అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న బాల్క సుమన్
జైపూర్(చెన్నూర్): సింగరేణి థర్మల్ పవర్‌ప్లాంటు విస్తరణలో భాగంగా మరో 800 మెగావాట్ల థర్మల్ పపర్ ప్లాంటు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, ఎస్టీపీపీ ప్రభావిత 9 గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. జైపూర్ మండలం ఎల్కంటి, వేలాల, పౌనూర్ గ్రామాల్లో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్ ప్లాంటు విస్తర్ణతో సుమారు 400 నుంచి 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభి స్తాయన్నారు.
అనంతరం కుందారంలో రూ.1.56 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. జెడ్పీటీసీ మేడి సునీత, పంచాయతీరాజ్ డీఈ స్వామిరెడ్డి, తహశీల్దార్ మోహ న్‌రెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, ఐసీడీఎస్ సీడీపీవో మనోరమ, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బల్మూ రి అరవిందర్‌రావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బేతు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment