సీఎంను కలిసిన కోనప్ప
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. శనివారం ఆయన ఉమ్మడి జిల్లా నుంచి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి హైదరాబాద్‌లో సీఎంతో భేటీ అయ్యారు. సిర్పూర్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసిన నిధులు రద్దు చేయడం, స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని కోనప్ప ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మా రింది. కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని కాదని బీఎస్పీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. కాగజ్‌నగర్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క హాజరైన సమావేశానికి దూరంగా ఉండడంతో కోనప్ప కాంగ్రెస్‌ను వీడుతారనే సంకేతాలు వెళ్లాయి. సీఎంను కలిసిన తర్వాత పార్టీలోనే కొనసాగేందుకు సిద్ధమైనట్లు తెలు స్తోంది. అభివృద్ధి పనుల పెండింగ్‌పై సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment