రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్
● మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ● బోనస్ డబ్బుల కోసం రాస్తారోకో
దండేపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆరోపించారు. వరిధాన్యం బోనస్ డబ్బుల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం దండేపల్లిలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ రైతుభరోసా ద్వారా ఎకరాకు రూ.15వేలు అని చెప్పి తీరా రూ.12 వేలు ఇస్తామడం, అవి కూడా స కాలంలో చెల్లించలేదని అన్నారు. వానాకాలంలో కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యం విక్రయించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామని చెప్పి రెండు నెలలు గడుస్తున్నా చెల్లించడం లేదన్నారు. వెంటనే బోనస్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోవడంతో ఎస్సై తైసీనొద్దీన్, ఏఎస్సై రాజేందర్, సిబ్బంది ఆందోళనకారులను బలవంతంగా తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా నా యకుడు విజిత్‌రావు, మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, మాజీ వైస్‌ఎంపీపీ పసర్తి అనిల్, మాజీ ఉపసర్పంచ్ గొట్ల భూమన్న, నాయకులు రవీందర్, రాజమల్లు, సంతోష్, శ్రీనివాస్, మహేష్, తిరుపతి, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment