ఏరియా ఆస్పత్రిని సందర్శించిన సింగరేణి డైరెక్టర్
బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిని సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్టు, ప్లానింగ్) కే.వెంకటేశ్వర్లు శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఇటీవల డైరెక్టర్(పీపీ)గా పదోన్నతి పొందిన అనంతరం తొలిసారిగా వచ్చిన ఆయనకు వైద్యులు, సిబ్బంది, కార్మిక సంఘాల నాయకులు ఘన స్వా గతం పలికి సన్మానించారు. వెంకటేశ్వర్లు వైద్యులతో ఏరియా ఆసుపత్రి స్థితిగతులు తెలుసుకున్నా రు. కార్మిక సంఘాల నాయకులు, ప్రజాసంఘాల బాధ్యులు, రిటైర్డ్‌కార్మికులు సమస్యల పరిష్కారం కోసం పోటాపోటీగా వినతిపత్రాలు అందజేశారు. వైద్యనిపుణులు, సిబ్బందిని నియమించి కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని, మందుల కొరత లేకుండా చూడాలని కోరారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రి సమస్యల పరి ష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు చాంద్‌పాషా, మణిరాంసింగ్, అమానుల్లాఖాన్, మాజీ కౌన్సిలర్ పొట్ల సురేష్, మహేందర్, శంకర్, రాజ్‌కుమార్, మల్లయ్య, సిరిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment