సమస్యల పరిష్కారానికే పోలీస్ దర్బార్
● రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్
మంచిర్యాలక్రైం: సిబ్బంది సమస్యల పరిష్కారానికే పోలీస్ దర్బార్ నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ తెలి పారు. రామగుండం కమిషనరేట్‌లో శనివారం స్పెషల్ పార్టీ, క్యూఆర్‌టీ పోలీస్ సిబ్బందితో నిర్వహించిన పోలీస్ దర్బార్‌కు ఆయన హాజరయ్యారు. సిబ్బంది వ్యక్తిగత, కుటుంబ, ఆరో గ్య సమస్యలు, విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సమస్యల పరి ష్కారానికి ఇదొక మంచి వేదిక అని, అందరూ సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ ఉందని, ఎలాంటి సమస్యలున్నా పరిష్కారానికి కృషి చేస్తామ ని తెలిపారు. స్పెషల్ పార్టీ, క్యూఆర్‌టీ పోలీసులు విధి నిర్వహణలో ఎన్నో పని ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఒత్తిళ్లకు భయపడి ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్‌ఐలు దామోదర్, శ్రీనివాస్, ఆర్‌ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment