మద్యం మత్తులో యువకుల దుశ్చర్య
కేసు నమోదు.. పలువురి అరెస్ట్
నిర్మల్‌రూరల్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 అర్దరాత్రి వేళ.. కొందరు యువకులు తప్పతాగి గాంధీ విగ్రహాన్ని అవమానించారు. ఈ ఘటన నిర్మల్ రూరల్ మండలం నీలాయిపేటలో జరిగింది. స్థానికులు, రూరల్ పోలీ సుల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి నూత న సంవత్సర వేడుకల సందర్భంగా నీలాయిపేట గ్రామంలో పలువురు యువకులు వేడుకలు నిర్వహించారు. డీజే, ఆటపాటలతో సంబరాలను నిర్వహించారు.
పక్క గ్రామమైన అనంతపేటకు చెందిన పలువురు యువకులు అదే సమయంలో తప్పతాగి పక్కనే ఉన్న జాతీయ రహదారిపైకి వెళ్తూ నీలాయిపేటలో కాసేపు ఆగారు. అక్కడ ఉన్న యువకులతో వాగ్వివాదం పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా బస్టాండ్‌లో ఉన్న గాంధీ విగ్రహాన్ని అవమానం కలి గించారు. విగ్రహం నోట్లో సిగరెట్ పెట్టి, బీడీ కట్ట విగ్రహం పక్కన ఉంచారు.
విగ్రహం పక్కన ఉన్న జెండాలు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో పరారయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఏఎస్పీ రాజేశ్‌మీనా, రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్సై లింబాద్రి బుధవారం గ్రామానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మహాత్ముడిని అవమానించిన అనంతపేటకు చందిన 9 మంది యువకులను గర్తించారు. 8 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరొకరు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment