వీర్లపాలెంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు | Thermal power plant in veerlapalem, nalgonda district | Sakshi
Sakshi News home page

వీర్లపాలెంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు

Published Tue, Dec 23 2014 6:49 PM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

Thermal power plant in veerlapalem, nalgonda district

నల్గొండ: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామం థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలమని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తామని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మంగళవారం నల్గొండలో వెల్లడించారు. థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు నల్గొండ జల్లాలో సీఎం కేసీఆర్ మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించారు.  అనంతరం వీర్లపాలెంలో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానికంగా థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదే విషయాన్ని ఆయన మంత్రులు, ఎంపీ, ఉన్నతాధికారుల వద్ద వ్యక్తం చేశారు. థర్మల్ ప్లాంట్ను    వీర్లపాలెంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, కలెక్టర్ చిరంజీవులు, జెన్కో అధికారులు, ఎంపీ బూర నర్సయ్యగౌడ్లు పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరారు. ఈ 7500 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ను రూ. 55 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement