విద్యార్థులతో మమేకమై..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లా కలెక్టర్ కు మార్ దీపక్ సోమవారం విద్యార్థులతో మమేకమయ్యారు. హాజీపూర్ మండలం ముల్కల్ల జిల్లాపరి షత్ పాఠశాలను సోమవారం ఉదయం 9:30 గంట లకు తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో నే రుగా కలిసిపోయి చదువుల గురించి ఆరాతీశారు. సబ్జెక్ట్‌ల వారీగా పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు ఎలాంటి సందేహాలు లేకుండా సమాధానాలు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని సూచించారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల ఉ న్నతికి కృషి చేస్తున్న హెచ్‌ఎం గణపతిరెడ్డి, ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం పాఠశాలలోని రిజిస్టర్లు, హాజరు పట్టికలను పరిశీలించారు. వంటశాలను పరిశీలించి జాగ్రత్తలు సూచించారు. విద్యార్థులకు నూతన మెనూ ప్రకారం పోషక విలువలతో కూడి ఆహారం అందించాలని ఆదేశించారు.
ఇంటర్ పరీక్ష కేంద్రం తనిఖీ
మండలంలోని వేంపల్లిలోని ఎస్‌ఆర్‌ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం తనిఖీ చేశారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు.
హాజీపూర్ పీహెచ్‌సీ తనిఖీ
హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ కుమార్‌దీపక్ తనిఖీ చేశారు. ముందుగా ఆస్పత్రిలోని రిజిస్టర్లు పరిశీలించారు. మందుల నిల్వలు, వార్డులను పర్యవేక్షించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులను పలకరిస్తూ వైద్య సేవలు అందుతున్న తీరు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. కలెక్టర్ వెంట పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ లహరి, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment