సైక్లింగ్‌లో గిరిజన యువతి ప్రతిభ
నెన్నెల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నార్వాయిపేట గ్రామానికి చెందిన కున్సోతు రవి–తార దంపతుల కుమార్తె కున్సోతు స్నేహ సైక్లింగ్‌లో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటింది. తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కోహెడలో ఈనెల 7 నుంచి 10 వరకు నిర్వహించిన 9వ రాష్ట్రస్థాయి బైక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు బంగారు పతకాలు సాధించింది. విజేతగా నిలిచిన గిరిజన యువతి స్నేహను తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి భూలోకం జయకాంతారావు, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు మల్లారెడ్డి, వెంకటనర్సయ్య, కోచ్ సంజీవ్, పీఈటీ హారిక అభినందించారు. ఆసిఫాబాద్‌లో డిగ్రీ చదువుతున్న స్నేహ గతంలో రాష్ట్రస్థాయి సీఎం కప్‌లో రెండుసార్లు, జార్ఖండ్‌లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment