కల్వర్టును ఢీకొట్టిన కారు
ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
ఆసిఫాబాద్: మరో గంటలో ఇంటికి చేరుకునే సమయంలో జైనూర్ మండలంలోని ప్రధాన రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున కల్వర్టుకు కారు ఢీకొనడంతో జిల్లా కేంద్రానికి చెందిన ఒకరు మృతి చెందారు. జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారి మల్లూరి శ్రీనివాస్(40) మసాదే శ్రీనివాస్, మసాదే చింటు, నగేశ్ డిసెంబర్ 31న కర్ణాటకలోని గానుగాపురం యాత్రకు కారులో బయలుదేరి వెళ్లారు. తిరుగుప్రయాణంలో జైనూర్ మండలంలోని ప్రధాన రహదారిపై కారు కల్వర్టుకు ఢీకొనడంతో మల్లూరి శ్రీనివాస్ అక్కడిక్కడే మృతి చెందాడు.
మసాదే శ్రీనివాస్, నగేశ్, చింటుకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురికి ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనం తరం వేర్వేరుగా నాగ్‌పూర్, కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించారు. మృతుడు శ్రీనివాస్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. మృతుని సోదరుడు మల్లూరి శివరామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారు నడుపుతున్న మసాదే చింటుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జైనూర్ ఎస్సై సాగర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment