ప్రజావాణి.. టైంపాస్‌కు కాదు..!
నష్టపరిహారం అందించాలి
మేము మందమర్రి మండలం బుర్రెగూడెం నివాసులం. మా కు మందమర్రి శివా రు సర్వే నంబర్ 146 లో భూములు ఉండగా ఎన్‌హెచ్ 363 రోడ్డు విస్తరణలో పోయింది. ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు పరిహారం అందలేదు. పరిహారం అందించాలి.
– దుగుట రాజలింగు,
బుర్రెగూడ, మందమర్రి
మంచిర్యాలఅగ్రికల్చర్: ‘ప్రజావాణి టైం పాస్ కోసం కాదు.. అర్జీదారుల నుంచి పదే పదే వస్తున్న ఫిర్యాదులను తమ పరిధిలో కాకుంటే కాదని చెప్పాలి. లేదా పరిష్కరించాలి. పెండింగ్‌లో ఎందుకు పెడుతున్నారు. ప్రజావాణికి చాలా మంది అధికారులు రావడం లేదు. ఎందుకు డుమ్మా కొడుతున్నారు’ అని కలెక్టర్ కుమార్ దీపక్ ఆయా శాఖల అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్ శాఖల పరిధిలో పెద్ద ఎత్తున అర్జీలు పెండింగ్ ఉంటున్నాయని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హ రికృష్ణతో కలిసి సోమవారం ఫిర్యాదులు స్వీకరించా రు. భూసమస్యలు, పరిహారం, పెన్షన్, నీటి సమ స్య, విద్యుత్, తదితర సమస్యలపై అర్జీలు వచ్చా యి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి రాని వివిధ శాఖలకు నోటీసులు అందించాలని ఏవోను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో అందే ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలన్నారు.
● లక్సెట్టిపేట మండల కేంద్రానికి చెందిన అంబటి పద్మ తన భర్త పక్షవాతంతో బాధపడుతున్నాడని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తాను గతంలో మహిళా సంఘాల రాష్ట్రస్థాయి శిక్షకురాలిగా రైతు సంఘాల శిక్షకురాలిగా, ఎన్నికల సర్వేలో సైతం పని చేశానని తెలిపారు. తనకు ఉపాధి కల్పించాలని కోరారు.
● భీమిని మండలం కేస్లాపూర్ గ్రామానికి చెందిన పోతురాజుల పోచయ్య తనకు అక్కపల్లి గ్రామ శివారులో పట్టా భూమి ఉందని, ధరణి వచ్చిన తర్వాత లావోణి పట్టాగా చూపుతుందని తెలిపాడు. సవరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశాడు.
● దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన లింగం రేవతి తాను అంగన్వాడీ టీచర్‌గా పని చేసి పదవీ విరమణ పొందానని, తనకు రావాల్సిన రిటైర్‌మెంట్ బెన్‌ఫిట్స్ అందించి, ఆసరా ఫించన్ మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.
● జన్నారం మండల కేంద్రానికి చెందిన సంబారి అంజయ్య తన పట్టా భూమి నిషేధిత జాబితాలో చూపుతుందని, తొలగించి తనకు న్యాయం చేయాలని దరఖాస్తు అందజేశాడు.
● చెన్నూర్ మండలం సుద్దాల గ్రామంలోని బోరుమోటర్ కాలిపోయిందని, తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని, మిషన్ భగీరథ నీరు కూడా రావడం లేదని గ్రామానికి చెందిన మల్లేశ్ ఫిర్యాదు చేశాడు.
గ్రామ సభలు నిర్వహించాలి
బెల్లంపల్లిరూరల్: శాంతిఖని లాంగ్‌వాల్ ప్రాజెక్టుపై అధికారులు మరోమారు ప్రజాభిప్రాయ గ్రామసభలు నిర్వహించాలని ప్రభావిత గ్రా మాల రైతులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్‌కు ఈమేరకు వినతిపత్రం అందించారు. ఈ నెల 6న శాంతిఖని గని ఆవరణలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో అ ధికారులు రైతుల గోడు వినలేదని తెలిపారు. తమ అభిప్రాయాలను పరిగణలోని తీసుకోవా లని కోరారు. లాంగ్‌వాల్ ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలైన బట్వాన్‌పల్లి, పెర్కపల్లి, లింగాపూర్, ఆకెనపల్లి, పాత బెల్లంపల్లి, తాళ్లగురిజాల గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయం సేకరించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో మాజీ ఎంపీపీలు మల్లేశ్, శ్రీనివాస్, రైతులు శంకర్, కిరణ్, రాకేశ్, శంకర య్య, వినోద్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
అర్జీలు ఎందుకు పెండింగ్‌లో ఉంటున్నాయి
అధికారులు ఎందుకు డుమ్మా కొడుతున్నారు..
కలెక్టర్ కుమార్ దీపక్ ఆగ్రహం..
హాజరు కానివారికి షోకాజ్ నోటీసులు
ప్రజావాణి.. టైంపాస్‌కు కాదు..!
Comments
Please login to add a commentAdd a comment