వ్యాధులపై అప్రమత్తం చేయాలి
మంచిర్యాలటౌన్: జిల్లా వైద్యఆరోగ్య శాఖలో పనిచేస్తున్న గెజిటెడ్ అధికారులందరూ ప్రజలతో మమేకమై పనిచేయాలని, వ్యాధులపై ప్రజ లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ హరీశ్‌రాజ్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గెజిటెడ్ అ ధికారుల టూర్ డైరీ, క్యాలెండర్లను సోమవా రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జాతీయ వైద్య కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కా ర్యకర్తలు, ఇతర సిబ్బందితో సమన్వయం చేసి పనిచేయాలని పేర్కొన్నారు. వాతావరణ మా ర్పులతో వచ్చే వ్యాధులు, కీటక జనిత వ్యాధులు, అసంక్రమణ వ్యాధులపైనా అవగాహన క ల్పించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎ.ప్రసాద్, డాక్టర్ సీతారామరాజు, డాక్టర్ కృపాబా యి, డాక్టర్ శివప్రతాప్, సూపరింటెండెంట్ వి శ్వేశ్వర్‌రెడ్డి, కాంతారావు, కె.వెంకటేశ్వర్లు, లింగారెడ్డి, కె.వెంకటేశ్వర్, కె.రమేశ్, సీహెచ్‌వో రా ఘవ, డెమో బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment