7500 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను రూ. 55 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. -
ఫిబ్రవరి నుంచి ‘సింగిల్ డెస్క్’
21 రోజుల్లో పరిశ్రమలకు ఆన్లైన్లోనే అన్ని అనుమతులు: ఏపీ సీఎం చంద్రబాబు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో పరిశ్రమలకు 21 రోజుల్లోనే అన్ని అనుమతులు ఆన్లైన్లో ఇచ్చేలా ‘సింగిల్ డెస్క్’ విధానం వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు అవసరమైన పరిశ్రమలు మినహా మిగతా అన్నింటికీ 28 రకాల అనుమతులను ఈ డెస్క్ ద్వారా ఇస్తామని తెలిపారు. భారీ పరిశ్రమలకు మాత్రం సీఎం నేతృత్వంలోని ప్యానల్ అనుమతులు ఇస్తుందని, వాటికీ 21 రోజుల్లో అనుమతులు ఇవ్వాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. బుధవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలన్నింటినీ ఆధార్‌తో అనుసంధానిస్తామని చెప్పారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, విద్యార్థులు ఇలా ఎవరికైనాసరే ఆధార్ కార్డు లేనిదే ఏదీ వర్తించదని కుండబద్దలు కొట్టారు. 2022నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి నంబర్ వన్‌గా నిలుపుతామని తెలిపారు. 2050 నాటికి ప్రపంచంలోనే భారతదేశంతోపాటు రాష్ట్రం కూడా నంబర్ వన్ స్థానాన్ని సాధించాలన్నది తన లక్ష్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన రూ. 1,600 కోట్ల రుణాల్లో తమ ప్రభుత్వం రూ.600కోట్లు చెల్లించిందని, మిగతా రూ.1,000 కోట్లను త్వరలోనే చెల్లిస్తామని అన్నారు. విదేశీ పర్యటనల వల్ల ఎన్ని పెట్టుబడులు వచ్చాయన్న విలేకరుల ప్రశ్నకు చంద్రబాబు సూటిగా సమాధానమివ్వలేదు. విదేశాలు వెళ్లి ఏవో రెండు మూడు ఎంవోయూలు కుదుర్చుకోవడం తన ఉద్దేశం కాదని చెప్పారు. రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నామన్నారు. వాన్‌పిక్, లేపాక్షి ప్రాజెక్టుల న్యాయ వివాదాలను పరిష్కరించుకుని వాటిని కొనసాగించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉండగా విశాఖపట్నంలో పీసీపీఐఆర్ ప్రాజెక్టును వ్యతిరేకించిన మాట వాస్తవమేనని, పెట్రో ఆధారిత పరిశ్రమల వల్ల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. పీసీపీఐఆర్ ప్రాజెక్టును చేపడతామని స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్తు కేంద్రాలను ప్రజలు వ్యతిరేకించారని చెబుతూ.. ఆ ప్రాజెక్టుల వల్లే అభివృద్ధి జరుగుతుందన్నారు. విభజన బిల్లులోని హామీల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. వాణిజ్యానికి ముఖద్వారంగా ఏపీ ఆగ్నేయాసియా దేశాలతో భారత వాణిజ్య సంబంధాలకు రాష్ట్రాన్ని ముఖద్వారంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు చెప్పా రు. విశాఖపట్నం - కాకినాడ పారిశ్రామిక అభివృద్ధి మండలి ద్వారా విదేశాలతో దేశ వాణిజ్య సంబంధాలకు రాష్ట్రం ప్రధాన కేంద్రంగా మారుతుందన్నారు. ‘ఫార్చ్యూన్ ఇండియా’ పత్రిక బుధవారం విశాఖపట్నంలో నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ టాక్స్ బిజినెస్’ సదస్సులో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో జల, గ్యాస్, విద్యుత్తు, రోడ్, ఫైబర్ గ్రిడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. మూడేళ్లలో ప్రతి ఇంటికి సెకనుకు 15-20 మెగాబైట్ల సామర్థ్యంతో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. కాగ్నిజెంట్ వైఎస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రపంచస్థాయి పరిశోధన కేంద్రాలను ఏర్పాటు అవసరమని చెప్పారు. వృత్తి నిపుణులను ఆకర్షించడం ద్వారానే రాష్ట్రంలోని నగరాలను సిలికాన్ వ్యాలీ తరహాలో అభివృద్ధి చేయగలమని ఐడీజీ ఇన్వెస్ట్మెంట్స్ సీఎండీ సుధీర్ సేథీ చెప్పారు. సదస్సు ప్రారంభంలో ‘ఫార్చ్యూ న్ ఇండియా 500’ మెగా ఇష్యూను చంద్రబాబు ఆవిష్కరించారు. -
అమ్మో.. థర్మల్!
ఎచ్చెర్ల: జాతీయ రహదారికి ఆనుకొని రెండు మండలాల సరిహద్దుల్లో ఉన్న ప్రశాంత వాతావరణంలో ఉన్న పల్లెలు కొద్దిరోజులుగా ఆ ప్రశాంతతకు దూరమయ్యాయి. ఏదో తెలియని ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. తమ గుండెలపై థర్మల్ కుంపటి పెడతారేమోనన్న ఆలోచనే వారిని కలవరపాటుకు గురి చేస్తోంది. ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురం, పొందూరు మండలం ధర్మపురం గ్రామాల మధ్య ఉన్న కొండపై ఇటీవల స్థలపరిశీలన జరిపిన ఉన్నతాధికార బృందం ఈ ప్రాంతం ప్లాంట్ ఏర్పాటుకు అనువుగా ఉందని ప్రకటించినప్పటి నుంచి స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడి ప్రకృతి వనరులు దెబ్బతింటాయంటూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.సంస్థలు, రైతుల ఆధీనంలో.. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, ఎచ్చెర్ల మండల కాంప్లెక్స్ నుంచి పెద్ద చెరువు వరకు అధికారులు పరిశీలించిన కొండ విస్తరించి ఉంది. అక్కడి నుంచి పొందూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన కొండ ఆవరించి ఉంది. ఎస్.ఎం.పురం పరిధిలో 112 సర్వే నెంబర్, ధర్మపురం పరిధిలో 05 సర్వే నెంబర్లో సుమారు 1500 ఎకరాల భూములు ఉన్నాయి. ఇప్పటికే ఎస్ఎం పురం పరిధిలోని కొండ ప్రాంత భూముల్లో అంబేద్కర్ వర్సిటీ, శ్రీ వెంకటేశ్వరా గ్రూప్ కళాశాలలు, ఎచ్చెర్ల ఐటీఐ, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, 21వ శతాబ్ది గురుకులం, రాజీవ్ స్వగృహ, ఎస్ఎంపురం ఏపీ గురుకుల పాఠశాల.. ఇలా పలు ప్రభుత్వ, ప్రైవే టు సంస్థలకు ప్రభుత్వం సుమారు 300 ఏకరా లు కేటాయించింది. గతంలో సామాజిక అటవీశాఖ పరిధిలో ఉన్న ఈ భూముల్లో పలువురు రైతులకు పట్టాలు ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు స్థలాలు కేటాయించటంతో ఇక్కడ భూములు కోల్పోయిన రైతులకు ఆ ప్రాంతంలోనే వేరే చోట పట్టాలు ఇచ్చారు. అలా గే ఇందిరప్రభ లబ్ధిదారులకు స్థలాలు కేటాయించారు. ఇంకోపక్క వాటర్‌షెడ్‌లో భాగంగా ఇక్కడి కొండలను ఆర్ఐడీఎఫ్ సంస్థ అభివృద్ధి చేసి మొక్కలు నాటింది. ఇక్కడి జీడి, మామిడి తోటలు సైతం రైతుల ఆధీనంలో ఉన్నాయి. మొత్తం మీద ఎస్ఎం.పురం, దర్మవరం ప్రాంతాల పరిధిలో సుమారు 400 మంది రైతులకు గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చాయి. వారందరికీ సాగుహక్కు ఉంది. పెద్ద చెరువు కింద 500 ఎకరాలు కాగా ఇదే ప్రాంతంలో ఉన్న ఎస్.ఎం.పురం పెద్ద చెరువు కింద 500 ఎకరాల సాగు భూమి ఉంది. ఈ చెరువుకు మడ్డువలస ప్రాజక్టు నీరు తరలిస్తామని ఎప్పటి నుంచో ప్రభుత్వాలళు హామీ ఇస్తు న్నా కార్యరూపం దాల్చలేదు. ఫరీదుపేట, ఎస్.ఎం.పురం. కనిమెట్ట తదితర గ్రామాల సాగుభూములు ఈ చెరువు ఆయకట్టు పరిధిలో ఉన్నాయి. పక్కా జిరాయితీ భూములైన వీటిలో ప్రతి ఏటా వరితోపాటు ఆరుతడి పంటలు, కూరగాయలు విస్తారంగా సాగు చేస్తున్నారు. మడ్డువలస నీరు తరలిస్తే ఇంకా మంచి పంటలు పండే అవకాశం ఉంది. ఈ పరిస్థితులో థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రతిపాదనతో రెండు మండలాల్లోని సుమారు పది గ్రామాల రైతులు ఉలిక్కిపడ్డారు. విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ఏస్తే కాలుష్యంతో వ్యవసాయం కనుమరుగవుతుందని ఆందోళన చెందుతున్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజా, దళిత సం ఘాలు పోరాటానికి సైతం సిద్ధమవుతున్నాయి. -
‘థర్మల్’ అనుమతులు రద్దు ఎప్పుడు?
సోంపేట : బారువ ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంట్ అనుమతులు రద్దు జీవో ఇంకెప్పుడు ఇస్తారంటూ మండలంలోని రుషికుడ్డ గ్రామానికి చెందిన గండు తులసి నారాయణ, కామేశ్వరరావు, లక్ష్మీనారాయణ తదితరులు ఎమ్మెల్యే బి.అశోక్‌బాబును నిలదీశారు. గ్రామంలో గురువారం నిర్వహించిన రైతు సాధికార సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యేను ఈ మేరకు ప్రశ్నించారు. దీంతో ఆయన మాట్లాడుతూ జీవోను ప్రభుత్వం తొందర్లోనే విడుదల చేస్తుందన్నారు. దీనికోసం మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, పలాస ఎమ్మెల్యే శ్యామ సుందర శివాజీ కృషి చేస్తున్నారని అన్నారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. టీడీపీ చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేసిందన్నారు. మత్స్యకారులకు తుపాను పరిహారం, రైతులకు రుణమాఫీ పత్రాలు అందించారు. తమ పింఛన్లు అన్యాయంగా తొలగించారంటూ పలువురు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అలాగే మండలంలోని ఇస్కలపాలెం, గొల్లగండి, సోంపేట, సిరిమామిడి గ్రామ పంచాయితీల్లో రైతు సాధికార సదస్సులు నిర్వహించారు. ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రమోహన్, మండల ప్రత్యేకాధికారి కరుణాకరరావు, వ్యవసాయ శాఖ ఏడీ వెంకటేశ్వరులు, తహశీల్దార్ గోపాలరత్నం, ఎంపీడీవో పట్నాయక్ పాల్గొన్నారు. -
‘థర్మల్’పై పోరుకు సన్నాహాలు
ప్రజలను చైతన్య పరుస్తున్న ఐక్యవేదిక నాయకులు సోంపేట/కవిటి: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ తీరప్రాంతంలో నిర్మించదలచిన థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ పోరుబాటకు ఐక్యవేదిక నేతలు సన్నద్ధమవుతున్నారు. పర్యావరణ, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు ఉద్యమబాట పట్టేలా ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం నుంచి తీర ప్రాంత గ్రామాలైన బారువ, బెంకిలి, జింకిభద్ర, పలాసపురం, లక్కవరం, గొల్లగండి, రుషికుద్ద, ఇస్కలపాలెం, గొల్లగండి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కవిటి మండలంలోని పలు గ్రామాల్లో వేదిక సభ్యులు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వై.కృష్ణమూర్తి, బీన ఢిల్లీరావు, తమ్మినేని రామారావు తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బారువ ప్రాంతంలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీల ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అరుదైన, శ్రేష్టమైన చిత్తడి నేలలను కాపాడుకునేందుకు ఎటువంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. థర్మల్ పవర్‌ప్లాంట్ స్థాపనకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని మత్స్యకార ఐక్యవేదిక సంఘం అధ్యక్షుడు రాజారావు, ఉపాధ్యక్షుడు సోమయ్య, మాజీ అధ్యక్షుడు వాసుపలి కృష్ణారావు కవిటి మండలంలో పర్యటిస్తూ స్పష్టం చేశారు. చిత్తడి నేలల్లో ఇండస్ట్రియల్ పార్క్ మరోవైపు సోంపేట బీల ప్రాంతంలోని చిత్తడి నేలల్లో ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ది చేయడానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జపాన్ పర్యటనకు వెళ్లే ముందే ఇండస్ట్రియల్ పార్క్‌కు భూసేకరణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. -
'జపాన్ సంస్థలతో ఒప్పందం విరమించుకోకుంటే తీవ్ర ఉద్యమం'
శ్రీకాకుళం: జిల్లాలోని సోంపేట మండలం బారువా వద్ద పర్యావరణ ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు. 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి జపాన్ సంస్థలతో ఒప్పందంపై వారు నిరసనకు దిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2,640 మెగావాట్ల నాగార్జున కన్స్ట్రక్షన్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను చంద్రబాబు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఇప్పుడు కొత్తగా జపాన్ సంస్థలతో మరో థర్మల్ పవర్‌ప్లాంట్‌కు ఒప్పందం కుదుర్చుకున్నారని ఉద్యమ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సాయిరాజు విమర్శించారు. జపాన్ సంస్థలతో ఒప్పందం విరమించుకోకుంటే తీవ్ర ఉద్యమం చేపడుతామని సాయిరాజు హెచ్చరించారు. -
‘థర్మల్’పై పోరాటం ఆగదు
సోంపేట :సోంపేట మండల బీల ప్రాంతంలో నిర్మించదలచిన థర్మల్ విద్యుత్ కేంద్రం అనుమతులు రద్దు చేసే వరకు పోరాటం ఆగదని, దీనికోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిరియా సాయిరాజ్ అన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యమ నేపథ్యంలో పిరియా సాయిరాజ్ పై సోంపేట కోర్టులో ఉన్న కేసు శనివారం న్యాయమూర్తి కొట్టి వేసిన నేపథ్యంలో పట్టణంలోని బస్టాండు వద్ద గల దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఆ పార్టీ నాయకులతో కలసి పత్రికా సమావేశం నిర్వహించారు. తొలుత వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 సంవత్సరం నుంచి సుమారు ఆరేళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వాల తీరు మారకపోవడం బాధాకరమన్నారు. అమాయక ప్రజలపై అప్పటి ప్రభుత్వం పోలీసులతో కేసులు పెట్టించి నేటివరకు కోర్టులు చుట్టూ తిప్పుతోందన్నారు. ఏప్రిల్ 30, 2012న ఎన్సీసీ యాజమాన్యం, స్థానిక ప్రజలకు జరిగిన సంఘటన నేపథ్యంలో బారువ పోలీసులు తనతో పాటుగా మొత్తం 114 మందిపై కేసులు పెట్టారన్నారు. ఈ కేసు నేపథ్యంలో 15 రోజుల జీవితాన్ని కూడా అనుభవించాన్నారు. సుమారు 30 సార్లు సోంపేట కోర్టుకు వాయిదాల నిమిత్తం హాజరైనట్టు చెప్పారు. ఈ రోజు ఆ కేసును సోంపేట కోర్టు న్యాయమూర్తి కొట్టి వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. న్యాయమే నెగ్గిందన్నారు. అప్పటి ప్రభుత్వం థర్మల్ అనుమతులు రద్దు విషయంలో స్పందించలేద న్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రం కాల్పులు జరిగిన మరుసటి రోజు సోంపేట మండలానికి చేరుకున్న టీడీపీ అధినేత, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే థర్మల్ అనుమతులు రద్దు చేస్తామని హమీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా హామీ నిలబెట్టుకోలేదన్నారు. 1107 జీవో రద్దు చేసే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి థర్మల్ విద్యుత్ కేంద్రం అనుమతులు రద్దు జీవో విడుదల చేయాలని కోరారు. పీఏసీఎస్ అధ్యక్షుడు ఆర్.విశ్వనాథం, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పాతిన శేషగిరి, సర్పంచ్ యర్ర తారకేశ్వరరావు, గౌరీ కామేశ్వరరావు, చామంతి బుద్దేశ్వరరావు, పద్మావతి తారకేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు తడక జోగారావు, పాతిన రామమూర్తి, సకాల బత్తుల హరీష్‌కుమార్, పార్టీ నాయకులు పొడుగు కామేశ్వరరావు, మడ్డు రాజారావు, బి.శ్రీకృష్ణ, ఆర్.సురేష్, బెందాళం రామారావు, పి.అప్పలస్వామి, దున్న మాధవరావు, ఎస్.పాపారావు, జి.దండాసి, కె.రాజారావు తదితరులు పాల్గొన్నారు. -
2015 మార్చిలో కేటీపీపీ రెండో దశ వెలుగులు
తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు గణపురం: కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల రెండోదశ ప్లాంట్‌లో 2015 మార్చి31 నాటికి వెలుగులు విరజిమ్ముతాయని తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు ప్రకటించారు. గణపురం మండలం చెల్పూరు శివారులోని కేటీపీపీ రెండో దశ ప్లాంట్ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం ప్రభాకర్‌రావు విలేకరులతో మాట్లాడారు. రెండో దశ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించడమే కాకుండా అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షిస్తున్నామని చెప్పారు. రెండో దశ ప్లాంట్ పనుల్లో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ... నాలుగు నెలలుగా పనులు పుంజుకున్నాయన్నారు. 2014 డిసెంబర్లో బాయిలర్ హైడ్రాలిక్ టెస్ట్ ఉంటుందని, 2015 మార్చిలో ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. వర్షాకాలంలో పనులు సక్రమంగా జరగని మాట వాస్తవ మేననని, నెలలో ఒకటి రెండు సార్లు ప్లాంటులో నిర్మాణ పనులను విద్యుత్ సౌధ అధికారులు వచ్చి పరిశీలిస్తున్నారని చెప్పారు. ఇకపై తతాను నెలకోసారి వస్తానన్నారు. బొగ్గు కొరత రాకుండా తగిన ఏర్పాట్లల్లో ఉన్నామని, ప్రస్తుతం లక్ష మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు. కరీంనగర్ జిల్లా తాడిచర్లలోని జెన్కోకు చెందిన బొగ్గుబ్లాకు రద్దయిన విషయం అందరికి తెల్సిందేనని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ అవసరాల దృష్ట్యా తాడిచర్ల బ్లాక్‌ను తిరిగి జెన్కోకు కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకు వ చ్చే ప్రయత్నంలో ఉందన్నారు. దుబ్బపల్లి గ్రామం తరలింపు పై దృష్టి సారించామని , పునరావాస ప్యాకేజీకి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే భూసేకరణ జరిగిందని, ములుగు ఆర్టీఓ ఖాతాలో రూ.27 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. రెవెన్యూ అధికారులదే జాప్యమని, నాలుైగె దు చోట్ల భూములను కూడా పరిశీలించినట్లు పేర్కొన్నారు. అనంతరం అధికారులతో ఆయన సమీక్షించారు. పనుల్లో నిర్లక్ష్యంపై అధికారులను మందలించినట్లు సమాచారం. కాంట్రాక్టు కంపెనీలకు సైతం జరిమానా విధిస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. జెన్కో డెరైక్టర్ సచ్చితానందం, కేటీపీపీ సీఈ శివకుమార్, సివిల్ సీఈ అజయ్, ఎస్ఈలు సురేష్‌బాబు, వెంకటేశ్వరరావు ,ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు కేటీపీపీని సందర్శించిన క్రమంలో వార్తల కవరేజీకి వచ్చిన ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడీయా విలేకరులను ప్లాంట్‌లోనికి అనుమతించలేదు. దాదావు 8 గంటలపాటు అధికారులనుంచి పిలుపు రాకపోవడంతో ఆగ్రహించిన విలేకరులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. చివరకు ఈ విషయం సీఎండీ దృష్టికి తీసుకురాగా... ఇంకోసారి అలా జరగకుండా చూస్తానని పేర్కొన్నారు. -
థర్మల్ విద్యుత్‌కు బొగ్గు సరఫరాపై కోటి ఆశలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంలో ఏర్పాటైన ప్రతి థర్మల్ విద్యుత్కేంద్రానికి అవసరాలకు తగ్గ బొగ్గు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రతిపాదన వెంటనే అమల్లోకి వస్తే తక్షణమే 7,230 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. మరో 10,930 మె.వా. విద్యుదుత్పత్తి వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా సిద్దమవుతుంది. తాజా ప్రతిపాదన పట్ల ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్కేంద్ర నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం ప్రస్తుతం నిర్వహణలో ఉన్న ప్రాజెక్టులకే కాక కొత్తగా ఏప్రిల్ 2017 వరకు ఏర్పాటయ్యే థర్మల్ విద్యుత్కేంద్రాలకు కూడా ఇది వర్తించేలా చర్యలు చేపట్టనున్నారు. ఆయా ప్రాజెక్టులు చేసుకున్న ఇంధన ఒప్పందాలతో సంబంధం లేకుండా అన్ని యూనిట్లకు బొగ్గు సరఫరా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం దేశంలో 12 వేల మె.వా. సామర్థ్యంకల ప్లాంట్లకు ఇంధన ఒప్పందాలు లేవు. దీంతో ఏటా రూ. 32 వేల కోట్ల రెవెన్యూ నష్టం వాటిల్లుతోంది. క్యాప్టివ్ కోల్‌మైన్స్ లెసైన్స్ ఉండి ఏ కారణం చేతనైనా అది రద్దయినా, ఆలస్యమైనా అలాంటి ప్రాజెక్టులకు కూడా ఈ పథకాన్ని విస్తరించనున్నారు. ఈ ప్రతిపాదనపై ‘‘థర్మల్ విద్యుత్కేంద్రాలకు అవసరమైనంత బొగ్గు సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలను స్వాగతిస్తున్నాం. మా అనుబంధ సంస్థ గాయత్రీ ఎనర్జీ వెంచర్స్ ద్వారా 2,640 మె.వా. థర్మల్ విద్యుదుత్పత్తి చేస్తున్నాం. నిరంతర బొగ్గు సరఫరా హామీ ఉంటే సామర్థ్యాన్ని మరింత పెంచే ఆలోచన చేసే అవకాశం ఉంది. అయితే దేశీయంగా లభించే బొగ్గు కేలరీ నాణ్యత విషయం కొంత ఆందోళనకరం. ఏదేమైనా బొగ్గు సరఫరా ప్రతిపాదన దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి ఊతాన్నిస్తుంది’’ అని సందీప్ రెడ్డి, గాయత్రీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అభిప్రాయపడ్డారు. ‘‘నిరంతర బొగ్గు సరఫరా హామీ అమలైతే 100 మె.వా.లోపు థర్మల్ యూనిట్లకు ఆక్సిజన్ ఇచ్చిన ట్లవుతుంది. క్యాప్టివ్ యూనిట్లకే కాక కోజనరేషన్ యూనిట్లకు కూడా పూర్తి స్థాయి సామర్థ్యాన్ని అందుకొనే వీలుంటుంది. అయితే అంతర్జాతీయ, దేశీయ కోల్ ధరల్లో పెద్ద వ్యత్యాసమేమీ లేదు. నాణ్యమైన బొగ్గు సరఫరా చేస్తే ఉత్పత్తి మరింత నాణ్యంగా అందించవచ్చు’’ అని హరి కుమార్, సింహాద్రి పవర్ తెలిపారు. -
ఇక్కడొద్దు...
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీజాపుర జిల్లా ఆల్మట్టిలో వాయనం సమర్పించడానికి వెళ్లిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గురువారం అక్కడ రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. పక్కనే ఉన్న బాగలకోటె జిల్లా కూడగిలో థర్మల్ విద్యుత్కేంద్రాన్ని నెలకొల్పుతున్నందుకు నిరసనగా రైతులందరూ ఆకు పచ్చ కండువాలను పైకి ఊపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ సంఖ్యలో అక్కడ గుమికూడిన రైతులు చెరుకు మద్దతు ధరను రూ.2,500గా నిర్ణయించాలని కూడా డిమాండ్ చేశారు. రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతుందని ముందుగానే పసిగట్టిన పోలీసులు కూడా అక్కడ భారీ సంఖ్యలో మోహరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రైతులను అనునయించడానికి ప్రయత్నించారు. థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నందున, ఇప్పుడు వ్యతిరేకత వ్యక్తం చేస్తే ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. చెరుకు మద్దతు ధరను ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిందని గుర్తు చేశారు. ఇంకా ఏవైనా సమస్యలుంటే రైతు సంఘాల ప్రతినిధులు తనను సంప్రదించవచ్చని సూచించారు. అనంతరం ఆయన ఆల్మట్టి జలాశయంలో కృష్ణమ్మకు వాయనం సమర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేపీఎస్సీ నియామకాల రద్దును సమర్థించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిపై పునరాలోచన లేదని స్పష్టం చేశారు. నియామకాలకు సంబంధించి కేపీఎస్సీ సభ్యులు కొందరికి ముడుపులు అందాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేది లేదని తెలిపారు. రాష్ట్ర పరిధిలో దీనిపై అనుసరించాల్సిన విధి విధానాలు ఉన్నాయని, వాటిని పాటిస్తామని ఆయన చెప్పారు. -
న్యాయ విచారణకు పట్టు
కూడగి ఘటనపై విపక్షాల ఆందోళన మెజిస్టీరియల్ విచారణతో న్యాయం జరగదని సూచన బీజేపీ సభ్యుల వాకౌట్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీజాపుర జిల్లా కూడగిలో థర్మల్ విద్యుత్కేంద్రం ఏర్పాటుకు నిరసనగా ఆందోళన చేపట్టిన రైతులపై పోలీసు కాల్పులు జరిగిన సంఘటనకు సంబంధించి న్యాయ విచారణ చేపట్టాలని సోమవారం శాసన సభలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ అంశంపై జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో పాల్గొన్న ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ రైతులపై లాఠీ ఛార్జి, కాల్పులు జరపడం అసమంజసమని విమర్శించారు. రైతులను శాంతింపజేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ సంఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారని గుర్తు చేస్తూ, జిల్లాధికారి పర్యవేక్షణలో ఈ విచారణ జరుగుతుందని తెలిపారు. అయితే స్థానికులు జిల్లా యంత్రాంగపైనే ఆగ్రహం వ్యక్తం చేసినందున వారికి న్యాయం జరగదన్నారు. కనుక న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా స్థానికులకు ఉద్యోగాలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్కేంద్రాన్ని నెలకొల్పడానికి ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్థానికులకు ఉద్యోగాలివ్వలేదని బీజేపీ సభ్యుడు గోవింద కారజోళ ఆరోపించారు. నిరంతరం విద్యుత్‌ను సరఫరా చేస్తామనే మాటనూ నిలబెట్టుకోలేదని విమర్శించారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని జేడీఎస్ పక్షం నాయకుడు కుమార స్వామి అన్నారు. హోం మంత్రి కేజే. జార్జ్ చర్చకు సమాధానమిస్తూ, కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్ల వ్యయంతో ఈ విద్యుత్కేంద్రాన్ని చేపట్టిందని తెలిపారు. అనేక విదేశ కంపెనీలు కూడా భాగస్వాములుగా ఉన్నాయని వెల్లడించారు. విద్యుత్కేంద్రం నిర్మాణం పూర్తి కావస్తున్న తరుణంలో, దీనిని వ్యతిరేకిస్తే విదేశ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావని ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి చికిత్సలు చేయిస్తున్నామని, రైతులకు సాంత్వన కలిగించడానికి అన్ని ప్రయత్నాలు చేశామని వివరించారు. గాయపడిన ఇద్దరు రైతులకు రూ.లక్ష చొప్పున నష్ట పరిహారం ప్రకటించామని తెలిపారు. అయితే ఈ సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. -
అచ్చెన్న అరాచకం
సంతబొమ్మాళి, న్యూస్‌లైన్: ఒకప్పుడు టీడీపీ కంచుకోట అయిన సంతబొమ్మాళి మండలంలో ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తండటం.. దానికి కింజరాపు కుటుంబం వెన్నుదన్నుగా నిలవడం తెలిసిందే. దాంతో మండలంలోని థర్మల్ ప్రభావిత గ్రామాల్లో టీడీపీ పట్టుకోల్పోయింది. ఈ నేపథ్యంలో టెక్కలి టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం ఆకాశలక్కవరం పంచాయతీలో ఎన్నికల ప్రచారానికి గురువారం మందీమార్బలంతో తరలివెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల మహిళలు సీరపువానిపేట జంక్షన్ వద్ద కాపు కాశారు. అచ్చెన్న కాన్వాయ్ రాగానే.. దానికి అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. అచ్చెన్న గోబ్యాక్ అన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ‘పవర్ ప్లాంట్‌కు అనుకూలంగా మారి మా బతుకులు బుగ్గిపాల్జేశావు. కాల్పుల్లో ముగ్గురు రైతుల చావుకు కారణమయ్యావు. తుఫాన్లతో మా బతుకులు అతలాకుతలమైనప్పుడూ పట్టించుకోలేదు. కష్టకాలంలో మావైపు కన్నెత్తి చూడని నువ్వు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం మా గ్రామాలకు వస్తున్నావు’.. అంటూ మహిళలు టీడీపీ అభ్యర్థిని నిలదీశారు. నన్నే నిలదీస్తారా?.. మహిళల నిరసనను.. తనకు జరిగిన పరాభవంగా అచ్చెన్నాయుడు భావించారు. వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా ఉక్రోషంతో విరుచుకుపడ్డారు. తన వెంట ఉన్న టీడీపీ కార్యకర్తలనూ వారిపైకి ఉసిగొల్పారు. అంతే అందరూ కలిసి రోడ్డుకు అడ్డంగా ఉన్న మహిళపై వీరంగం చేశారు. ద్విచక్ర వాహనాలతో మహిళలను తొక్కించారు. కొందరినీ విసురుగా తోసేశారు. అడ్డుపడిన పోలీసులను సైతం నెట్టేశారు. ఈ దౌర్జన్యకాండలో ఆకాశలక్కవరం గ్రామానికి చెందిన రోకళ్ల నీలవేణి తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే అపస్మారక స్థితికి చేరుకుంది. అయినా అచ్చెన్న ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా మిగిలిన వారిపై కూడా తన అనుచరగణాన్ని పురిగొల్పడంతో ద్విచక్ర వాహనాల కింద పడి దువ్వు సత్యవతి, సీరపు అమ్మాయమ్మ అనే మరో ఇద్దరు మహిళలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఊహించని ఈ దాడితో మహిళలు భీతిల్లారు. రోదించడం మొదలుపెట్టారు. అవేవీ పట్టించుకోకుండా అచ్చెన్నాయుడు తన అనుచరగణంతో గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం చేసుకున్నారు. సీరపువానిపేట జంక్షన్ వద్ద మహిళలపై దాడి జరిగిన విషయం మండలమంతా దావానలంలా వ్యాపించడంతో బాధితుల బంధువులతో పాటు వివిధ గ్రామాల ప్రజలు అక్కడకు చేరుకున్నారు. దెబ్బలు తగిలిన వారిని టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అచ్చెన్నాయుడుపై ఫిర్యాదు సీరపువానిపేట జంక్షన్ వద్ద మహిళలపై అచ్చెన్నాయుడు, ఆయన అనుచరులు జరిపిన దాడిపై బాధితులు నౌపడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దౌర్జన్య కాండలో తీవ్రంగా గాయపడిన రోకళ్ల నీలవేణి, దువ్వు సత్యవతి, సీరపు అమ్మాయమ్మ తదితరులు అచ్చెన్నాయుడు సహా నిందితులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. మండిపడుతున్న థర్మల్ బాధిత గ్రామాలు మహిళలపై అచ్చెన్న బృందం దాడి సంఘటనతో థర్మల్ ప్రభావిత గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ఆనాడు థర్మల్‌కు అనుకూలంగా ప్రవర్తించి మా బతుకులు బుగ్గిపాలు చేసిన అచ్చెన్నాయుడు ఇప్పుడు ప్రచారం పేరుతో మా గ్రామాలకు వచ్చి నిలదీసిన వారిపై దాడికి తెగబడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో తమ సత్తా చూపించి అచ్చెన్నాయుడుకు గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. -
‘థర్మల్’ అనుమతులు రద్దు చేయండి
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రజాభిప్రాయానికి, నిబంధనలకు వ్యతిరేకంగా చేపట్టిన కాకరాపల్లి థర్మల్ ప్లాంట్ పనులను వెంటనే నిలుపుదల చేయాలని, ప్లాంట్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, కాకరాపల్లి థర్మల్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ నేతలు తమ్మినేని సీతారాం, దువ్వాడ శ్రీనివాస్, సీపీఎం నేత చౌదరి తేజేశ్వరరావు, సీపీఐ ప్రతినిధు లు గురుగుబెల్లి అప్పలనాయుడు, తాండ్ర ప్రకాశ్, నంబారి వెంకటరావు, నీలంరాజు, థర్మల్ పోరాట కమిటీ నేత అనంత హన్నూరావు తదితరులు శనివారం కలెక్టర్ సౌరభ్ గౌర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ ప్లాంట్ ఆవరణలో నిర్మాణ పనులను అక్రమంగా, వేగంగా చేస్తున్నారని, వెంటనే వాటిని నిలుపుదల చేయాలని కోరారు. ప్లాంట్ వద్దని స్థానికులు పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. ప్లాంట్ ప్రహరీని ఎత్తుగా నిర్మించటంతో ఈ ఏడాది సుమారు 23 వేల ఎకరాల్లోని పంట నెల రోజులపాటు నీటిలో ఉండిపోయిందని చెప్పారు. ప్రజల డిమాండ్ మేరకు సోంపేట ప్లాంట్ అనుమతులను రద్దు చేసిన ప్రభత్వం, కాకరాపల్లి ప్లాంట్ విషయంలో ద్వంద్వ వైఖరి ఎందుకు ప్రదర్శిస్తోందని., ఎవరి ప్రయోజనాల కోసం ఇలా చేస్తోందని ప్రశ్నించారు. ప్లాంట్ వల్ల మత్స్యకారులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. ప్లాంట్ యాజమాన్యానికి పోలీసులు వత్తాసు పలుకుతుండటంతో ప్రజ లు నిరంతరం భయంతో గడుపుతున్నారన్నారు. కాకరాపల్లి పరిసర ప్రాంతాల్లోని గడ్డిని నాశనం చేసేం దుకు ప్లాంట్ యాజమాన్యం మం దులు, విషపూరిత ద్రవాలు జల్లుతోందని.. వీటి వల్ల చెరువుల్లోని చేపలు, ఇతర జీవాలు చనిపోతున్నాయని వివరించారు. అంతేకాకుండా తేలినీలాపురంలోని విదేశీ పక్షులను సైతం ప్లాంట్ వారు కాల్చి చంపేస్తూ ఆ పక్షుల విడిది కేంద్రాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్‌కు సమైక్య సెగ
-
‘శ్రీకృష్ణ’ జోస్యమే నిజమైంది!
ప్రస్తావన: వనరులు, జల, థర్మల్ విద్యుత్తు, సహజవాయువు, వ్యవసాయం తదితర రంగాలలో నెలకొని ఉన్న పరిస్థితిపై శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో చర్చించింది. 2000 సంవత్సరంలో ఎన్డీయే హయాంలో ఏర్పడిన మూడు కొత్త రాష్ట్రాలు - ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ల పదేళ్ల నడక గురించి కూడా కొన్ని విషయాలు నమోదు చేసింది. రాష్ట్రాల విభజన లేదా పునర్వ్యవస్థీకరణ ముక్తకంఠంతో సాగేది కాదు. అభిప్రాయాలూ, అభ్యంతరాలూ రెండింటినీ పరిగణనలోకి తీసుకుని, సమన్వయం సాధించినప్పుడే ఆచరణలో ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతుంది. ప్రత్యేక తెలంగాణ ప్రకటనకు ముందు యూపీఏ ప్రభుత్వం ఈ కీలకాంశాన్ని పట్టించుకోలేదా? సీమాంధ్ర అలజడులను కేంద్రం ఊహించలేదా? మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తామని కేంద్రం ఇచ్చిన హామీ పబ్బంగడుపుకునే రాజకీయ క్రీడేనా? విభజన నిర్ణయం ఏకపక్షంగా, తొందరపాటుగా జరిగిందనే వాదనలకు ప్రస్తుత పరిణామాలన్నీ బలం చేకూరుస్తు న్నాయి. తగినంత ఆలోచన, యోజన తరువాతే కేంద్రం ఈ నిర్ణయం ప్రకటించిందని చెప్పడానికి దాఖలాలు లేవు. విభజన ప్రకటన అనంతరం తలెత్తే పరిణామాలను గురించి కేంద్రం ఇంతవరకు ఆలోచించలేదన్నా సత్యదూరం కాదు. విభజన నిర్ణయం తరువాత చేయవలసిన పనులు, తీసుకోవలసిన నిర్ణయాలకు సంబంధించిన అంశం శ్రీకృష్ణ కమిటీ పరిశీలనాంశం కాదు. విస్తృత అధ్యయనం, పరిశీలన, అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయం జరిగిందని రెండు రోజుల క్రితం రాజ్యసభలో జరిగిన చర్చలో చిదంబరం చెప్పారు. కానీ ఆ మాటకు విశ్వసనీయత లేదు. శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది? తాను చేసిన ఆరు సిఫార్సులలో దేనికి అగ్రస్థానం ఇచ్చింది? విభజన నిర్ణయంలో తొందరపాటు ఉందని ప్రతిపక్షాలు, సీమాంధ్ర ప్రజలు ఆరోపిస్తున్న తరుణంలో శ్రీకృష్ణ కమిటీ సూచించిన మార్గాలు ఏమిటో ఒక్కసారి మననం చేసుకోవడం అవసరం. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచి, తెలంగాణ రాజకీయ సాధికారత, సామాజికాభివృద్ధి ధ్యేయంగా ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలి. రాజ్యాంగబద్ధమైన భద్రత కల్పించాలన్నది చివరి సిఫార్సు ఉద్దేశం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమేనన్న అభిప్రాయంతో కమిటీ ఈ సిఫార్సు చేసింది. కమిటీ ఈ సిఫార్సుకే తొలి ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్యలకు విభజన పరిష్కారంకాదని, ఐక్యంగా ఉండటమే మంచిదని కమిటీ చెప్పింది. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రస్థానంలో ఒక మలుపు. శ్రీకృష్ణ కమిటీ లేదా ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల మీద సంప్రదింపుల కమిటీని 2010, ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీఎన్ కృష్ణ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో ప్రొఫెసర్ రణ బీర్సింగ్, డాక్టర్ అబూసలే షరీఫ్, రవీందర్ కౌర్, వినోద్ కె.దుగ్గల్ సభ్యులుగా ఉన్నారు. 2010, డిసెంబర్ 30న కమిటీ తన 461 పేజీల నివేదికను కేంద్రానికి సమర్పిం చింది. 2011, జనవరి 6న నివేదికను కేంద్రం రాష్ట్ర ప్రజల ముందుంచింది. శ్రీకృష్ణ కమిటీ క్షేత్ర పర్యటనలలో, అన్ని ప్రాంతాల ప్రజల, ప్రజాప్రతినిధుల నుంచి సేకరించిన అభిప్రాయాల ప్రాతిపదికపై సిఫార్సులు చేసింది. స్త్రీలు, విద్యార్థులు, మైనారిటీ వర్గాలు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఉద్యోగులు, వ్యక్తులు - అందరి మనోగతాలను స్వీకరించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలా? లేక యథాతథస్థితిని కొనసాగించాలా? అనే అంశాన్ని పరిశీ లించడమే ఈ కమిటీకి అప్పగించిన బాధ్యత. మరో ఆరు అంశాలు కూడా ఈ కమిటీ పరిధిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత మూడు ప్రాంతాలపై విభజన ప్రభావాన్ని, జరిగిన అభివృద్ధి తీరుతెన్నులను సమీక్షించ డం మరొకటి. రాష్ట్రంలో అప్పటివరకు జరిగిన పరిణామాల ప్రభావం వివిధ వర్గాల మీద ఎలా పడిందో పరీక్షిం చడం, ఈ పరిణామాలపై రాజకీయపార్టీల, ప్రజాసం ఘాల అభిప్రాయాలను సేకరించడం, వీటికి పరిష్కారాలు చూపించడం, కార్యాచరణను సూచించడం, మూడు ప్రాం తాల సమగ్రాభివృద్ధికి ప్రజలు, సంస్థలు వెలిబుచ్చిన అభిప్రాయాలు నమోదు చేసుకోవడం, అర్హమైనవని భావిం చిన స్వీయ అభిప్రాయాలు వెల్లడించడం వంటివి కమిటీ పరిధిలో ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికీ, ఈ ప్రాంత ప్రజల అభిప్రాయానికీ లోతైన భూమిక ఉంది. అందుకే శ్రీకృష్ణ కమిటీ ఆ నేపథ్యాన్ని వివరించడానికి నివేదికలో చాలా స్థలం కేటాయించింది. చాలా చారిత్రక వాస్తవాలు, వాటిని నిర్దేశించిన నాటి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, భాషాపరమైన అంశాలను సుస్పష్టంగా కమిటీ వెల్లడించింది. 1953 డిసెంబర్లో నాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (ఎస్సార్సీ) ఏర్పాటు చేయడం దగ్గర నుంచి, 2010 ఆగస్టులో లక్నో కేంద్రంగా ‘చిన్న రాష్ట్రాల జాతీయ సమాఖ్య’ ఏర్పడటం వరకు చర్చించింది. వనరులు, జల, థర్మల్ విద్యుత్తు, సహజవాయువు, వ్యవసాయం తదితర రంగాలలో నెల కొని ఉన్న పరిస్థితిపై కమిటీ తన నివేదికలో చర్చించింది. 