ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ● ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ
మంచిర్యాలఅగ్రికల్చర్: ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడంలో అధికారులు, సిబ్బంది పొందుతున్న శిక్షణ ముఖ్యమైనదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ అంశాలను పాటించి ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని తెలిపారు. పోలింగ్‌కు ఒక రోజు ముందే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని తెలిపారు. జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 40 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు 18 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని, అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను పోలింగ్ కేంద్రం నుంచి స్ట్రాంగ్ రూమ్, అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment