కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి
శ్రీరాంపూర్: కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు యజమాన్యాన్ని కోరారు. మంగళవారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏరియా స్థాయి స్ట్రక్చరల్ సమావేశం జరిగింది. జీఎం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గుర్తింపు సంఘం నుండి ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, సహాయ కార్యదర్శి మోత్కూరీ కొమురయ్య, తదితరులు హాజరై సమస్యలపై చర్చించారు. శ్రీరాంపూర్ ఓసీపీలో జీఎల్ బంకర్, సైట్ ఆఫీస్ వద్ద మరుగుదొడ్లు, తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని, ఇందారం 1ఏ గనిపై కార్మికులకు స్నానం గదులను ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో ఏరియా ఎస్‌ఓటు జీఎం సత్యనారాయణ, ఏజీఎం (ఫైనాన్స్) భీబత్సా, ఓసీపీ పీఓలు టీ శ్రీనివాస్, ఏవీ రెడ్డి, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, ఏరియా రక్షణ అధికారి శ్రీధర్‌రావు, డీజీఎంలు అరవిందరావు, ఆనంద్ కుమార్, ఏజెంట్లు శ్రీధర్, రాజేందర్, వెంకటేశ్వర్లు, అధికారులు డాక్టర్ రమేశ్‌బాబు, మల్లయ్య, కిరణ్ కుమార్, దేవేందర్ రెడ్డి, ఏఐటీయూసీ నాయకులు కొట్టే కిషన్ రావు, ప్రసాద్ రెడ్డి, నరసయ్య, రాంచందర్ పాల్గొన్నారు.
యువతి ఆత్మహత్య
శ్రీరాంపూర్: ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్ తెలిపిన వివరాల మేరకు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే 6 హట్స్ ఏరియాకు చెందిన మేరుగు సౌమ్య (22)కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. యువతి తండ్రి కొంతకాలం క్రితం మృతి చెందగా తల్లి కీర్తనతో కలిసి ఉంటుంది. సోమవారం సా యంత్రం కీర్తన సంతకు వెళ్లిన సమయంలో సూసైడ్ నోట్ రాసి ఇంటి పైకప్పుకు ఉరేసుకుంది. తనకు పెళ్లంటే ఇష్టం లేదని, జీవితంలో ఇంకో స్టెప్ తీసుకోలేనని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, సారీ మమ్మీ.. సారీ డాడి అని లేఖలో రాసి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి కీర్తన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి
Comments
Please login to add a commentAdd a comment