2000 సంవత్సరంలో ఎన్డీయే హయాంలో ఏర్పడిన మూడు కొత్త రాష్ట్రాలు - ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖం డ్ల పదేళ్ల నడక గురించి కూడా కొన్ని విషయాలు నమో దు చేసింది. ఇందులో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ గిరిజనాభ్యుదయమే లక్ష్యంగా ఆవిర్భవించిన రాష్ట్రాలు. ఈ మూడు రాష్ట్రాల ఏర్పాటే దేశంలో ఇంకొన్ని చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమాలకు ఊపిరి పోసింది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న 2010, సెప్టెంబర్‌లోనే చిన్న రాష్ట్రాల జాతీయ సమాఖ్య సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. గూర్ఖాలాండ్ (పశ్చిమ బెంగాల్), బోడోలాండ్ (అసోం), విదర్భ (మహారాష్ట్ర), బుందేల్‌ఖండ్, పూర్వాంచల్, హరితప్రదేశ్ (ఉత్తరప్రదేశ్), లదాక్, జమ్మూ (జేకే) రాష్ట్రాల ఏర్పాటుకు ఉద్యమాలూ, అభిప్రాయాలూ పదునెక్కుతున్న నేపథ్యాన్ని కూడా శ్రీకృష్ణ కమిటీ వివరించింది. 1953 నాటి ఎస్సార్సీ ముందు తెలంగాణ ప్రాంత నాయకులు చేసిన వాదనలు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ఉన్న సానుకూలత, ప్రతికూలతలపై కూడా ఎలాంటి శషభిషలు లేకుండా శ్రీకృష్ణ వివరించారు. గత, వర్తమాన రాజకీయ పరిస్థితుల ఆధారంగా కమిటీ ఆరు సిఫార్సులు చేసింది. యథాతథస్థితి కొనసాగింపు గడచిన ఐదున్నర దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ చరిత్రను పరిశీలిస్తే ఈ ప్రతిపాదనను పరిగణనలోనికి తీసుకోవచ్చు. పూర్తిగా శాంతి భద్రతల కోణం నుంచి దీనిని అమలు చేయవలసి ఉంటుంది. దీనిని అమలు చేయదలుచుకుంటే కేంద్రం జోక్యం తక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రతిపాదన చేయడానికి కారణం, గతంలో జరిగిన పోరాటాల రూపురేఖలు. గతంలో తెలంగాణ అంశం ఎప్పుడు రాజుకున్నా ఆయా వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ రాజకీయంగానే ఆ డిమాండ్‌ను కేంద్రం ఎదుర్కొంటూ వచ్చింది. తెలుగు ఆత్మగౌరవ నినాదం తెరపైకి వచ్చినప్పటికీ ప్రత్యేక తెలంగాణ డిమాం డ్ సమసిపోలేదు. పాత కారణాలతో, కొత్త సమీకరణలతో 2000 సంవత్సరంలో మరోమారు తెలంగాణ సెంటిమెంట్ ఉద్యమరూపం దాల్చింది. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నాటి పెద్ద మనుషుల ఒప్పందం, ఉద్యోగులకు సంబంధించి 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు సరిగ్గా అమలు కాకపోవడం, ప్రాంతీ యంగా విద్యా ప్రమాణాలలో హెచ్చుతగ్గులు, నీటి వనరులలో వివక్ష, ఆర్థికాభివృద్ధిపై అలక్ష్యం వంటి అంశాల ప్రాతిపదికపై తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర నినాదం ఊపందుకుంది. అయితే ఈ సిఫార్సు అమలు అప్పటికి నెలకొని ఉన్న పరిస్థితులలో సాధ్యం కాదని శ్రీకృష్ణ కమిటీ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. ఏ చర్యలూ తీసుకోకుండా యథాతథ పరిస్థితిని కొనసాగించడం సాధ్యం కాదని, ఇదే జరిగితే ఆందోళన ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని కూడా నివేదికలో పేర్కొన్నారు. అందుకే ఒకవైపు యథాతథస్థితిని ఉన్నం తలో ఉత్తమ పరిష్కారంగా భావిస్తూనే మరోవైపు అన్ని సిఫార్సులకన్నా అత్యల్ప ప్రాధాన్యం ఉన్న సిఫార్సుగా దీనిని కమిటీ అభివర్ణించింది. కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ ప్రస్తుత రాజధాని హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం గా ప్రకటించి, రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించడం, కొత్త రాష్ట్రాలు తమ తమ రాజధానులను అభివృద్ధి చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వడం ఈ సిఫార్సు సారాంశం. ఈ ప్రతిపాదన చేయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని కమిటీ ఇలా వివరించింది. ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి సంస్కృతి ఉంది. దేశంలో ఏర్పాటైన తొలి భాషాప్రయుక్త రాష్ట్రం. ఒకే నగరం కోసం రెండు వర్గాలు పోటీపడినప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం యోచనే మంచిది. అంటే ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం అనివార్యమైతే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడమే మంచిదన్నది కమిటీ అభిప్రాయం. అయితే కొత్త రాష్ట్రాలు సొంత రాజధానులను అభివృద్ధి చేసుకునే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలనీ, హైదరాబాద్ రాజధానిగా కొనసాగాలనీ వాంఛిస్తున్నారు. అయితే వేరే రాష్ట్రంలో ఉన్న రాజధానిలో తమ పెట్టుబడులకు, ఆస్తులకు రక్షణ ఉండదన్న అనుమానాలు కూడా వారికి సహజం. ఈ సిఫార్సు హైదరాబాద్ ప్రాధాన్యాన్ని కూడా స్పష్టంగా చెబుతుంది. అంతర్జాతీయంగా ఈ నగరానికి ప్రత్యేకత ఉంది. దీనిని వృద్ధికి చోదకశక్తిగా గుర్తిస్తున్నారు. ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగంలో జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు ఉన్నాయి. పక్కన రంగారెడ్డి జిల్లా ఉండటం తో కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడులు కూడా వచ్చాయి. ఈ ఆర్థికవృద్ధి నిలకడగా ఉంటేనే ఉద్యోగావకాశాలు కొనసాగుతాయి. కానీ తెలంగాణ పరిస్థితి దృష్ట్యా ఇది కూడా ఆచరణయోగ్యం కాని ప్రతిపాదనగానే కమిటీ తేల్చింది. రాయల తెలంగాణ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌ను రాయల తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలుగా విభజించడం, హైదరాబాద్‌ను రాయలతెలంగాణలో అంతర్భాగంగా ఉంచడం ఈ ప్రతిపాదన ఉద్దేశం. సీమలో కొన్నివర్గాలు ఈ ప్రతిపాదనను రెండో అభిమతంగా ఆహ్వానించాయని కమిటీ చెప్పింది. తొలి ప్రాధాన్యం మాత్రం సమైక్య ఆంధ్రకే. హైదరాబాద్‌లో బలంగా ఉన్న ఎంఐఎం కూడా దీన్ని రెండో అభిమతంగా పేర్కొనడం విశేషం. ఆ పార్టీ ఉద్దేశం సమైక్య ఆంధ్రప్రదేశ్. ఒకవేళ విభజన అనివార్యమైతే మాత్రం రాయల తెలంగాణకు సముఖంగా ఉన్నట్టు పేర్కొన్నది. తెలంగాణ, సీమ లు కలిస్తే జనాభా దృష్ట్యా ముస్లింలకు ప్రాధాన్యం పెరుగుతుందని ఆ పార్టీ అంచనా. అయితే, మీరు తెలంగాణలో ఉంటారా? కోస్తాంధ్రలో ఉంటారా? అని అక్కడి ప్రజలను అడిగితే వారు తెలంగాణవైపే మొగ్గుతారని కమిటీ చెప్పిం ది. అంతగా సీమ తెలంగాణ మీద ఆధారపడి ఉంది. అయితే ఈ ప్రతిపాదనను ఎవ్వరూ ఆమోదించలేదు. ముఖ్యంగా తమ వెనుకబాటుకు కారణం సీమ నేతలేనని తెలంగాణలో కొన్ని వర్గాల అభిమతం. రాయల తెలంగాణ వల్ల కొన్ని ఛాందసవాద శక్తులు బలం పుంజుకుంటాయనే అభిప్రాయమూ కొందరు వ్యక్తం చేశారు. విభజన, కేంద్రపాలనలో ‘గ్రేటర్’ రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించి, గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా విస్తరిం పచేయాలని ఈ ప్రతిపాదన చెబుతోంది. రాష్ట్రంతో పాటు దేశాభివృద్ధిలో కూడా హైదరాబాద్ పాత్ర కీలకమని కమిటీ అభిప్రాయం. అందుకే నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలను కూడా కలిపి 67 మండలాలు, 1,330 గ్రామాలతో, 12,430 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కేంద్రపాలిత ప్రాంతంగా నిర్మించాలని కమిటీ అభిప్రాయం. ఇది గోవా పరిధికి రెట్టింపు. వ్యూహా త్మకంగా కూడా హైదరాబాద్ కీలకమే. అందుకే కేంద్రపాలిత ప్రాంతం చేయడం అవసరమని కమిటీ చెప్పింది. అలాగే కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటూనే ఇది తెలంగాణ, సీమాంధ్రలకు రాజధానిగా ( హర్యానా, పంజాబ్‌లకు చండీగఢ్ రాజధాని అయినట్టు) ఉంచాలి. అయితే ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రజానీకం ఆమోదించదని కమిటీ పేర్కొన్నది. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ప్రస్తుత సరిహద్దుల ప్రకారం రాష్ట్రాన్ని తెలంగాణ, సీమాం ధ్రలుగా విభజించి, తెలంగాణకు హైదరాబాద్‌ను రాజధానిని చేయాలి. సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. ఈ సిఫార్సును పరిగణనలోనికి తీసుకోవచ్చునని కమిటీ అభిప్రాయం. ఎందుకంటే, తెలంగాణ ఉద్యమం పూర్తిగా కొట్టిపారేయలేనిది కాదని కమిటీ అంచనా. ఇం దువల్ల ఆంధ్ర, సీమల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారికి అభ్యంతరాలు ఉంటే, వాటిని పరిష్కరిం చాలి. కానీ ఈ ప్రతిపాదన తెలంగాణలో ఎక్కువ ప్రాం తాల వారిని సంతృప్తిపరిచినా, దేశంలో కొత్త సమస్యలు తలెత్తుతాయని కమిటీ హెచ్చరించింది. ఈ పూర్వాపరాలను పరిశీలించిన తరువాత ఈ సిఫార్సుకే తొలి ప్రాధాన్యం ఇవ్వలేకపోయింది. అయితే తన ద్వితీయ ప్రాధాన్యం ఈ సిఫార్సుకే ఇచ్చింది. ఈ సిఫార్సును చేయడమంటే మెజారిటీ ప్రజల అభిమతాన్ని గుర్తించడమేనని కూడా కమిటీ అభిప్రాయం. ఈ సిఫార్సును ప్రభుత్వం ఆమోదించదలుచుకుంటే పరిణామాలు ఉగ్రరూపం దాలుస్తాయని, జలవనరులు, విద్యుత్ సమస్యలు తెర మీదకు రావడం, సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల రాజీనామాలు, ఆందోళనలను ఎదుర్కొనవలసివస్తుందని కమిటీ చెప్పింది. ఆలోచించదగ్గదే అయినా ఈ సిఫార్సు అమలుకు నిర్ణయిస్తే తెలంగాణలో మతోన్మాదం, నక్సలిజం పెరిగే ఆస్కారముందని కూడా హెచ్చరించింది. విభజన ఆలోచన అనివార్యమని భావిస్తే, మూడు ప్రాంతాల మధ్య సుహృద్భావ పరిస్థితులు నెలకొల్పి అమలుచేయాలని కూడా భావించింది. తెలంగాణకు ప్రాంతీయ మండలి ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచి, తెలంగాణ రాజకీయ సాధికారత, సామాజికాభివృద్ధి ధ్యేయంగా ప్రాంతీయ మండలి ఏర్పాటుచేయాలి. రాజ్యాంగబద్ధమైన భద్రత కల్పించాలన్నది చివరి సిఫార్సు ఉద్దేశం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమేనన్న అభిప్రాయం తో కమిటీ ఈ సిఫార్సు చేసింది. కమిటీ ఈ సిఫార్సుకే తొలి ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్యలకు విభజన పరిష్కారంకాదని, ఐక్యంగా ఉండటమే మంచిదని కమిటీ చెప్పింది. 1956 నాటి పెద్దమనుషుల ఒప్పం దం మేరకే తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేసి తగిన నిధులు సమకూర్చాలి. తెలంగాణ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి, ప్రణాళికలు, జలవనరులు, నీటి పారుదల, విద్య, ఆరోగ్యం వంటివి మండలి పరిధిలో ఉంటాయి. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచడమే ఈ సిఫార్సు ధ్యేయం. ఈ కమిటీని తెలంగాణవాదులు ఎవరూ సమర్థించలేదు. కొన్ని పార్టీలు మాత్రం కమిటీ సిఫార్సులకు కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. తెరాస అధిపతి కేసీఆర్ కమిటీ పరిశీలనాంశాలనే అర్థరహితమని విమర్శించారు. అలాగే తెలంగాణ వెనుకబడి ఉందన్న తెరాస వాదనను కమిటీ పూర్వపక్షం చేసింది. గతంలో ఈ ప్రాంతం వివక్షకు గురైన మాట నిజమే అయినా 1971 తరువాత పరిస్థితి మెరుగుపడిందని వాదించింది. రాయలసీమ తెలంగాణ కంటె వెనుకబడి ఉందని స్పష్టం చేసింది. ఎడిట్ పేజీ డెస్క్