ఎస్టీపీపీకి అవార్డు
జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)ను మరో అవార్డు వరించింది. మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ నిర్వహించిన జాతీయ ఎఫీషియెన్సీ అవార్డ్స్–2025లో భాగంగా ఏడో సంవత్సరానికి గాను నెట్ హీట్ రేట్ తగ్గింపు కేటగిరీలో 1000మెగావాట్లపైన గల దక్షిణ భారత థర్మల్ పవర్ ప్లాంట్లలో ఎస్టీపీపీకి బెస్ట్ ఎనర్జీ ఎఫీషియెంట్ ప్లాంటు–2025 అవార్డు లభించింది. ఒక కిలోవాట్ అవర్ విద్యుత్ ఉత్పతికి అవసరమయ్యే హీట్‌ను నెట్ హీట్ రేట్‌గా పరిగణిస్తారు. హీట్ రేట్ ఎక్కువగా ఉంటే బొగ్గు వినియోగం కూడా పెరిగి తద్వారా ఉత్పత్తి వ్యయం కూడా పెరుగుతుంది. ఎస్టీపీపీలో వినియోగిస్తున్న సాంకేతికత వల్ల తక్కువ హీట్ రేట్‌తోనే ఒక కిలోవాట్ అవర్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ మేరకు ఎస్టీపీపీ నుంచి డీజీఎం మహేందర్ గోవాలో సోమవారం జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. వరుసగా అవార్డు అందుకోవడంపై సంస్థ డైరెక్టర్ సత్యనారాయణ ఇంచార్జీ ఈడీ శ్రీనివాసులు అధికారులు, ఉద్యోగులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment